Karthi Kaithi 2: లోకేష్ కనకరాజ్(Lokesh Kanagaraj) ఇప్పుడు ఇండియా లోనే టాప్ మోస్ట్ డైరెక్టర్స్ లో ఒకరు అయ్యుండొచ్చు. కానీ కెరీర్ ప్రారంభం లో ఇతను కూడా అందరి లాగానే ఎన్నో ఇబ్బందులు, అవమానాలు ఎదురుకొని వచ్చినవాడే. ఒక్కటంటే ఒక్క అవకాశం కోసం ఎదురు చూస్తున్న రోజుల్లో తమిళ యంగ్ హీరోల్లో ఒకరైన కార్తీ ‘ఖైదీ’ చిత్రానికి దర్శకత్వం వహించే అవకాశం ఇచ్చాడు. ఈ సినిమా కమర్షియల్ గా పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. లోకేష్ కనకరాజ్ ఓవర్ నైట్ స్టార్ డైరెక్టర్ అయిపోయాడు. ‘ఖైదీ’ తర్వాత వెంటనే ఆయన ‘ఖైదీ 2’ చేయాల్సి ఉంది. కానీ ఆ సమయం లో తమిళ బిగ్గెస్ట్ సూపర్ స్టార్స్ లో ఒకరైన విజయ్ తనతో సినిమా చేయాల్సిందిగా స్వయంగా కోరడంతో, ‘ఖైదీ 2’ ని పక్కన పెట్టి ‘మాస్టర్’ చిత్రాన్ని చేసాడు. ఈ సినిమా తర్వాత అయినా ‘ఖైదీ 2’ చేస్తాడేమో అని అనుకున్నారు అందరూ.
కానీ అది జరగలేదు, విక్రమ్, లియో, కూలీ అంటూ తనకు వచ్చిన బంపర్ ఆఫర్స్ ని వినియోగించుకుంటూ ముందుకు పోయాడు కానీ, ‘ఖైదీ 2’ గురించి మాత్రం ఎలాంటి సౌండ్ చేయలేదు. ‘కూలీ’ తర్వాత కచ్చితంగా ‘ఖైదీ 2’ చేస్తాడు, ఇది ఆయన కెరీర్ ని మలుపు తిప్పే సినిమా అవుతుందని అంతా అనుకున్నారు. కానీ ఇప్పుడు కూడా ఆయన ‘ఖైదీ 2’ చేయడం లేదు. అల్లు అర్జున్ తో ఒక భారీ చిత్రాన్ని చేయబోతున్నట్టు, ఈ ఏడాది లోనే ఆ చిత్రం సెట్స్ మీదకు వెళ్లబోతుంది. దీన్ని బట్టీ చూస్తుంటే లోకేష్ కనకరాజ్ కి అసలు ‘ఖైదీ 2’ చేసే ఆలోచనే లేనట్టుగా అనిపిస్తోంది అంటూ సోషల్ మీడియా లో నెటిజెన్స్ మాట్లాడుకుంటున్నారు. ఎందుకంటే ఇప్పుడు లోకేష్ కనకరాజ్ టార్గెట్ మొత్తం పాన్ ఇండియన్ హీరోల పైనే ఉంది.
వాళ్లకు పెద్ద మార్కెట్ ఉంది కాబట్టి, సరైన సినిమా తీస్తే ఇండస్ట్రీ ని షేక్ చేయొచ్చు అనే మోడ్ లో ఉన్నాడు లోకేష్ కనకరాజ్. ఇలాంటి సమయం లో మీడియం రేంజ్ మార్కెట్ ఉన్న కార్తీ తో సినిమా చేస్తే వర్కౌట్ అవ్వదు అనే ఫీలింగ్ లో ఆయన ఉన్నట్లు తెలుస్తోంది. పైకి త్వరలోనే ‘ఖైదీ 2’ చేస్తానని అంటున్నాడు కానీ, అది ఎప్పుడో అనేది మాత్రం ఎవరికీ తెలియదు. ఇకపోతే రీసెంట్ గానే కార్తీ బయటకు వచ్చినప్పుడు మీడియా అతన్ని చుట్టుముట్టింది. ఆయన్ని ఒక రిపోర్టర్ ప్రశ్న అడుగుతూ ‘లోకేష్ కనకరాజ్ రీసెంట్ గానే అల్లు అర్జున్ తో సినిమాని ప్రకటించాడు , మరి మీ ఖైదీ 2 పరిస్థితి ఏంటి?’ అని అడగ్గా, దానికి కార్తీ సమాధానం చెప్తూ ‘అది లోకేష్ కే తెలియాలి’ అంటూ వ్యంగ్యంగా సమాధానం ఇచ్చాడు. అందుకు సంబంధించిన వీడియో ని మీరు క్రింద చూడొచ్చు.
Q: #LokeshKanagaraj has gone on to direct #AlluArjun. What’s the status of #Kaithi2 ..❓#Karthi : Avare Solvaru..!!
Looks like Karthi has Moved on from Kaithi 2..pic.twitter.com/UfJ5POcylO
— Laxmi Kanth (@iammoviebuff007) January 17, 2026
