Salaar: సలార్ సినిమా బెన్ ఫిట్ షో లో ఆ యంగ్ హీరో ఈలలు.. గోలలు…. వైరల్ వీడియో…

ప్రభాస్ కి నార్మల్ జనాలలో అభిమానులు ఉన్నట్టే సినిమా ఇండస్ట్రీలో కూడా చాలామంది హీరోలు అతనికి అభిమానులుగా ఉన్నారు. అందులో యంగ్ హీరో అయిన శ్రీ విష్ణు ఒకరు... ఈయన నైట్ బెనిఫిట్ షోలో ప్రభాస్ సలార్ సినిమాను చూస్తూ హార్ట్ కోర్ ఫ్యాన్ ఎలాగైతే అరుస్తూ అల్లరి చేస్తాడో అంతకుమించి ఈయన సందడి చేశారు.

Written By: Gopi, Updated On : December 22, 2023 3:39 pm

Salaar

Follow us on

Salaar: ప్రభాస్ హీరో గా పాన్ ఇండియా రేంజ్ లో అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కిన సలార్ సినిమా ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే ఈ సినిమాకి నిన్న నైట్ నుంచే బెనిఫిట్ షోస్ స్టార్ట్ అయ్యాయి. ఇక ఈ షోస్ లో ఫ్యాన్స్ ఎక్కువగా సినిమాలు చూస్తూ సందడి చేస్తూ ఉంటారు. ముఖ్యంగా బెనిఫిట్ షో లు అనేవి ఫ్యాన్స్ కోసమే స్పెషల్ గా వేస్తుంటారు…

అయితే ప్రభాస్ కి నార్మల్ జనాలలో అభిమానులు ఉన్నట్టే సినిమా ఇండస్ట్రీలో కూడా చాలామంది హీరోలు అతనికి అభిమానులుగా ఉన్నారు. అందులో యంగ్ హీరో అయిన శ్రీ విష్ణు ఒకరు… ఈయన నైట్ బెనిఫిట్ షోలో ప్రభాస్ సలార్ సినిమాను చూస్తూ హార్ట్ కోర్ ఫ్యాన్ ఎలాగైతే అరుస్తూ అల్లరి చేస్తాడో అంతకుమించి ఈయన సందడి చేశారు. ఫ్యాన్స్ కి సైతం సాధ్యం కానీ విధంగా అరుస్తూ విజిల్స్ వేస్తూ ప్రభాస్ అంటే తనకి ఎంత ఇష్టమో సినిమా చూస్తున్నప్పుడు ఆరుపుల ద్వారానే తన అభిమానాన్ని తెలియజేశాడు…ఇక అందులో భాగంగానే ప్రభాస్ కి సెలబ్రిటీల్లో కూడా చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారనేది మరొకసారి ప్రూవ్ అయింది. ఇక శ్రీ విష్ణు తో పాటు గా ఈ సినిమాను చూసిన ప్రతి ఒక్క అభిమాని కూడా అరుపులు గోలలతో సినిమాని హోరెత్తించారు…

Also Read: సలార్ సీజ్ ఫైర్ మూవీ ఫుల్ రివ్యూ… హిట్టా? ఫట్టా?

ఇక మూడు ప్లాప్ సినిమాల తర్వాత ప్రభాస్ ఈ సినిమాతో మరో సక్సెస్ ని దక్కించుకున్నాడు.ఇక ఈ సినిమాతో ప్రభాస్ ఒక సరికొత్త రికార్డ్ క్రియేట్ చేయబోతున్నాడు అనే విషయం అయితే చాలా స్పష్టంగా అర్థం అవుతుంది. ఇక ఇప్పటికే ఈ సినిమాతో పాటు రిలీజ్ అయిన డంకి సినిమాకి నెగిటివ్ టాక్ రావడంతో సలార్ సినిమా పాజిటివ్ టాక్ తెచ్చుకోవడంతో డాంకీ సినిమాని డామినేట్ చేస్తూ సలార్ ముందుకు దూసుకెళ్తుంది. ఇక ఇదే క్రమంలో సలార్ కనక ఈ వన్ వీక్ లో కలెక్షన్ల వర్షం కురిపించినట్టయితే ప్రభాస్ కథలో మరో వెయ్యి కోట్ల సినిమా పడుతుంది అని అనడం లో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు…

ఇక ఇప్పటికే బాహుబలి 2 సినిమాతో ప్రపంచవ్యాప్తంగా 2 వేల కోట్ల కలెక్షన్స్ ని రాబట్టిన ప్రభాస్ ఈ సినిమా తో 1000 కోట్ల కలక్షన్స్ ని ఈజీగా రాబడుతాడు అని అనడం లో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు…నిజానికి ఈ సినిమా తో పాన్ ఇండియా రేంజ్ లో ప్రభాస్ రేంజ్ తార స్థాయి కి వెళుతుంది అనేది మాత్రం పక్క గా తెలుస్తుంది…

Also Read: సలార్ ట్విట్టర్ రివ్యూ: ప్రభాస్ సినిమాకు ఊహించని టాక్, హైలెట్స్ ఇవే!