Heroine Laya: లయ వస్తోంది.. ఈసారి లయ దొరుకుతుందా..?

ప్రస్తుతం ఆమె అమెరికాలో ఒక సాప్ట్ వేర్ కంపెనీలో జాబ్ చేస్తూ అక్కడే సెటిల్ అయ్యారు. చాలా రోజుల నుంచి సోషల్ మీడియాలో ఆవిడ యాక్టివ్ గా ఉంటున్నారు.

Written By: Gopi, Updated On : September 24, 2023 3:26 pm

Heroine Laya

Follow us on

Heroine Laya: సినిమా ఇండస్ట్రీలో చాలా మంది హీరోయిన్లు స్టార్ హీరోయిన్లు గా మారి మంచి గుర్తింపు తెచ్చుకుంటూ ఉంటారు. ఒకప్పుడు సావిత్రి, వాణిశ్రీ లాంటివారు టాప్ హీరోయిన్ లా కొనసాగారు. ఇక వాళ్ళ తర్వాత సౌందర్య ,రమ్యకృష్ణ, రంభ లాంటివారు చాలా కాలం పాటు ఇండస్ట్రీలో తమదైన మార్క్ నటన ని చూపిస్తూ మంచి గుర్తింపు సంపాదించుకున్నారు.

అయితే స్వయంవరం సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన లయ ఆ సినిమాతో హీరోయిన్ గా మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఇంకా ఆ సినిమా నుంచి ఆమెకి వరుసగా ఆఫర్లు రావడం మొదలయ్యాయి. దాంతో ఆమె వరుసగా ప్రేమించు, పెళ్ళాం తో పనేంటి, హనుమాన్ జంక్షన్ లాంటి సినిమాల్లో నటించి మంచి పొజిషన్ కి వెళ్లారు. ఇక ఇండస్ట్రీలో ఆమె పెద్ద హీరోల నుంచి అవకాశాలు రాక మీడియం రేంజ్ హీరోలతోనే సినిమాలు చేస్తూ ఉండేవారు. అలా సినిమాలు చేసిన ఆవిడ తర్వాత ఆమె చేసిన సినిమాలు వరుసగా ప్లాప్ అవడంతో ఆమె ఇండస్ట్రీ నుంచి ఫేడ్ అవుట్ అవ్వాల్సి వచ్చింది. నిజానికి ఆమె హీరోయిన్ గా మంచి గుర్తింపును తెచ్చుకున్నారు. కానీ ఇక్కడ పెద్దగా సక్సెస్ లు దక్కకపోవడంతో ఫేడ్ అవుట్ అవ్వాల్సి వచ్చింది.

ప్రస్తుతం ఆమె అమెరికాలో ఒక సాప్ట్ వేర్ కంపెనీలో జాబ్ చేస్తూ అక్కడే సెటిల్ అయ్యారు. చాలా రోజుల నుంచి సోషల్ మీడియాలో ఆవిడ యాక్టివ్ గా ఉంటున్నారు. అందులో భాగంగానే రీల్స్ చేస్తూ ప్రేక్షకులు అందరిని ఆకర్షిస్తున్నారు. ఇక ఇలాంటి సమయంలో ఆకాశం వస్తే ఆవిడ రీ ఎంట్రీ ఇవ్వడానికి రెడీగా ఉన్నాను అంటూ కూడా ఒక ఇంటర్వ్యూలో తెలియజేశారు. దాంతో ఇప్పుడు కళ్యాణ్ రామ్ హీరోగా వస్తున్న కొత్త సినిమాలో ఆవిడ ఒక క్యారెక్టర్ చేయబోతున్నట్టుగా వార్తలు వస్తున్నాయి.

నిజానికి ఆవిడ మంచి నటి ఆవిడకి మంచి క్యారెక్టర్ పడితే మంచి నటిగా గుర్తింపు పొందుతారు అనడంలో ఎంత మాత్రం సందేహం లేదు. ప్రస్తుతం తెలుగు లో లేడి క్యారెక్టర్ ఆర్టిస్ట్ లకు మంచి డిమాండ్ ఉంది ఈ టైం లో ఆమెకి ఒక మంచి క్యారెక్టర్ పడితే ఆమె క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మళ్ళీ బిజీ అయిపోతారు అని చాలామంది సినీ మేధావులు సైతం అభిప్రాయపడుతున్నారు…