https://oktelugu.com/

అందరిదీ ఒక బాధ అయితే.. ఈ హీరోది మరో బాధ !

అందరిదీ ఒక బాధ అయితే.. హీరో రాజశేఖర్ ది మరో బాధ. వయసు అయిపోయినా రాజశేఖర్ మాత్రం ఇంకా హీరోగానే కొనసాగడానికే కిందామీదా పడుతూ తెగ ఇదైపోతున్నాడు. ఈ క్రమంలోనే తనతో సినిమాలు చేయడానికి ఏ నిర్మాత ముందుకు రాకపోయే సరికి, తన కుటుంబ సభ్యులనే నిర్మాతలను చేస్తూ మరీ, హీరోగా సినిమాలు చేస్తున్నాడు ఈ సీనియర్ హీరో. ఇప్పటికే రాజశేఖర్ రెండు కొత్త సినిమాలను స్టార్ట్ చేసిన సంగతి తెలిసిందే. క్రిష్ అసిస్టెంట్ లలిత్ అనే […]

Written By:
  • admin
  • , Updated On : March 22, 2021 / 06:03 PM IST
    Follow us on


    అందరిదీ ఒక బాధ అయితే.. హీరో రాజశేఖర్ ది మరో బాధ. వయసు అయిపోయినా రాజశేఖర్ మాత్రం ఇంకా హీరోగానే కొనసాగడానికే కిందామీదా పడుతూ తెగ ఇదైపోతున్నాడు. ఈ క్రమంలోనే తనతో సినిమాలు చేయడానికి ఏ నిర్మాత ముందుకు రాకపోయే సరికి, తన కుటుంబ సభ్యులనే నిర్మాతలను చేస్తూ మరీ, హీరోగా సినిమాలు చేస్తున్నాడు ఈ సీనియర్ హీరో. ఇప్పటికే రాజశేఖర్ రెండు కొత్త సినిమాలను స్టార్ట్ చేసిన సంగతి తెలిసిందే. క్రిష్ అసిస్టెంట్ లలిత్ అనే కొత్త కుర్రాడు చేస్తోన్న సినిమాతో పాటు ‘పూలరంగడు, అహన పెళ్ళంట’ చిత్రాల డైరెక్టర్ వీరభద్రం చౌదరి దర్శకత్వంలో మరో సినిమా చేస్తున్నాడు.

    Also Read: సత్తా చాటిన తెలుగు సినిమా.. జాతీయ పురస్కారాలు !

    అయితే ఇప్పుడు రాజశేఖర్ కి కొత్త సమస్య వచ్చి పడింది. వీరభద్రం చౌదరితో చేస్తోన్న సినిమాలో హీరోయిన్ పాత్ర చాల కీలకమైనదట. కొత్త హీరోయిన్ ను పెట్టలేరు. ఎందుకంటే సరికొత్త తరహా కథాంశంతో ఓ ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామాగా ఈ సినిమాని తీసుకురాబోతున్నారని.. కాబట్టి కచ్చితంగా కొంత స్టార్ డమ్ ఉన్న తెలిసిన హీరోయినే ఉండాలని.. కానీ రాజశేఖర్ అనగానే ఏ హీరోయిన్ ముందుకు రావడం లేదని.. అందుకే షూటింగ్ ను కూడా పోస్ట్ ఫోన్ చేసుకోవాల్సి వస్తోందని తెలుస్తోంది. పాపం రాజశేఖర్ కి మొన్నటివరకూ నిర్మాతల సమస్య ఉంది. ఇప్పుడు హీరోయిన్ సమస్య వచ్చి పడింది.

    Also Read: ‘పుష్ప’లో పైశాచిక ఆనందం.. బన్నీ వల్లే !

    అన్నట్టు మరో దర్శకుడు లలిత్ చేస్తోన్న సినిమా షూట్ ను వచ్చే వారం నుండి ప్లాన్ చేస్తున్నారు. ఈ షూట్ లో రాజశేఖర్ తో పాటు మిగిలిన నటీనటులందరూ కూడా పాల్గొనబోతున్నారు. ముఖ్యంగా ఈ సినిమాలో రాజశేఖర్ కుమార్తె శివాత్మిక రాజశేఖర్ కూడా నటిస్తోంది. రాజశేఖర్ పాత్రకు మరియు శివాత్మిక పాత్రకు మధ్య వచ్చే సెంటిమెంట్ సీన్స్ సినిమా మొత్తంలోనే మెయిన్ హైలెట్ గా ఉంటాయని టాక్. ఈ సినిమాలో రాజశేఖర్ ఎమ్మెల్యేగా నటించబోతున్నాడు. మరి ఈ సినిమాతో ఈ సీనియర్ హీరోకి హిట్ వస్తోందా చూడాలి.

    మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్