Ranbir Kapoor: రణబీర్ కపూర్ – ఆలియా భట్ ఏప్రిల్ 14న వివాహంతో ఒక్కటి అయ్యారు. త్వరలోనే వీరిద్దరూ తల్లిదండ్రులుగా కూడా మారనున్నారు. పైగా, వచ్చే నెలలో ఈ జంట, రణబీర్ తాతయ్య రాజ్ కపూర్ కట్టించిన ‘కృష్ణ రాజ్’ అనే అతి పెద్ద బంగ్లాలో తమ కాపురం పెట్టబోతున్నారు. అన్నిటికీ మించి బాలీవుడ్ లోనే క్రేజీ జంటగా ఈ జంటకు నేమ్ ఉంది. అయితే, ఇప్పుడు ఓ వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఆలియాని పెళ్లి చేసుకోవడంతో.. ఇప్పుడు రణబీర్ కష్ట నష్టాలు అనుభవిస్తున్నాడు అంటూ కామెంట్స్ వినిపిస్తున్నాయి.

అదేమిటి ?, ఆలియా బాలీవుడ్ సెలబ్రిటీలందరిలోనే ప్రత్యేకం కదా. పైగా వందల కోట్ల వారసురాలు. ఇండియాలోనే టాప్ హీరోయిన్. మరి ఆలియాని చేసుకుని రణబీర్ ఎందుకు బాధ పడాలి ?. ఎందుకు కష్టాలు పడాలి ? అంటూ మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు. బ్రహ్మాస్త్ర సినిమాకి నెగిటివ్ టాక్ రావడంతో రణబీర్ తల్లి ‘నీతూ కపూర్’ ఇలా ఫీల్ అవుతుంది. ఆమెకు జాతకాలు గ్రహాల వంటి నమ్మకాలు ఎక్కువ. అలియా – రణబీర్ జాతకం కూడా సెట్ కాలేదు అట. అందుకే, నీతూ కపూర్ వీరి పెళ్లిని ఇష్టపడలేదు.
నిజానికి, రణబీర్ ప్రేమాయనం నడిపించిన అందరు బ్యూటీలను నీతూ కపూర్ రిజెక్ట్ చేసింది. జాతకంలో పర్ఫెక్ట్ గా ఉన్న అమ్మాయినే… తన ప్రిన్స్ రణబీర్ కిచ్చి పెళ్లి చేయాలనుకుంది నీతూ. కానీ, ఆలియా కారణంగా కుదరలేదు. అందుకే, ఆమె ఇప్పుడు రణబీర్ కపూర్ కష్టాలకు కారణం, ఆలియానే అంటూ తన సన్నిహితుల దగ్గర కామెంట్స్ చేస్తోందట.

ఈ ఏడాది నవంబర్లో రణబీర్ కపూర్ – ఆలియా తమ మొదటి బిడ్డకు స్వాగతం పలకబోతున్నారని తెలుస్తోంది. ఆలియా సోనోగ్రఫీ చేయించుకుంటున్న ఫోటోను పోస్ట్ చేసి సోషల్ మీడియాలో ఈ వార్తను పంచుకున్న సంగతి తెలిసిందే. ఏది ఏమైనా బాలీవుడ్ లోనే క్రేజీ జంట వీరు. రణబీర్ కపూర్ ఒక్కో సినిమాకు 60 కోట్లు తీసుకుంటున్నాడు. అలియా ఒక్కో సినిమా 8 కోట్లు డిమాండ్ చేస్తోంది. సంపాదన పరంగానే కాకుండా ఆస్తుల పరంగా లెక్కలు వేసుకున్నా ఈ జంటకి 800 కోట్లు నెట్ వర్త్ ఉంది