Nithya Menen: సౌత్ ఇండియాలో అన్ని భాషల్లో గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్ నిత్యా మీనన్. ఈ మలయాళ కుట్టికి సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. అలా మొదలైంది మూవీతో తెలుగు అడుగుపెట్టిన నిత్యా మీనన్ మొదటి మూవీతోనే సూపర్ హిట్ కొట్టింది. ఇష్క్ మూవీతో నిత్యా మీనన్ తెలుగులో ఫేమ్ రాబట్టారు. సన్ ఆఫ్ సత్యమూర్తి, జనతా గ్యారేజ్ వంటి చిత్రాల్లో స్టార్ హీరోల సరసన నటించారు. హిందీలో కూడా నిత్యా మీనన్ సినిమాలు చేయడం విశేషం.
తెలుగులో ఆమె చివరిగా నటించిన చిత్రం భీమ్లా నాయక్. పవన్ కళ్యాణ్ తో జతకట్టారు. పవర్ ఫుల్ లేడీ పాత్రలో సత్తా చాటింది. తమిళంలో నిత్యా మీనన్ సినిమాలు చేసింది తక్కువే. అదిరిందిలో విజయ్ వంటి టాప్ స్టార్ తో జతకట్టింది. అయితే ఆమె కోలీవుడ్ లో లైంగిక వేధింపులు ఎదుర్కొన్నానని మీటూ కామెంట్స్ చేసింది. నిత్యా మీనన్ చేసిన తాజా వ్యాఖ్యలు సంచలనం రేపుతున్నాయి.
సౌత్ ఇండియాలో నేను ఎప్పుడూ వేధింపులకు గురి కాలేదు. తెలుగులో కూడా మంచి వాతావరణం నెలకొంది. అయితే తమిళ పరిశ్రమలో ఒక హీరో నన్ను ఇబ్బంది పెట్టాడు. అసభ్యంగా తాకుతూ పిచ్చిగా ప్రవర్తించాడు. అతని ప్రవర్తన కారణంగా షూటింగ్ కూడా సరిగా చేయలేకపోయాను. ఎక్కడైనా ఇలాంటి వాతావరణం ఉంటే మహిళలు పని చేయలేరు. అందుకే ఈ రోజుల్లో కూడా మహిళలు బయటకు వెళ్లి పని చేసేందుకు భయపడుతున్నారని, ఆమె అన్నారు.
నిత్యా మీనన్ నటించింది తమిళ చిత్రాలను పరిశీలిస్తూ ఆ హీరో ఎవరై ఉంటారనే నెటిజెన్స్ ఆలోచనలో పడ్డారు. ఆమె మాత్రం పేరు చెప్పలేదు. కాగా సింగర్ చిన్మయి శ్రీపాద కోలీవుడ్ లో మీ టూ ఉద్యమం చేశారు. ఆమె ఎప్పటికీ రైటర్ వైర ముత్తు మీద అలుపెరగని పోరాటం చేస్తున్నారు. తన కెరీర్ కి నష్టం వాటిల్లినా చిన్మయి తగ్గలేదు. నిత్యా మీనన్ తాజా కామెంట్స్ తో సమస్య అక్కడ ఎక్కువగా ఉందేమో అనిపిస్తుంది.