Nandu: సినిమా ఇండస్ట్రీ అందరికి కలిసి రాదు. చాలామంది స్టార్ హీరోలు అవ్వాలనే ప్రయత్నం చేస్తూ ఉంటారు. కానీ అది కొందరికి మాత్రమే సాధ్యమవుతోంది. ఇక 100% లవ్ సినిమాతో ఇండస్ట్రీ కి పరిచయమైన నటుడు నందు…ఆ తర్వాత ఆయన చాలా సినిమాలు చేసినప్పటికి సోలో హీరోగా అతనికి ఒక్క సక్సెస్ రావడం లేదు. తనతో నటించిన ప్రతి ఒక్కరూ టాప్ లెవెల్ కి వెళ్ళిపోతున్నారు. కానీ తను మాత్రం ఒక సక్సెస్ ని సాధించడానికి తీవ్రమైన ఇబ్బందులను ఎదుర్కొంటున్నాడు. ఇక ఇలాంటి క్రమంలోనే అతను చేసిన ‘సైక్ సిద్ధార్థ’ అనే సినిమా ఈనెల 12వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ ఈవెంట్ ని రీసెంట్గా కండక్ట్ చేశారు… ఇక ఈ ఈవెంట్ లో నందు మాట్లాడుతూ తను ఇండస్ట్రీకి వచ్చి 18 సంవత్సరాలు అవుతుందని అయినప్పటికి ఇప్పటివరకు తనకు సోలోగా ఒక సక్సెస్ కూడా లేదని చెబుతూ చాలా వరకు బాధపడ్డాడు.
అలాగే సైక్ సిద్ధార్థ సినిమా చాలా బాగా వచ్చిందని ఈ సినిమాతో మరోసారి తనను తాను ప్రూవ్ చేసుకుంటానని చెప్పడం విశేషం…అలాగే విరాట్ కోహ్లీ లాంటి స్టార్ ప్లేయర్ ఉన్నప్పటికి 18 సంవత్సరాల తర్వాత కప్పు వచ్చిందని తను కూడా ఇండస్ట్రీకి వచ్చి 18 సంవత్సరాలు అవుతుంది కాబట్టి తనకి కూడా ఇప్పుడు ఒక సక్సెస్ రాబోతుంది అంటూ ఆయన చెప్పాడు.
మొత్తానికైతే ఆయన ఎమోషనల్ అవ్వడం అనేది ప్రతి ఒక్కరిని కలచివేస్తోంది… ఇక ఈ సినిమా తప్పకుండా సక్సెస్ అవుతోంది. మళ్లీ ప్రెస్ మీట్ పెట్టి నేను సినిమా గురించి చాలా మాట్లాడతాను అంటూ ఆయన చెప్పాడు. అలాగే తను పొగరుతో ఇలాంటి మాటలు మాట్లాడటం లేదని చాలా కాన్ఫిడెంట్ గా సినిమా గురించి చెబుతున్నానని చెప్పడం విశేషం…ఇక ఈ సినిమాకి తనే ప్రొడ్యూసర్ గా వ్యవహరించాడు.
ఈ సినిమాని సురేష్ బాబు కొనుగోలు చేయడం విశేషం… ఈ సినిమాతో నందు మరోసారి తనను తాను హీరోగా ప్రూవ్ చేసుకుంటాడా? లేదా అనేది తెలియాల్సి ఉంది. ఇక నందుతో నటించిన నాగచైతన్య, విజయ్ దేవరకొండ, సిద్దు జొన్నలగడ్డ లాంటి హీరోలు టాప్ లెవల్ కి వెళ్లిపోయారు. తను మాత్రం ఇక్కడే ఉండిపోవడం అతన్ని తీవ్రంగా కలిచివేస్తోంది…