
Sreeleela: ఇండస్ట్రీ కి వచ్చిన అతి తక్కువ సమయం లోనే చేతినిండా సినిమాలతో క్షణం తీరిక లేకుండా గడుపుతున్న కుర్ర హీరోయిన్ శ్రీలీల అంటే కుర్రాళ్లు ఎలా పడి చచ్చిపోతున్నారో మనం చూస్తూనే ఉన్నాము.రోజు రోజుకి ఈమెకి సోషల్ మీడియా లో ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగిపోతుంది.కేవలం తన పేరు మీదనే లక్షల సంఖ్యలో టికెట్స్ అమ్ముడుపోయ్యే పరిస్థితి ఉన్నందున దర్శక నిర్మాతలు కూడా ఆమె అడిగినంత పారితోషికం ఇవ్వడానికి వెనకాడట్లేదు.
ప్రస్తుతం ఆమె చేతిలో 10 సినిమాలు ఉన్నాయి.ఇంత క్రేజ్ / పాపులారిటీ రావడం తో ఎవరు ఈ అమ్మాయి, ఇంత సెన్సేషన్ క్రియేట్ చేసేసింది అని తెలుసుకోవడానికి గూగుల్ లో ఆమె గురించి తెగ వెతకడం ప్రారంభించారు.అలా వెతికిన తర్వాత ఆమె గురించి తెలిసిన కొన్ని ఆసక్తికరమైన విషయాలు ఇప్పుడు సోషల్ మీడియా లో వైరల్ గా మారాయి.ఆ విషయాలు తెలుసుకున్న తర్వాత శ్రీలీల మనసు ఎంత మంచిదో అర్థం అవుతుంది.
ఇక అసలు విషయానికి వస్తే శ్రీలీల కి ఇద్దరు పిల్లలు ఉన్నారు.అదేంటి ఇంత చిన్న అమ్మాయికి అప్పుడే పెళ్ళైపోయిందా అనుకుంటున్నారా..కాదు!,ఆమె గురు మరియు శోభిత అనే ఇద్దరు అనాధ పిల్లలను దత్తత తీసుకొని పెంచుకుంటుంది.ఒక రోజు ఆమె షూటింగ్ కోసం ఒక అనాధాశ్రమం కి వెళ్లిందట.అక్కడ వీళ్ళిద్దరిని చూసి ఎంతో జాలి వేసి వెంటనే దత్తత తీసుకొని ఇంటికి వెళ్లిపోయిందట.ఈ విషయాన్నీ స్వయంగా శ్రీలీలనే ఒక ఇంటర్వ్యూ లో తెలిపింది.ఆమె వయస్సు కేవలం 21 సంవత్సరాలు మాత్రమే.ఆమె ఆ ఇద్దరు పిల్లలను దత్తత తీసుకుంటున్న సమయానికి ఆమె వయస్సు కేవలం 19 సంవత్సరాలు మాత్రమే.

ఇంత చిన్న వయస్సు లో ఇలాంటి ఆలోచనలు కోటి మందిలో ఒక్కరికో ఇద్దరికో వస్తాయి.వారిలో శ్రీలీల కూడా ఒకరిగా ఉండడం ఎంతో అభినందనీయం.కేవలం ఇదొక్కటే కాదు, ఆమె కర్ణాటక లో గతం లో ఎన్నో సేవాకార్యక్రమాలు చేపట్టిందట.ఆమె గురించి అలా తెలుసుకుంటూ పోతుంటే రోజుకి ఒక సరికొత్త విషయాలు తెలుస్తున్నాయి.