Heroes Remunerations: ఇండస్ట్రీ లో సక్సెస్ కోసం ఎదురుచూసే వాళ్ల సంఖ్య పెరిగిపోయింది. ఒక్క విజయం దక్కితే చాలు ఇండస్ట్రీలో సెటిల్ అయిపోవచ్చు అని చూస్తున్నారు. నిజానికి కథల విషయంలో స్పెషల్ కేర్ తీసుకుంటే ఈజీగా సక్సెస్ లను సాధించవచ్చు…ఆ చిన్న లాజిక్ ను మిస్ అయిపోయి ఇష్టమచ్చిన సినిమాలు చేస్తూ చేతులు కాల్చుకుంటున్నారు. స్టార్ హీరోలైతే భారీ బడ్జెట్ తో సినిమా ఉంటే చాలు అనే ఆలోచిస్తున్నారు తప్ప కాన్సెప్ట్ మీద ఫోకస్ చేయడం లేదు. ప్రస్తుతం ఇండియన్ సినిమా ఇండస్ట్రీని తమ వైపు తిప్పుకోవాలనే ప్రయత్నంలో స్టార్ హీరోలైతే ఉన్నారు. ఇక వాళ్ళు అనుకున్నట్టుగానే ఇకమీదట చేయబోయే సినిమాలతో ఎలాంటి సక్సెస్ లను సాధిస్తారు అనేది తెలియాల్సి ఉంది… ప్రస్తుతం ఉన్న రోజుల్లో సినిమాల బడ్జెట్ విపరీతంగా పెరిగిపోతుంది. దానిని తగ్గించడానికి దర్శకనిర్మాతలు చాలా రకాల ప్రయత్నాలు చేసినప్పటికి అది వర్కౌట్ కావడం లేదు. కారణం ఏంటి అంటే హీరో రెమ్యూనరేషన్ లను భారీ రేంజ్ లో తీసుకుంటున్నారు. దానివల్ల బడ్జెట్ విపరీతంగా పెరిగిపోతుంది.
ఇక దీని వల్ల టిక్కెట్ రేట్లు పెంచుకొని పెట్టిన బడ్జెట్ ను రికవరీ చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. తద్వారా సగటు ప్రేక్షకుల మీద సైతం అదనపు భారం పడుతుంది. తద్వారా వాళ్ళు థియేటర్ కి రావడం మానేశారు. ఇక దీంతో స్టార్ హీరోలు సైతం ఇప్పుడు ఒక స్ట్రాటజిని మెయింటైన్ చేస్తున్నారు. వచ్చిన లాభాల్లో నుంచే ఎంతో కొంత వాటానైతే తీసుకుంటున్నారు.
దీనివల్ల హీరోలకు ముందుగా బడ్జెట్ కేటాయించాల్సిన అవసరం లేదు.సినిమా కంటెంట్ ను బట్టి హీరోల మార్కెట్ ను బట్టి కలెక్షన్స్ వస్తాయి. కాబట్టి ఆ కలెక్షన్స్ లో నుంచే హీరోలు తమ రెమ్యూనరేషన్ ని తీసుకుంటారు. ఈ పద్ధతి బాగుందంటూ చాలామంది సినిమా మేధావులు సైతం వాళ్ళ అభిప్రాయాలను తెలియజేస్తున్నారు.
ఒకవేళ సినిమాకి నష్టం వస్తే వాళ్లు కూడా తమ రెమ్యూనరేషన్స్ ను తగ్గించి తీసుకోవాల్సి ఉంటుంది…దీంతో వాళ్లు మరింత ముందుకు వెళ్లాలంటే గొప్ప కాన్సెప్ట్ లతో ప్రేక్షకులను అలరించే సినిమాలను చేయాల్సిన అవసరమైతే ఉంది… ఇక ఇప్పుడు స్టార్ హీరోలతో పాటు యంగ్ హీరోలు సైతం తమ టాలెంట్ తో సినిమాలను చేస్తున్నారు. కాబట్టి వాళ్లకి కూడా భారీ విజయాలు దక్కాల్సిన అవసరమైతే ఉంది…