Hero Surya Daughter Photos: సూపర్ స్టార్ రజినీకాంత్(Superstar Rajinikanth) తర్వాత సౌత్ మార్కెట్ పై మంచి పట్టు సాధించిన హీరోలలో ఒకరు సూర్య(Suriya Sivakumar). ముఖ్యంగా తెలుగు లో మంచి క్రేజ్ ని సంపాదించుకున్న హీరో ఎవరు అని ఎవరినైనా అడిగితే సూర్య పేరే చెప్తారు. ఆ రేంజ్ లో ఆయన్ని తెలుగు ఆడియన్స్ ఆదరించారు. ఒకానొక దశలో కొంతమంది సూర్య తెలుగు హీరో కాదు, తమిళ హీరో అంటే ఎవ్వరూ నమ్మేవారు కాదు. ఆ రేంజ్ లో ఆయన ఇక్కడ తన క్రేజ్ ని సంపాదించాడు. సూర్య ఒక్కసారి అయినా డైరెక్ట్ తెలుగు సినిమా చేస్తే చూడాలని ఆయన అభిమానులు ఎప్పటి నుండో కోరుకుంటున్నారు. కానీ ఆయనకు ఉన్న కమిట్మెంట్స్ కారణంగా ఎక్కువగా తమిళం లోనే సినిమాలు చేస్తుండేవాడు. అవి తెలుగు లోకి డబ్ అవుతుండేవి. కానీ ఈసారి మాత్రం ఆయన నేరుగా తెలుగు సినిమా చేయడానికి ఒప్పుకున్నాడు.
‘సార్’, ‘లక్కీ భాస్కర్’ వంటి బ్లాక్ బస్టర్ హిట్ సినిమాలకు దర్శకత్వం వహించిన వెంకీ (Venky Atluri) తో రీసెంట్ గానే ఒక సినిమాని మొదలు పెట్టాడు. సితార ఎంటర్టైన్మెంట్స్(Sithara Entertainments) బ్యానర్ పై ఈ చిత్రం తెరకెక్కుతుంది. వరుసగా డిజాస్టర్ ఫ్లాప్స్ ని ఎదురుకుంటున్న సూర్య, ఈ సినిమాతో భారీ కం బ్యాక్ ఇస్తాడని ఆయన అభిమానులు ఆశిస్తున్నారు. ఇది ఇలా ఉండగా నేడు షూటింగ్ లో పాల్గొనడానికి సూర్య చెన్నై నుండి హైదరాబాద్ కి తన కూతురు దియా తో కలిసి వచ్చాడు. వీళ్లిద్దరు విమానాశ్రయం లో కనిపించగా, దానికి సంబంధించిన వీడియో ని రికార్డు చేసి సోషల్ మీడియా లో నెటిజెన్స్ అప్లోడ్ చేసారు. ఈ వీడియో లో సూర్య కూతురు దియా ని చూసి అభిమానులు ఆశ్చర్యపోతున్నారు. అమ్మాయి స్టార్ హీరోయిన్లకు ఏమాత్రం తీసిపోని విధంగా ఉందని, సూర్య కూడా చాలా యంగ్ గా కనిపిస్తున్నాడని, ఈ వీడియో లో వీళ్ళిద్దరిని పక్కపక్కన చూస్తుంటే తండ్రి, కూతురు లాగా లేరని, అన్న చెల్లి లాగా కనిపిస్తున్నారని అంటున్నారు ఫ్యాన్స్.
ఈ వీడియో ని మీరు కూడా క్రింద చూసి మీ అభిప్రాయాన్ని వ్యక్తం చేయండి. ఇది కాసేపు పక్కన పెడితే సూర్య లేటెస్ట్ గా నటించిన ‘రెట్రో’ చిత్రం భారీ అంచనాల నడుమ విడుదలై ఎంతటి ఘోరమైన డిజాస్టర్ ఫ్లాప్ గా నిల్చిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఈ చిత్రానికి ముందు విడుదలైన ‘కంగువా’ కూడా ఇంతకు మించిన డిజాస్టర్ ఫ్లాప్ అయ్యింది. కరోనా లాక్ డౌన్ సమయంలో సూర్య ‘ఆకాశమే నీ హద్దురా’, ‘జై భీమ్’ వంటి చిత్రాలు చేసాడు. ఈ రెండు సినిమాలు డైరెక్ట్ గా ఓటీటీ లో విడుదలై బ్లాక్ బస్టర్ రెస్పాన్స్ ని తెచ్చుకున్నాయి. అలాంటి సినిమాలు థియేటర్స్ లో విడుదల అయ్యుంటే సూర్య కి హిట్స్ పడేవి అని, ఇప్పుడు పదేళ్ల నుండి సక్సెస్ చూడని హీరోగా నిల్చిపోయాడని,కనీసం వెంకీ అట్లూరి తో అయినా పెద్ద హిట్ కొడతాడని అభిమానులు కోరుకుంటున్నారు.
Exclusive @Suriya_offl ❤️ #Suriya46 pic.twitter.com/3a5nMaE9Au
— Suriya Fanatics Kerala ™ (@TeamSFK__Offl) June 8, 2025