Jabardasth New Judge: జబర్దస్త్, ఎక్స్ట్రా జబర్దస్త్ షోలకు మునుపటి కళ లేదు. స్టార్స్ ఒక్కొక్కరిగా తప్పుకున్న నేపథ్యంలో ఆడియన్స్ పెద్దగా ఆసక్తి చూపడం లేదు. ఒకప్పుడు జబర్దస్త్ షోలు బుల్లితెరను ఏలాయి. రికార్డు టీఆర్పీతో సంచలనాలు నమోదు చేశాయి. జబర్దస్త్ నుండి మొదట నాగబాబు వెళ్లిపోయారు. ఆయనతో పాటు చమ్మక్ చంద్ర, కిరాక్ ఆర్పీ వంటి కమెడియన్స్ గుడ్ బై చెప్పేశారు. మంత్రి పదవి రావడంతో రోజా కూడా జడ్జిగా తప్పుకున్నారు. సుడిగాలి సుధీర్, హైపర్ ఆదితో పాటు పలువురు స్టార్ కమెడియన్స్ జబర్దస్త్ షో నుండి వెళ్లిపోయారు.
స్టార్స్ లేకపోవడంతో జబర్దస్త్, ఎక్స్ట్రా జబర్దస్త్ షోలు స్ట్రగుల్ అవుతున్నాయి. పునర్వైభవం తెచ్చేందుకు మేకర్స్ బాగానే కష్టపడుతున్నారు. కష్టపడి గెటప్ శ్రీనును తిరిగి తీసుకొచ్చారు. హైపర్ ఆది వచ్చాడు కానీ మరలా వెళ్ళిపోయాడు. సుడిగాలి సుధీర్ హీరోగా బిజీ. కాగా జబర్దస్త్ యాంకర్ గా ఒకప్పటి స్టార్ హీరోయిన్ ని దించారు. ఆమె ఎవరో కాదు. జయం ఫేమ్ సదా. లేటెస్ట్ ఎక్స్ట్రా జబర్దస్త్ ఎపిసోడ్ కి సదా జడ్జిగా వచ్చారు.
సదా రాకతో షో కొంచెం కలర్ఫుల్ గా మారింది. ఆమె గ్లామర్, వెలుగులు పంచె నవ్వులు ఆడియన్స్ ని మెస్మరైజ్ చేశాయి. కృష్ణ భగవాన్, సదా జడ్జెస్ట్ గా వ్యవహరిస్తున్నారు. మొన్నటి వరకు కుష్బూ జడ్జిగా ఉన్నారు. సదా కొన్నాళ్ల పాటు జడ్జిగా ఉంటారనే ప్రచారం జరుగుతుంది. ఆమె పెర్ఫార్మన్స్ బాగుంటే పర్మినెంట్ గా సెట్ అయ్యే ఛాన్స్ ఉంది. లేదంటే మేకర్స్ మరొక సెలబ్రిటీని జడ్జిగా తీసుకొస్తారు.
సదా బుల్లితెర జడ్జిగా అపార అనుభవం కలిగి ఉన్నారు. తెలుగు, తమిళ భాషల్లో ఆమె పలు షోలకు జడ్జిగా వ్యవహరించారు. ఇటీవల స్టార్ లో ప్రసారమైన బీబీ జోడి జడ్జిగా కూడా చేశారు. అందుకే జబర్దస్త్ కి సదా ఫేమ్ తెచ్చిపెడతారని మేకర్స్ నమ్ముతున్నారు. సదా హీరోయిన్ గా రిటైర్ అయ్యారు. జయం మూవీతో సిల్వర్ సిల్వర్ స్క్రీన్ కి పరిచయమైన సదా సంచలన విజయం నమోదు చేశారు. ఆమెను జయం ఓవర్ నైట్ స్టార్ చేసింది. సౌత్ ఇండియాలో టాప్ హీరోయిన్ గా సదా తెలుగు, తమిళ భాషల్లో చిత్రాలు చేశారు.