Noyal -Ester: సింగర్ నోయల్ సీల్ పై మాజీ భార్య ఎస్తేర్ నోరాన్హ సంచలన ఆరోపణలు చేశారు. ఫస్ట్ టైం ఆమె విడాకులకు కారణాలు వెల్లడించారు. నోయల్ ని ఎస్తేర్ ప్రేమించి వివాహం చేసుకున్నారు. ప్రొఫెషనల్ గా ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది. దీంతో చాలా కాలం డేటింగ్ చేశారు. ఎస్తేర్ తో నోయల్ రిలేషన్ నడుపుతున్నాడన్న న్యూస్ బయటకు వచ్చింది. మీడియాలో కథనాలు వచ్చాక నోయల్-ఎస్తేర్ తాము ప్రేమించుకుంటున్న మాట నిజమేనని క్లారిటీ ఇచ్చారు. అనంతరం ఇరు కుటుంబాల పెద్దలను ఒప్పించి వివాహం చేసుకున్నారు. 2019లో నోయల్-ఎస్తేర్ పెళ్లి ఘనంగా సన్నిహితుల మధ్య జరిగింది.

పెళ్ళైన ఏడాదికే వీరు విడాకుల ప్రకటన చేయడం సంచలనం రేపింది. అయితే రోజుల వ్యవధిలోనే వీరు విడిపోయినట్లు సమాచారం. కొన్నాళ్ళు తమ బ్రేకప్ ని దాచారు. 2020లో అధికారికంగా ప్రకటించారు. విడాకులు తీసుకున్నట్లు వెల్లడించిన ఈ జంట ఎక్కడా కారణాలు తెలుపలేదు. ఒకరిపై మరొకరు ఆరోపణలు చేసుకున్న దాఖలాలు లేవు. అయితే విడాకులు తర్వాత మొదటిసారి ఎస్తేర్ ఓపెన్ అయ్యారు. ఆమె నోయల్ పై కొన్ని ఆరోపణలు చేయడం జరిగింది.
పెళ్ళైన 16 రోజులకే నోయల్ నిజ స్వరూపం తెలిసింది. అందుకే విడిపోవాలని నిర్ణయించుకున్నాను. ఎంత త్వరగా విడాకులు వస్తే అంత మంచిదని ఫీల్ అయ్యాను. విడిపోయిన అనంతరం నోయల్ నాపై దుష్ప్రచారం చేశాడు. నన్ను తప్పుగా చిత్రీకరించాడు. దీంతో నాకు సోషల్ మీడియా వేధింపులు ఎదురయ్యాయి. ఒక వ్యక్తి అయితే హైదరాబాద్ లో కనిపిస్తే యాసిడ్ పోస్తా అంటూ బెదిరించాడు. బిగ్ బాస్ హౌస్ లో విడాకులను సింపతీ కోసం వాడుకునే ప్రయత్నం చేశాడు. అది చూశాక ఇలాంటి మనుషులు కూడా ఉంటారా అనిపించిందని, ఎస్తేర్ తీవ్ర ఆరోపణలు చేశారు.
ఎస్తేర్ ఆరోపణల నేపథ్యంలో నోయల్ ఎలా స్పందిస్తారో చూడాలి. బిగ్ బాస్ సీజన్ 4లో నోయల్ పాల్గొన్నాడు. నోయల్ అనారోగ్య సమస్యలతో బయటకు రావడం జరిగింది. ఇంట్లో అభిజిత్, హారిక, లాస్యలతో నోయల్ ఉండేవాడు. వాళ్ళందరూ ఒక టీమ్ గా ఆడారు. సింగర్ నోయల్ నటుడిగా కూడా రాణించాడు. కుమారి 21 ఎఫ్, నాన్నకు ప్రేమతో, ప్రేమమ్ వంటి అనేక హిట్ చిత్రాల్లో నటించాడు. రచయితగా, రాప్ సింగర్ గా కూడా నోయల్ కి గుర్తింపు ఉంది. విడాకుల సంఘటన మానసికంగా చాలా కృంగదీసినట్లు నోయల్ బిగ్ బాస్ హౌస్లో వెల్లడించాడు.