Hero Prashanth: దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కబెట్టుకోవాలంటారు. అవకాశాలున్నప్పుడే అందిపుచ్చుకోవాలి. అంతేకాని మన ఇష్టారాజ్యంగా వ్వవహరిస్తే మొదటికే మోసం వస్తుంది. కెరీర్ పరంగా మనకు మంచి పొజిషన్ ఉన్నప్పుడు నాలుగు రాళ్లు సంపాదించుకోవాలనే ప్రయత్నిస్తుంటారు. కానీ ఇక్కడ మాత్రం పరిస్థితి భిన్నంగా మారింది. హీరోగా మంచి డిమాండ్ ఉన్న రోజుల్లోనే అవకాశాలు పోగొట్టుకున్న ప్రశాంత్ ప్రస్తుతం దుర్భర జీవితాన్ని అనుభవిస్తున్నాడు. తండ్రి చేసిన పొరపాట్లతో ఇప్పుడు లాటరీ కొడుతున్నాడు. హీరోగా డిమాండ్ ఉన్న రోజుల్లో తండ్రి నిర్ణయాలతో అవకాశాలు రాకుండా పోయి కష్టాలపాలయ్యాడు.

సెల్వమణి దర్శకత్వంలో చామంతి సినిమా ద్వారా రోజా, ప్రశాంత్ హీరోహీరోయిన్లుగా పరిచయం అయ్యారు. దీంతో దొంగ దొంగ అనే సినిమా మణిరత్నం దర్శకత్వంలో వచ్చి మంచి హిట్ సాధించింది. ఇక ప్రశాంత్ కెరీర్ కు తిరుగులేకుండా పోయింది. తరువాత శంకర్ దర్శకత్వంలో వచ్చిన జీన్స్ లో నటించాడు. ఈ సినిమా కూడా మంచి విజయాన్ని అందుకుంది. ఇందులో ఐశ్వర్యారాయ్ కథానాయికగా నటించింది. తెలుగులో దివ్యభారతితో కలిసి తొలిముద్దు సినిమాలో నటించాడు. ఈ సినిమా కూడా బ్రహ్మాండమైన హిట్ సాధించింది. ఆ సమయంలోనే దివ్యభారత్ చనిపోయింది. ఇక సినిమాలో రంభను తీసుకుని దివ్యభారతి క్యారెక్టర్ ను పూర్తి చేశారు.
తెలుగు, తమిళం, మళయాలంలోనే కాదు హిందీలో కూడా నటించి ఫర్వాలేదనిపించుకున్నాడు. హిందీలో అనుఖా, ప్రేమయుద్, ఐ లవ్ యూ వంటి చిత్రాల్లో నటించి అక్కడ కూడా మంచి పేరు తెచ్చుకున్నారు. ఇలా మంచి స్థానంలో దూసుకుపోతున్న ప్రశాంత్ కెరీర్ ఒక్కసారిగా దిగజారింది. దీనికి కారణం ఆయన తండ్రే అని తెలుస్తోంది. ప్రశాంత్ తండ్రి తీసుకునే నిర్ణయాలతో నిర్మాతలు ప్రశాంత్ కు అవకాశాలు ఇవ్వకుండా నిర్ణయించుకున్నారట. పారితోషికం విషయంలో ప్రశాంత్ తండ్రి త్యాగరాజన్ ఏకపక్ష నిర్ణయాలతో ఆయన మనుగడ ప్రశ్నార్థకంగా మారింది.
ప్రశాంత్ సినిమా హిట్టయితే చాలు రెమ్యునరేషన్ భారీగా పెంచేవాడట. దీంతో నిర్మాతలు ప్రశాంత్ కు ఆఫర్ ఇవ్వడానికి వెనుకాడారు. తరువాత ఓ ధనవంతురాలైన అమ్మాయిని ఇచ్చి వివాహం చేశారు. అప్పటికి కూడా తండ్రి పెత్తనమే ఉండటంతో భార్య కూడా అసహనానికి గురైంది. ఒకదశలో ఆమె తండ్రి కావాలా? నేనా? అనే ప్రశ్న వేసింది. అప్పుడు కూడా ప్రశాంత్ తండ్రి వైపే ఉండటంతో ఆమె అతడిని వదిలేసి వెళ్లిపోయింది. ఇలా ప్రశాంత్ జీవితం అస్థిరంగా మారడానికి ఆయన తండ్రే కావడం తెలిసిందే. తండ్రులు పిల్లల భవిష్యత్ ను తీర్చిదిద్దుతారని విన్నాం కానీ ఇలా పాడు చేస్తారనేది మాత్రం ఎక్కడ కనిపించరు.