Nithiin: మీడియం రేంజ్ హీరోలలో వరుస డిజాస్టర్ ఫ్లాప్స్ ని అందుకుంటూ మార్కెట్ మొత్తం పోగొట్టుకున్న హీరో నితిన్(Actor Nithin). గతంలో నితిన్ సినిమాలకు మంచి క్రేజ్ ఉండేది, కానీ వరుస ఫ్లాప్స్ ఆయన్ని పాఠంలోకి నెట్టేసింది. మాచెర్ల నియోజకవర్గం చిత్రం తర్వాత భారీ గ్యాప్ తీసుకొని ఆయన చేసిన ‘రాబిన్ హుడ్’, ‘తమ్ముడు’ చిత్రాలు ఈ ఏడాది విడుదలై ఘోరమైన డిజాస్టర్ ఫ్లాప్స్ గా నిలిచాయి. ఈ రెండు సినిమాలు నితిన్ కెరీర్ ని చాలా ఎఫెక్ట్ చేశాయి. తమ్ముడు సినిమాకు నిర్మాతగా దిల్ రాజు వ్యవహరించాడు. ఈ సినిమా తర్వాత ఆయన వెంటనే నితిన్ తో ‘ఎల్లమ్మ’ చిత్రం చేయాలి. కానీ ‘తమ్ముడు’ ఎఫెక్ట్ కారణంగా ఈ సినిమా నుండి నితిన్ ని తప్పించేసాడు దిల్ రాజు. ఇది కచ్చితంగా ఒక పీక్ రేంజ్ ని చూసిన హీరో కి అవమానమే అని చెప్పుకోవచ్చు.
ఇప్పుడు నితిన్ ఉన్న పరిస్థితి లో వేరే హీరో ఉండుంటే సినిమాలను పూర్తిగా ఆపేసేవారు, క్యారక్టర్ రోల్స్ కి షిఫ్ట్ అయ్యేవారు. కానీ నిర్మాతల్లో మాత్రం నితిన్ సరైన సినిమా పడితే మళ్లీ భారీ హిట్ కొడుతాడు, కాసుల వర్షం కురిపిస్తాడు అనే నమ్మకం ఇప్పటికీ ఉంది. అందుకే ప్రముఖ నిర్మాత సునీల్ నారంగ్, పుష్కర్ రామ్మోహన్ కలిసి నితిన్ తో త్వరలోనే ఒక క్రేజీ ప్రాజెక్ట్ చేయబోతున్నాడు. ఈ ఏడాది ‘లిటిల్ హార్ట్స్’ అనే చిత్రం తో భారీ కమర్షియల్ ని హిట్ ని అందుకొని యూత్ ఆడియన్స్ లో మంచి క్రేజ్ ని సంపాదించిన సాయి మార్తాండ్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించబోతున్నాడు. రీసెంట్ గానే సాయి మార్తాండ్ నితిన్ ని కలిసి ఒక మంచి యూత్ ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఉన్న సబ్జెక్టు ని వినిపించాడని, అది నితిన్ కి చాలా బాగా నచ్చిందని అంటున్నారు.
ఈ సినిమా కచ్చితంగా ‘ఇష్క్’ లాగా తన కెరీర్ కి కొత్త దారి తెరుస్తుందని, కెరీర్ లోని మూడవ ఫేస్ ని గ్రాండ్ గా మొదలు పెట్టొచ్చని బలమైన నమ్మకం తో ఉన్నాడట నితిన్. మరి ఆయన నమ్మకం ఎంత వరకు నిజం అవుతుందో చూడాలి. అప్పట్లో సై చిత్రం తర్వాత నితిన్ వరుసగా 14 ఫ్లాప్ సినిమాలు చేసాడు. ఒకానొక దశలో ఆయన సినిమా థియేటర్స్ లో విడుదల అవ్వడం కూడా కష్టం అయిపోయింది. అలాంటి సమయం లో వచ్చిన ‘ఇష్క్’ చిత్రం భారీ బ్లాక్ బస్టర్ గా నిలిచి నితిన్ కి సరికొత్త కెరీర్ ని అందించింది. ఈ సినిమా తర్వాత ఆయన చేసిన ‘గుండె జారీ గల్లంతయ్యిందే’, ‘అ..ఆ’, ‘భీష్మ’ వంటి చిత్రాలు కమర్షియల్ గా సెన్సేషనల్ బ్లాక్ బస్టర్స్ అయ్యాయి. కెరీర్ పూర్తిగా ముగుస్తుంది అనుకున్న సమయంలో హిట్స్ కొట్టి తనకంటూ ఒక ప్రత్యేకమైన మార్కెట్ ని ఏర్పాటు చేసుకున్న నితిన్, త్వరలో చేయబోయే ఈ చిత్రం తో కూడా అదే ఫీట్ ని రిపీట్ చేయబోతున్నాడో లేదో చూడాలి.