
Ram Charan: హీరో రామ్ చరణ్ లేటెస్ట్ లుక్ ఫ్యాన్స్ ని, చిత్ర వర్గాలను షాక్ కి గురి చేసింది. ఆయన ముస్లిం గెటప్ లో కనిపించారు. రంగమార్తాండ మూవీలో బ్రహ్మానందం కీలక రోల్ చేశారు. తన ఇమేజ్ కి భిన్నమైన సీరియస్ క్యారెక్టర్లో నటించి మెప్పించారు. ఈ సందర్భంగా మెగా ఫ్యామిలీ ఆయన్ని అభినందించారు. సత్కరించారు. రామ్ చరణ్, చిరంజీవి కలిసి బ్రహ్మానందంని సన్మానించడం జరిగింది. దీనికి సంబంధించిన ఫోటో వైరల్ అవుతుంది.
అయితే ఆ ఫోటోలోని రామ్ చరణ్ లుక్ నెటిజెన్స్ ని ఆకర్షించింది. రామ్ చరణ్ తెల్లని వస్త్రాలు ధరించారు. మెడలో ఓ తాయత్తు ఉంది. కళ్ళకు సుర్మా కూడా పెట్టుకున్నారు. ఈ క్రమంలో ఆయన ముస్లిం అవతారం ఎత్తాడని క్లియర్ గా అర్థం అవుతుంది. ఇది దర్శకుడు శంకర్ మూవీలోని గెటప్ అని పలువురు అభిప్రాయపడుతున్నారు. అంటే రామ్ చరణ్ శంకర్ సినిమాలో కొన్ని ఎపిసోడ్స్ లో ముస్లింగా కనిపిస్తారనే ప్రచారం జరుగుతుంది.

మరి ఈ ఊహాగానాల్లో ఎంత వరకు నిజం ఉందో తెలియదు. శంకర్ దర్శకత్వంలో రామ్ చరణ్ చేస్తున్న మూవీ చాలా వరకు షూటింగ్ జరుపుకుంది. దిల్ రాజు ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఆయన బ్యానర్ లో ఇది 50వ చిత్రం కావడం విశేషం. రామ్ చరణ్ డ్యూయల్ రోల్ చేస్తున్నారు. పీరియాడిక్ ఎపిసోడ్స్ లో ఆయన పొలిటీషియన్ గా కనిపిస్తారట. ఇక మోడరన్ రోల్ లో ఎన్నికల అధికారి అంటూ ప్రచారం జరుగుతుంది.
ఆర్ ఆర్ ఆర్ తర్వాత రామ్ చరణ్ నుండి వస్తున్న మూవీ కావడంతో భారీ అంచనాలు ఏర్పడ్డాయి. రామ్ చరణ్ కి జంటగా కియారా అద్వానీ నటిస్తున్నారు. థమన్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. దర్శకుడు శంకర్ ఏక కాలంలో ఆర్సీ 15, భారతీయుడు 2 చిత్రీకరిస్తున్నారు. అందుకే ఈ ప్రాజెక్ట్ కొంచెం డిలే అవుతుంది. గ్లోబల్ స్టార్ గా అవతరించి రామ్ చరణ్ మూవీని భారీ ఎత్తున విడుదల చేయనున్నారు.