Bigg Boss 9 fame Emmanuel: ఈ బిగ్ బాస్ సీజన్(Bigg Boss 9 Telugu) లో టైటిల్ విన్నింగ్ అన్ని విధాలుగా అర్హతలు ఉన్న కంటెస్టెంట్ ఇమ్మానుయేల్. గడిచిన సీజన్స్ లో కమెడియన్స్ క్యాటగిరీ లో ఎంతోమంది వచ్చారు కానీ, ఇమ్మానుయేల్ లాంటి ఆల్ రౌండర్ ని మాత్రం ఎప్పుడూ చూడలేదు అనడంలో ఎలాంటి సందేహం లేదు. టాస్కులు అద్భుతంగా ఆడడం లో కానీ, గేమ్ కి తగ్గట్టు స్ట్రాటజీలు వేయడం లో కానీ, ఎంటర్టైన్మెంట్ ని అందించడం లో కానీ ఇమ్మానుయేల్ కి సాటి మరెవ్వరూ లేరు అనే రేంజ్ లో ఆయన బిగ్ బాస్ జర్నీ కొనసాగుతూ ఉంది. కేవలం ఎంటర్టైన్మెంట్ ని అందించడం లోనే కాదు, ఎమోషన్స్ తో కూడా ఇమ్మానుయేల్ ఆడియన్స్ కి కంటతడి పెట్టించిన సందర్భాలు ఉన్నాయి. ఉదాహరణకు బిగ్ బాస్ హౌస్ లోకి అడుగుపెట్టే ముందు, తన ప్రేయసి తో మాట్లాడిన మాటలు, ఆమెతో తనకు ఉన్న రిలేషన్ గురించి ఒక ఎపిసోడ్ లో చెప్తూ ఇమ్మానుయేల్ మాట్లాడిన మాటలు ఆడియన్స్ మనసులకు గుచ్చుకుంది.
ఇంతకీ ఎవరు ఆమె?, ఎలా ఉంటుంది?, ఫ్యామిలీ వీక్ లో ఆమె వస్తుందేమో చూడాలని అంతా అనుకున్నారు. కానీ అది జరగలేదు. అయితే ఇన్ స్టాగ్రామ్ లో అప్పట్లో ఇమ్మానుయేల్ తన ప్రేయసి తో కలిసి చేసిన ఒక రీల్ ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యింది. ఆమె ని చూస్తే ఎంతో అందంగా ఉంది. సినిమాల్లోకి హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చేయొచ్చు. ఈ సీజన్ లో అందగత్తె ఎవరు అని అడిగితే, ప్రతీ ఒక్కరు తనూజ పేరు చెప్తారు. కానీ ఇమ్మానుయేల్ ప్రేయసి తనూజ కంటే అందంగా ఉంది అనడం లో అతిశయోక్తి కాదేమో. ఈ క్రింది వీడియో ని చూసి మీ అభిప్రాయాన్ని తెలియజేయొచ్చు. హౌస్ లో మొదటి వారం నుండి ఇమ్మానుయేల్ తనూజ తో కలిపే పులిహోర ని చూసి ఆడియన్స్ తెగ నవ్వుకునేవారు.
కానీ నిజ జీవితం లో ఆయనకు ఇంత అందమైన అమ్మాయి ఉందని మాత్రం ఎవ్వరూ ఊహించలేకపోయారు. ఇరు కుటుంబాలు కూడా పెళ్ళికి ఒప్పుకున్నాయి, ఫ్యామిలీ వీక్ లో ఇమ్మానుయేల్ కి ఆయన తల్లి నిశ్చితార్ధ ఉంగరం తెచ్చి ఇవ్వడాన్ని మనమంతా చూడొచ్చు. అంటే బిగ్ బాస్ హౌస్ నుండి బయటకు వచ్చిన కొద్దిరోజుల్లోనే ఇమ్మానుయేల్ పెళ్లి పీటలు ఎక్కబోతున్నాడు అన్నమాట. చూడాలి మరి రాబోయే రోజుల్లో ఈ జంటకు సంబంధించిన ఆసక్తికరమైన విషయాలు ఎలాంటివి బయటకు వస్తున్నాయి అనేది. ఇకపోతే ఇమ్మానుయేల్ ఈ వారం బిగ్ బాస్ హౌస్ లో టికెట్ టు ఫినాలే టాస్కులను ఎంత అద్భుతంగా ఆడుతున్నాడో మనమంతా చూస్తూనే ఉన్నాం. ఆయన ఊపు చూస్తుంటే, ఈ టాస్కులు మొత్తం ఆయనే గెలిచేలా అనిపిస్తున్నాడు.