బర్త్ డే స్పెషల్ః పడిలేసిన కటౌట్..!

హీరోగా ఎంట్రీ ఇచ్చి.. విల‌న్ వేషాలు వేసి.. మ‌ళ్లీ హీరోగా రీఎంట్రీ ఇచ్చి.. స‌క్సెస్ ఫుల్ కెరియ‌ర్ కంటిన్యూ చేయ‌డం అనేది ఎంత మందికి సాధ్య‌మ‌వుతుంది? అత్యంత అరుదైన ఈ ఫీట్ ను సాధించి చూపించాడు న‌టుడు గోపీచంద్. ఆయ‌న మొద‌టి సినిమా ‘తొలి వ‌ల‌పు’. 2001లో వ‌చ్చిన ఈ చిత్రం ద్వారా హీరోగా తెరంగేట్రం చేశాడు. కానీ..ఈ మూవీ నిరాశ‌ప‌రిచింది. దీంతో.. త‌న‌లోని సెకండ్ యాంగిల్ ను ప్రేక్ష‌కుల‌కు చూపించాడు గోపీ. 2002లో వ‌చ్చిన ‘జ‌యం’ […]

Written By: Bhaskar, Updated On : June 12, 2021 1:47 pm
Follow us on

హీరోగా ఎంట్రీ ఇచ్చి.. విల‌న్ వేషాలు వేసి.. మ‌ళ్లీ హీరోగా రీఎంట్రీ ఇచ్చి.. స‌క్సెస్ ఫుల్ కెరియ‌ర్ కంటిన్యూ చేయ‌డం అనేది ఎంత మందికి సాధ్య‌మ‌వుతుంది? అత్యంత అరుదైన ఈ ఫీట్ ను సాధించి చూపించాడు న‌టుడు గోపీచంద్. ఆయ‌న మొద‌టి సినిమా ‘తొలి వ‌ల‌పు’. 2001లో వ‌చ్చిన ఈ చిత్రం ద్వారా హీరోగా తెరంగేట్రం చేశాడు. కానీ..ఈ మూవీ నిరాశ‌ప‌రిచింది. దీంతో.. త‌న‌లోని సెకండ్ యాంగిల్ ను ప్రేక్ష‌కుల‌కు చూపించాడు గోపీ.

2002లో వ‌చ్చిన ‘జ‌యం’ చిత్రంలో విలన్ గా కనిపించాడు. ప్రేమికులను విడదీసే క్రూరుడిగా అద్భుతంగా నటించాడు గోపీ. ఈ చిత్రం సూప‌ర్ హిట్ కొట్టింది. గోపీచంద్ న‌ట‌న‌కు అనూహ్య‌మైన రెస్పాన్స్ వ‌చ్చింది. ఆ త‌ర్వాత కూడా విల‌నీ కంటిన్యూ చేశాడు. 2004లో వ‌చ్చిన ప్ర‌భాస్ మూవీ ‘వర్షం’లో పవర్ ఫుల్ విలన్ గా కనిపించాడు. ఇందులో కూడా త‌న‌దైన న‌ట‌న‌తో రెచ్చిపోయాడు. ఈ చిత్రం కూడా బ్లాక్ బ‌స్ట‌ర్ గా నిలిచింది. ఆ వెంట‌నే సెకండ్ ఇన్నింగ్స్ ప్లాన్ చేశాడు. అదే ఏడాది ‘య‌జ్ఞం’ చేశాడు. గోపీచంద్ యజ్ఞం ఫ‌లించింది. ఆయ‌న‌ సినీ కెరీర్‌.. హీరో ట్రాక్ ఎక్కేసింది.

అప్ప‌టి వ‌ర‌కు విల‌న్ గా చేసి.. ఆ త‌ర్వాత హీరోగా మారిపోయి, ప్రేక్ష‌కుల మెప్పు పొంద‌డం అనేది సాధార‌ణ విష‌యం కాదు. కానీ.. గోపీచంద్ సాధించాడు. ఆయ‌న ఎంచుకున్న క‌థ‌లు, చూపించిన వేరియేష‌న్ అత‌న్ని హీరోగా నిల‌బెట్టాయి. అయితే.. గోపీ కెరీర్ లో మెజారిటీ యాక్ష‌న్ క‌థ‌లే ఉండ‌డం విశేషం. ఈ ఫీల్ ను తొల‌గించేందుకు మ‌ధ్య మ‌ధ్య‌లో రూట్ మార్చాడు కూడా. అందులో భాగంగా వ‌చ్చిన‌వే ల‌క్ష్యం, లౌక్యం, జిల్ వంటి సినిమాలు. ఈ చిత్రాలు చాలా గోపీచంద్ కెరీర్ కు సైతం ఎంతో హెల్ప్ చేశాయి.

నెమ్మ‌దిగా త‌న‌లోని లోపాల‌న్నింటినీ సెట్ చేసుకుంటూ స్టార్ హీరోగా ఎదిగిన గోపీచంద్ కు.. స‌రైన హిట్టు ప‌డ‌క చాలా కాల‌మైంది. ట్రెండ్ కు త‌గ్గ‌ట్టుగా త‌న‌ని తాను మ‌లుచుకుంటూ ముందుకు సాగుతున్నాడు. కుటుంబ ప్రేక్ష‌కుల‌కు ద‌గ్గ‌ర కావాల‌నేది త‌న కోరిక‌. ‘క‌లిసుందాం రా’ వంటి చిత్రం చేయాలనేది తన డ్రీమ్ అని చాలా సార్లు చెప్పాడు గోపీ. ఆ ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ.. ఇంకా సెట్ కాలేదు. త్వ‌ర‌లో అవుతుంద‌ని ఆశిద్దాం.

గోపీచంద్ అప్ క‌మింగ్ మూవీ ‘సీటీమార్’. సమ్మర్ లో స్లాట్ బుక్ చేసుకున్న ఈ చిత్రం.. క‌రోనా కార‌ణంగా ఆగిపోయింది. థియేట‌ర్లు ఓపెన్ కాగానే రిలీజ్ కానుంది. దీని త‌ర్వాత ‘పక్కా కమర్షియల్’ మూవీ త్వరలో సెట్స్ పైకి వెళ్లనుంది. ఇంకా పలు ప్రాజెక్టులు చర్చల్లో ఉన్నాయి. ఇవాళ గోపీచంద్ పుట్టిన రోజు. ఈ ఏడాదిలో గోపీచంద్ కెరీర్ కీల‌క‌మైన మ‌లుపు తిర‌గాల‌ని, అద్భుతమైన బ్లాక్ బ‌స్ట‌ర్లు అందుకోవాల‌ని ఆశిస్తోంది ‘ఓకే తెలుగు’. విష్ యూ హ్యాపీ బర్త్ డే టూ గోపీచంద్.