Faria Abdullah: హైదరాబాద్ బ్యూటీ ఫరియా అబ్దుల్లా సూపర్ టాలెంటెడ్ యాక్ట్రెస్. మంచి డాన్సర్ కూడా. అయితే పాపకు కాలం కలిసి రావడం లేదు. మేకర్స్ ఫరియా పట్ల పెద్దగా ఆసక్తి చూపడం లేదు. ఆమెను చిన్న చిన్న పాత్రలకు పరిమితం చేస్తున్నారు. జాతిరత్నాలు మూవీతో ఫరియా సిల్వర్ స్క్రీన్ కి పరిచయమైంది. నూతన దర్శకుడు అనుదీప్ కేవీ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. జాతిరత్నాలు సంచలన విజయం సాధించింది. నవీన్ పోలిశెట్టి, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణలతో పోటీ పడి ఫరియా కామెడీ పంచింది.
జాతిరత్నాలు మూవీతో ఓవర్ నైట్ ఫేమ్ తెచ్చుకుంది ఫరియా. అయితే ఆమెకు చెప్పుకోదగ్గ స్థాయిలో ఆఫర్స్ రాలేదు. మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్ మూవీలో చిన్న రోల్ చేసింది. బంగార్రాజు మూవీలో ఐటెం సాంగ్ చేసింది. సోలో హీరోయిన్ గా లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మూవీలో నటించింది. యంగ్ హీరో సంతోష్ శోభన్ హీరోగా నటించిన ఈ రొమాంటిక్ లవ్ ఎంటర్టైనర్ కనీస ఆదరణ దక్కించుకోలేదు.
అనూహ్యంగా రవితేజ మూవీతో ఆమెకు బంపర్ ఛాన్స్ దక్కింది. రావణాసుర మూవీలో ఒక హీరోయిన్ గా ఫరియా అబ్దుల్లా నటించింది. టైం బ్యాడ్… రావణాసుర డిజాస్టర్ అయ్యింది. దర్శకుడు సుధీర్ వర్మ హీరో రవితేజను డిఫరెంట్ గా ప్రజెంట్ చేసే క్రమంలో తప్పటడుగులు వేశాడు. రావణాసుర కనీస వసూళ్లు రాబట్టలేదు. ప్రస్తుతం ఫరియా చేతిలో అధికారికంగా ఒక్క ప్రాజెక్ట్ లేదు.
అయితే సోషల్ మీడియాలో ఫ్యాన్స్ కి అందుబాటులో ఉంటుంది. ఫారియా అబ్దుల్లా డాన్స్ వీడియోలకు బాగా క్రేజ్ ఉంది. లక్షల్లో వాటిని నెటిజెన్స్ వీక్షిస్తూ ఉంటారు. అందుకే శ్రమ అనుకోకుండా అదిరిపోయే డాన్స్ మూమెంట్స్ తో వీడియోలు చేసి ఇంస్టాగ్రామ్ లో అప్లోడ్ చేస్తుంది. బేసిక్ గా మంచి డాన్సర్ కావడంతో తన స్కిల్స్ చూపిస్తుంది. తాజాగా బెడ్ పై విరహ వేదన పడుతున్న హాట్ వీడియో షేర్ చేసింది. ఫరియా వీడియో కుర్రాళ్ళ గుండెల్లో గుబులు రేపుతోంది.
View this post on Instagram