Surya-AR Rahman : ప్రస్తుతం సౌత్ ఇండియా లో మంచి క్రేజ్ ఉన్నప్పటికీ కూడా సరైన సూపర్ హిట్ లేక మార్కెట్ మొత్తాన్ని పోగొట్టుకునే స్థితిలో ఉన్న హీరో ఎవరు అంటే మన అందరికీ గుర్తుకొచ్చే పేరు సూర్య. ఈయన తన రేంజ్ హిట్ ని అందుకొని దశాబ్దం అయ్యింది. రీసెంట్ గా భారీ అంచనాల నడుమ విడుదలైన ‘కంగువ’ చిత్రం కూడా ఘోరమైన డిజాస్టర్ ఫ్లాప్ అవ్వడంతో ఆయన అభుమానులు తీవ్రమైన నిరాశకు గురయ్యారు. ఎందుకంటే సూర్య కెరీర్ లోనే ఈ చిత్రం భారీ బడ్జెట్ తో తెరకెక్కింది. ఈ చిత్రం కోసం సూర్య తన మూడేళ్ళ విలువైన స
మయాన్ని వెచ్చించాడు. విడుదలకు ముందు వెయ్యి కోట్లు కొడుతుంది, రెండు వేల కోట్లు కొట్టినా ఆశ్చర్యపోనక్కట్లేదని నిర్మాత జ్ఞాన్ వేల్ రాజా అనేక ఇంటర్వ్యూస్ లో చెప్పేసరికి, ఈ సినిమాలో నిజంగా అంత విషయం ఉందా అని అభిమానులు అనుకున్నారు.
కానీ విడుదల తర్వాత మొదటి ఆట నుండే ఈ సినిమా ఫ్యాన్స్ ని అలరించలేకపోయింది. వెయ్యి కోట్ల రూపాయిలు కొడుతుందని అనుకున్న ఈ సినిమా, కేవలం వంద కోట్ల గ్రాస్ వద్దనే వసూళ్లు ఆగిపోయాయి. ఈ సినిమా ఫ్లాప్ అవ్వడంతో సూర్య తదుపరి చిత్రాల మీద కూడా అభిమానులు ఆశలు వదిలేసుకున్నారు. ప్రతుతం ఆయన కార్తీక్ సుబ్బరాజ్ తో ఒక సినిమా, అదే విధంగా ఆర్జే బాలాజీ తో మరో సినిమా చేస్తున్నాడు. ఆర్జే బాలాజీ సినిమాకి సంబంధించిన ఒక లేటెస్ట్ న్యూస్ ఇప్పుడు సోషల్ మీడియా లో తెగ వైరల్ గా మారింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే ఈ సినిమాకి ముందుగా సంగీత దర్శకుడిగా ఏఆర్ రెహమాన్ ని తీసుకున్నాడు డైరెక్టర్ ఆర్జే బాలాజీ. కానీ ఎందుకో ఈ సినిమా థీమ్ కి రెహమాన్ అందించిన మ్యూజిక్ స్కోర్ సూట్ అవ్వడం లేదని ఆర్జే బాలాజీ భావించాడట. దీంతో వెంటనే ఏఆర్ రెహమాన్ ని తొలగించి సాయి అభయంకర్ అనే 20 ఏళ్ళ కుర్రాడిని ఈ చిత్రం కోసం తీసుకున్నాడట.
ఈ నిర్ణయం తీసుకునే ముందు సూర్య కి కూడా చెప్పగా, ఆయన కూడా సరైన నిర్ణయం, నీకు ఇష్టమొచ్చిన దారిలో వెళ్ళిపో అని అన్నాడట. దీంతో రెహమాన్ ని తొలగించే సాహసం చేసాడు బాలాజీ. దీనిపై సోషల్ మీడియా లో కొన్ని నెగటివ్ కామెంట్స్ వినిపిస్తున్నాయి. బాలాజీ కి సరిగా రెహమాన్ ని ట్యూన్స్ కొట్టించుకోవడం రాలేదని, దానిని కవర్ చేసుకోవడానికే ఇలా తప్పు మొత్తం రెహమాన్ మీదకు నెట్టేస్తున్నాడని అంటున్నారు నెటిజెన్స్. ఇది ఇలా ఉండగా సాయి అభయంకర్ ప్రైవేట్ ఆల్బమ్స్ ద్వారా ఇది వరకు సోషల్ మీడియా లో మంచి క్రేజ్ ని సంపాదించుకున్నాడు. ఈయన మొదటి సినిమా ‘కచ్చి సెరా’. ఈ చిత్రంలో ఇతను అందించిన మ్యూజిక్ బాగా నచ్చడం తో సూర్య ఇతనికి పిలిచి మరీ అవకాశం ఇప్పించాడు.