V. V. Vinayak- Ravi Teja: యాక్షన్ చిత్రాల దర్శక దిగ్గజం వినాయక్ ఒకప్పుడు అఖండమైన విజయాలను సాధించాడు. బాక్సాఫీస్ దగ్గర తన సినిమాలతో సునామీ కలెక్షన్లను రాబట్టాడు. దాంతో, స్టార్ హీరోలు వినాయక్ కి పిలిచి మరీ ఛాన్స్ లు ఇచ్చారు. కానీ.. ఆ తర్వాత వినాయక్ కి వరుసగా ప్లాప్ లు వచ్చాయి. నిజానికి, వినాయక్ తన తర్వాతి సినిమాను అల్లు అర్జున్ తో చేయాల్సి ఉంది. అయితే ఫామ్ లో లేడు అని వినాయక్ ను పక్కన పెట్టారు.

ప్రస్తుతానికి హీరో రవితేజతో ఒక ప్రాజెక్టు చేయడానికి వినాయక్ సిద్ధం అవుతున్నాడు. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన రానుంది. మొత్తానికి రవితేజ తో మూవీ ప్లాన్ చేస్తున్న వినాయక్ ? అంటూ ఓ వార్త తెగ హల్ చల్ చేస్తోంది. పైగా రవితేజ, ఎప్పటి నుండో మాస్ హీరోగా ఎలివేట్ అవ్వాలని ఆశ పడుతున్నాడు.
Also Read: Ponniyin Selvan: సౌత్ సినిమాకి రేపు పండగే.. భారీ మల్టీస్టారర్ గ్లింప్స్ రెడీ
మరోపక్క, బన్నీ ప్రస్తుతం ఖాళీగా లేడు కాబట్టి.. వినాయక్ – రవితేజ కాంబినేషన్ ను సెట్ చేసే పనిలో నిర్మాత యువీ వంశీ బాగా కసరత్తులు చేశాడు. రవితేజ కూడా వినాయక్ తో సినిమా చేయడానికి బాగా ఆసక్తి చూపించాడు. ఈ క్రమంలోనే వినాయక్ రవితేజకి ఒక కథ చెప్పాడు. కథ కూడా రవితేజ కి బాగా నచ్చింది.

మొత్తానికి వీరిద్దరి కలయికలో సినిమా ఓకే అయిందని, త్వరలోనే అధికారిక ప్రకటన రానుందని వార్తలు వచ్చాయి. ఏది ఏమైనా రవితేజ తో వినాయక్ సినిమా ఖరారు అయింది. నిజానికి ఈ సినిమా ఎప్పుడో ఒకే కావాలి. కొన్ని కారణాల కారణంగా పోస్ట్ ఫోన్ అవుతూ వచ్చింది. ఫైనల్ గా ఇన్నాళ్లకు సెట్ అయ్యింది.
Also Read:Pavitra Lokesh- Suchendra: పవిత్ర లోకేష్ గురించి మరో సంచలన నిజాన్ని బయటపెట్టిన ఆమె భర్త