Krithi Shetty: ఇండస్ట్రీ లోకి వచ్చిన తొలిసినిమాతోనే తన అందం మరియు అద్భుతమైన నటన తో కోట్లాది మంది అభిమానుల హృదయాలను కొల్లగొట్టిన అతి తక్కువ మంది హీరోయిన్స్ లో ఒకరు కృతి శెట్టి. ఉప్పెన సినిమాతో ఈ బ్యూటీ సృష్టించిన ప్రభంజనం మామూలుది కాదు, కేవలం ఆమె కోసమే థియేటర్స్ కి వెళ్లిన కుర్రాళ్ళ సంఖ్య లక్షల్లోనే ఉంటుంది.
ఆ రేంజ్ హిట్ తర్వాత ఈమెకి వరుసగా ‘శ్యామ్ సింఘా రాయ్’ మరియు ‘బంగార్రాజు’ వంటి సూపర్ హిట్ సినిమాలు వచ్చాయి. కానీ ఆ తర్వాత ఈమె చేసిన సినిమాలన్నీ వరుసగా ఒకదాని తర్వాత ఒకటి బోల్తా కొడుతూ వచ్చాయి. రీసెంట్ గా ఈమె నాగ చైతన్య తో కలిసి చేసిన ‘కస్టడీ’ చిత్రం కూడా పెద్ద డిజాస్టర్ ఫ్లాప్ అయ్యింది. దీనితో అమ్మడు కెరీర్ డైలమా లో పడిందని ఈమెని అభిమానించే వాళ్ళు బాధపడ్డారు.
అలాంటి సమయం లో ఆమెకి అదృష్టం తలుపు తట్టింది. ‘కస్టడీ’ చిత్ర డైరెక్టర్ వెంకట్ ప్రభు త్వరలోనే తమిళ స్టార్ హీరో ఇలయథలపతి విజయ్ తో ఒక సినిమా చెయ్యబోతున్నాడు. ఈమధ్యనే ఈ చిత్రానికి సంబంధించిన అధికారిక ప్రకటన ఒకటి బయటకి వచ్చింది.అయితే ఈ సినిమాలో ఇద్దరు హీరోయిన్స్ ఉంటారట, అందులో ఒక హీరోయిన్ గా కృతి శెట్టి ఎంపిక అయ్యినట్టు కోలీవుడ్ వర్గాల్లో వినిపిస్తున్న లేటెస్ట్ న్యూస్.ఇదే కనుక నిజం అయితే ఇక కృతి శెట్టి నక్క తోక తొక్కినట్టే అని చెప్పొచ్చు. ఎందుకంటే ప్రస్తుతం ఆమె ఉన్న పరిస్థితికి మీడియం రేంజ్ హీరో అవకాశం ఇవ్వడమే చాలా ఎక్కువ.
అలాంటిది ఫ్లాప్ సినిమాలను సైతం సూపర్ హిట్ ని చేసేంత స్టార్ స్టేటస్ ఉన్న విజయ్ సినిమాలో ఛాన్స్ దక్కడం అనేది సాధారణమైన విషయం కాదు. సినిమా హిట్ అయినా ఆమె సౌత్ లోనే ఓవర్ నైట్ స్టార్ హీరోయిన్ అయిపోతుంది, ఫ్లాప్ అయినా ఆమెకి వచ్చే నష్టం ఏమి లేదు. అయితే ఈ చిత్రం లో ఆమె మెయిన్ హీరోయిన్ గా నటిస్తుందా, లేదా సెకండ్ హీరోయిన్ గా నటిస్తుందా అనేది తెలియాల్సి ఉంది.