Heroine Megha Akash Marriage: తొలిసినిమా నుండే అందం మరియు అభినయం తో ఆకట్టుకోవడం అనేది హీరోయిన్స్ కి కత్తి మీద సాము లాంటిది. ఒక్కసారి ఆడియన్స్ కి కనెక్ట్ అయితే చాలు, ఇక ఆడియన్స్ బ్రహ్మరథం పట్టేస్తారు. అలా మొదటి సినిమాతోనే ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకున్న హీరోయిన్ మేఘా ఆకాష్. నితిన్ మరియు హను రాఘవపూడి కాంబినేషన్ లో వచ్చిన ‘లై’ సినిమా తో ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన మేఘా ఆకాష్ , ఈ సినిమా అట్టర్ ఫ్లాప్ అయ్యినప్పటికీ కూడా ఆమెకి మళ్ళీ నితిన్ తోనే ‘చల్ మోహన్ రంగ’ అనే చిత్రం లో హీరోయిన్ గా నటించే ఛాన్స్ దక్కింది.
ఈ సినిమా కూడా అట్టర్ ఫ్లాప్ అయ్యింది. అయినప్పటికీ ఈ అమ్మాయికి తెలుగు మరియు తమిళ భాషల్లో అవకాశాలు వస్తూనే ఉన్నాయి. కెరీర్ లో సక్సెస్ రేట్ తక్కువ ఉన్నప్పటికీ కూడా, ఇప్పటి వరకు ఈమె 20 సినిమాలకు పైగా నటించింది, రీసెంట్ గా రవితేజ హీరో గా నటించిన ‘రావణాసుర’ సినిమాలో నెగటివ్ రోల్ లో నటించింది అందరినీ షాక్ కి గురి చేసింది.
ఇకపోతే ఈమె త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతున్నట్టు ఇండస్ట్రీ వర్గాల్లో టాక్ వినిపిస్తుంది. తమిళనాడు కి చెందిన ఒక ప్రముఖ రాజకీయ నాయకుడు కుమారుడితో ఈమె ప్రేమ వ్యవహారం నడిపింది. ఇప్పుడు అతనిని అతి త్వరలోనే పెళ్లాడింది.వేలకోట్ల రూపాయిల ఆస్తికి అధిపతి అయినా అతనిని పెళ్లాడబోతున్న మేఘ ఆకాష్ కి లక్ మామూలు రేంజ్ లో కలిసి రాలేదు అంటూ సోషల్ మీడియా లో నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు.
మరోపక్క మేఘా ఆకాష్ కి ఈ ఏడాది కెరీర్ పరంగా గోల్డెన్ పీరియడ్ నడుస్తుందనే చెప్పాలి. ఇప్పటికే ఈమె హీరోయిన్ గా నటించిన 5 సినిమాలు విడుదల అయ్యాయి.మరో మూడు సినిమాలు ఇప్పుడు చిత్రీకరణ దశలో ఉన్నాయి. ఇవి కాకుండా మరో ఆరు సినిమాల్లో హీరోయిన్ గా నటించడానికి సంతకం చేసింది. ఇలా కెరీర్ లో ఎన్నడూ లేనంత బిజీ గా గడుపుతూ స్టార్ లీగ్ లోకి అడుగుపెట్టే దిశగా అడుగులు వేస్తుంది మేఘా ఆకాష్.