Heroine Srileela: ఇండస్ట్రీ లోకి వచ్చిన అతి తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్ రేంజ్ కి ఎదిగిన కొందరిలో ఒకరు శ్రీలీల. శ్రీకాంత్ కొడుకు రోషన్ హీరో గా పరిచయం అవుతూ తెరకెక్కిన ‘పెళ్లి సందడి’ చిత్రం ద్వారా ఈ కన్నడ బ్యూటీ ఇండస్ట్రీ లోకి అడుగుపుట్టింది. ఈ సినిమా కమర్షియల్ గా పర్వాలేదు అనిపించున్నప్పటికీ, అందులో హీరోయిన్ గా చేసిన శ్రీలీలపై అందరి ద్రుష్టి పడింది. ఈ అమ్మాయి చూసేందుకు చాలా అందంగా ఉంది, డ్యాన్స్ కూడా ఇరగదీస్తోంది అని పెద్ద ఎత్తున సోషల్ మీడియా లో నెటిజెన్స్ చర్చించుకున్నారు. ఇక రెండవ సినిమా ‘ధమాకా’ తో ఆమె తన సత్తా ని చూపించింది. కేవలం ఆమె వేసిన డ్యాన్స్ కారణంగానే ఈ సినిమా పెద్ద హిట్ అయ్యిందని అప్పట్లో టాక్ బలంగా వినిపించింది. దర్శక నిర్మాతలు కూడా అది గట్టిగా నమ్మారు. అందుకే ఆమెకి అవకాశాలు క్యూలు కట్టాయి.
అయితే చేతికి అందిన ప్రతీ సినిమా చేస్తూ రావడం వల్ల శ్రీలీల కి వరుసగా డిజాస్టర్ ఫ్లాప్స్ వచ్చాయి. ఎంత స్పీడ్ గా పైకి వెళ్లిందో, అంతే స్పీడ్ గా క్రిందకి పడిపోయిందని అందరూ అనుకున్నారు. కానీ శ్రీలీల మాత్రం తాను పడిపోలేదని, కేవలం తన MBBS పరీక్షల కోసమే షూటింగ్స్ తగ్గించమని చెప్పుకొచ్చింది. ఇది ఇలా ఉండగా మొదటి నుండి శ్రీలీల ఐటమ్స్ సాంగ్స్ విషయంలో చాలా కచ్చితమైన నిర్ణయంతో ఉండేది. ఎట్టిపరిస్థితిలోను ఐటెం సాంగ్ చేయనని చెప్పుకొచ్చింది. కానీ డైరెక్టర్ సుకుమార్ అడిగిన వెంటనే ‘పుష్ప 2 ‘ లో ‘కిస్సిక్’ అనే ఐటెం సాంగ్ చేసింది. ఈ పాట దేశవ్యాప్తంగా సెన్సేషన్ అయిన సంగతి అందరికీ తెలిసిందే. నార్త్, సౌత్ అని తేడా లేదు, ఎక్కడ చూసిన ఈ పాటనే వినిపిస్తుంది. ముఖ్యంగా శ్రీలీల డ్యాన్స్ కి నార్త్ ఇండియన్స్ మేనటలెక్కిపోయారు. ఇంస్టాగ్రామ్ లో ఈ పాట మీద ఎన్ని రీల్స్ వచ్చాయో లెక్కపెట్టడం కూడా కష్టమే.
కేవలం నెటిజెన్స్ మాత్రమే కాదు, సెలబ్రిటీస్ కూడా ఈ పాటపై వేల సంఖ్యలో రీల్స్ చేసారు. రీసెంట్ గా శ్రీలీల తో కలిసి ప్రముఖ క్యారక్టర్ ఆర్టిస్ట్/ కమెడియన్ బ్రహ్మాజీ కలిసి ఈ పాట మీద రీల్ చేసాడు. ‘దెబ్బలు పడుతాయి రాజా..నీకు దెబ్బలు పడుతాయి’ అంటూ శ్రీలీల తో కలిసి ఆయన సరదాగా చేసిన ఈ రీల్ ఇప్పుడు ఇంస్టాగ్రామ్ లో బాగా వైరల్ అయ్యింది. ఈ రీల్ క్రింది కామెంట్స్ లో నెటిజెన్స్ అనేక ఫన్నీ కామెంట్స్ చేసారు. కొంతమంది అసభ్యంగా మాట్లాడుతూ కూడా చేసారు. ఇకపోతే శ్రీలీల ప్రస్తుతం నితిన్ తో కలిసి రాబిన్ హుడ్ అనే చిత్రం, అదే విధంగా రవితేజ తో కలిసి ‘మాస్ జాతర’ వంటి చిత్రాల్లో హీరోయిన్ గా నటిస్తుంది. వీటిలోకి పాటు ఆమె పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ‘ఉస్తాద్ భగత్ సింగ్’ చిత్రంలో కూడా హీరోయిన్ గా చేస్తుంది.