Heroes Remunerations: సినిమా ఇండస్ట్రీలో ప్రస్తుతం పెను మార్పులైతే జరుగుతున్నాయి. భారీ బడ్జెట్ తో మన స్టార్ హీరోలు సినిమాలను చేయడంతో అత్యధికంగా రెమ్యునరేషన్స్ తీసుకుంటూ బడ్జెట్ ను పెంచే ప్రయత్నం చేస్తున్నారు. ఇక దానివల్లే టికెట్ రేట్ పెంచుతున్నారు. దానివల్ల భారీ ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. ఇక భారీ బడ్జెట్ ను పెంచడానికి ముఖ్య కారణం ఏంటి అంటే హీరోలు భారీ రేంజ్ లో రెమ్యూనరేషన్స్ ను ఛార్జ్ చేస్తున్నారు అంటూ చాలామంది ప్రొడ్యూసర్లు సైతం వాళ్ళ ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు… ఇక ఇప్పటికైనా దీనిమీద చర్యలు తీసుకోవాల్సిన అవసరమైతే ఉందని చాలామంది ప్రేక్షకులు సైతం వాళ్ళ అభిప్రాయాలను తెలియజేస్తున్నారు. గత కొన్ని రోజుల నుంచి సోషల్ మీడియా మొత్తం ఇదే న్యూస్ వైరల్ అవుతోంది.
సగటు ప్రేక్షకుడు థియేటర్ కి రావడం లేదంటూ సినిమా ప్రొడ్యూసర్లందరూ వాళ్ల ఆవేదనను వ్యక్తం చేస్తుంటే, ప్రేక్షకులు మాత్రం మీరు టికెట్ల రేట్లు పెంచడం, పాప్ కార్న్, సమోసాల చార్జీలు కూడా విపరీతంగా పెంచేయడం వల్ల ఎవ్వరు థియేటర్కి వచ్చి సినిమాలను చూస్తారు. రిలాక్సేషన్ కోసం ప్రేక్షకుడు సినిమా చూడాలనుకుంటాడు.
100 నుంచి 150 రూపాయల టికెట్ రేటు ఉంటే ఎవరైనా వచ్చి సినిమాని చూస్తారు. అంతే కానీ ఒక్కో టిక్కెట్ రేట్ 500 నుంచి 1000 రూపాయల వరకు పెంచడం వల్ల థియేటర్ కి రావాలంటేనే జనం భయపడిపోతున్నారు అంటూ వాళ్ళ అభిప్రాయాలను తెలియజేస్తున్నారు. మొత్తానికైతే దీని మీద తొందరలోనే ఒక నిర్ణయాన్ని తీసుకోవాలనే ఉద్దేశంతో తెలుగు సినిమా ఇండస్ట్రీ ఉన్నట్టుగా తెలుస్తోంది.
ఇక ఈ విషయంలో కనుక టిక్కెట్ రేట్లను తగ్గించినట్టయితే మాత్రం సినిమాకి ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వస్తుందని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు… చూడాలి మరి ఈ వైఖరి మారుతుందా? లేదా అనేది… ఒకవేళ సినిమా ఇండస్ట్రీ కి పూర్వ వైభవం దక్కినట్టయితే మాత్రం థియేటర్లు జనం తో నిండిపోతాయి…50 రోజుల ఫంక్షన్స్,100 డేస్ ఈవెంట్ లు కూడా జరుగుతాయి…