Bigg Boss 5 Telugu, Lahari: బిగ్ బాస్ ద్వారా మరింత గుర్తింపు సంపాదించుకోవాలనుకున్న లహరి మూడవ వారం ఎలిమినేట్ కావడం గమనార్హం. వెండితెరపై అర్జున్ రెడ్డి, జాంబీ రెడ్డి వంటి సినిమాలలో సందడి చేసిన లహరి వెండితెరపై సరైన గుర్తింపు సంపాదించుకోలేక పోయింది. ఎవరు ఊహించని విధంగా లహరి బిగ్ బాస్ హౌస్ నుంచి ఎలిమినేట్ కావడం ప్రేక్షకులను కొంతమేర ఆశ్చర్యానికి గురి చేసింది.

తెలుగు బిగ్ బాస్ 5 లోకి లేడీ అర్జున్ రెడ్డి గా ఎంటరైన లహరి మూడవ వారం బిగ్ బాస్ హౌస్ నుంచి ఎలిమినేట్ అయ్యారు. తొలి వారం సరయు ఎలిమినేట్ కాగా రెండో వారం ఉమాదేవి ఎలిమినేట్ అయ్యారు. వరుసగా మూడు వారాలు లేడీ కంటెస్టెంట్లు ఎలిమినేట్ కావడంతో బిగ్ బాస్ ఫ్యాన్స్ ఫీలవుతున్నారు. అయితే నాలుగో వారం మాత్రం కచ్చితంగా మేల్ కంటెస్టెంట్ బిగ్ బాస్ హౌస్ ను వీడే అవకాశాలు ఉన్నాయని భావిస్తున్నారు.
లహరి….. తన గురించి ఎవరేం అనుకుంటున్నా పట్టించుకోదు. కానీ తన ఎదురుగా నిలబడి మాట్లాడితే మాత్రం దానికి గట్టి సమాధానం ఇస్తుంది. కాన్ఫిడెన్స్‌కు నిలువుటద్దంలా కనిపించే లహరికి కాస్త ఆవేశం ఎక్కువే. అందుకే బిగ్‌బాస్ ఇంట్లో చీటికీమాటికీ గొడవలు పెట్టుకుంటూ బ్యాడ్ నేమ్ తెచ్చుకుంది. తన కళ్ల ముందు ఏదైనా తేడాగా అనిపిస్తే చాలు ఆ అంశాన్ని లేవనెత్తి చీల్చి చెండాడేది. ముఖ్యంగా ఈ అర్జున్‌రెడ్డి భామకు, కాజల్‌కు పెద్దగా పడేది కాదు. మొదట్లో ఫైర్ బ్రాండ్‌గా కనిపించిన లహరి ఈ మధ్య కాస్త డల్ అయిపోయినట్లు తెలుస్తోంది. బిగ్‌బాస్ హౌస్‌లో మూడో కంటెస్టెంట్‌గా ఎంట్రీ ఇచ్చిన లహరి మూడో వారానికి తట్టాబుట్టా సర్దుకుని బయటకు వచ్చేసింది.
బిగ్‌బాస్ షో ప్రారంభమైన ఫస్ట్ వీక్‌లోనే గొడవలతోనే బాగా హైలైట్ అయింది లహరి. కానీ ప్రతి చిన్న విషయానికి కూడా ఆమె కయ్యానికి కాలు దువ్వడం తో ఆమెను మెచ్చుకునేవాళ్ళు విమర్శించక తప్పలేదు. ఇంట్లోని కంటెస్టెంట్లలో లహరికి దగ్గరైనవాళ్లలో మానస్ ఒకరు. అయితే ఇది గిట్టని ప్రియ, ప్రియాంక సింగ్, సిరి.. మానస్ దగ్గరకు వచ్చి ఆమె కన్నింగ్ అని, లహరితో జాగ్రత్త అని చెప్పారు. అంతేకాకుండా ఆమె డ్రెస్సింగ్ గురించి కూడా తప్పుగా మాట్లాడారు. ఈ విషయాన్ని మానస్ లహరితో కూడా చెప్పాడు. అంటే హౌస్‌లో లహరిని కొంత టార్గెట్ చేశారని అర్థమవుతోంది.
లహరి ఎలిమినేషన్‌కు ముఖ్య కారణం ప్రియ, రవి. వీళ్లిద్దరూ తెలిసో, తెలియకో ప్రేక్షకుల ముందు లహరిని బ్యాడ్ చేశారు. యాంకరింగ్ కోసం తన వెనకాల పడుతుందని రవి, ఇంట్లో మగాళ్లతో బిజీ అని ప్రియ కామెంట్స్ చేయడంతో ఆమె మీద కొంత వ్యతిరేకత ఏర్పడింది. అదే సమయంలో ఆమె అన్యాయంగా బలవుతుందంటూ కొంత సానుభూతి ఏర్పడినప్పటికీ అది ఆమెను ఎలిమినేషన్ నుంచి గట్టెక్కించలేకపోయాయి.
ఏదేమైనా లహరి ఎలిమినేట్ కావడాన్ని ఆమె అభిమానులు తట్టుకోలేకపోతున్నారు. తనేంటో నిరూపించుకునేందుకు ఇంకొన్ని రోజులు హౌస్‌లో ఉండనివ్వాల్సిందని అభిప్రాయపడుతున్నారు.