Jr NTR Upcoming Movie Details: నందమూరి ఫ్యామిలీ మూడోతరం హీరోగా ఇండస్ట్రీ కి ఎంట్రీ ఇచ్చిన నటుడు జూనియర్ ఎన్టీఆర్… కెరియర్ మొదట్లో మాస్ సినిమాలు చేస్తూ ప్రేక్షకులను అలరించే ప్రయత్నం చేశాడు. ఇక వరుస గా మాస్ సినిమాలు చేయడంతో కొద్ది రోజుల పాటు ఆయనకి హిట్ అనేది కరువైంది. మరి రాజమౌళి తో చేసిన యమదొంగ సినిమాతో మరోసారి సక్సెస్ బాట పట్టాడు. ఇక అప్పటినుంచి అడపదడప సక్సెస్ లను సాధిస్తూ వస్తున్నాడు. ఇక పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ‘టెంపర్’ సినిమా చేసి సూపర్ సక్సెస్ ను సాధించాడు…ఇక అప్పటి నుంచి ‘దేవర’ సినిమా వరకు వరుసగా ప్రేక్షకులను మెప్పించే ప్రయత్నం అయితే చేశాడు. ఇక ఆయన వరుసగా 7 విజయాలను అందుకున్న ఈ తరం హీరోగా మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు. ఇక దానికి తోడుగా ‘వార్ 2’ సినిమాతో కూడా సూపర్ సక్సెస్ ని సాధిస్తాడని అందరు అనుకున్నారు. కానీ వార్ 2 సినిమా మాత్రం భారీగా డిజాస్టర్ ని మూటగట్టుకుంది. మరి ఇలాంటి సందర్భంలో ఎన్టీఆర్ ఈ సినిమాని ఎందుకు ఒప్పుకున్నాడు. ఈ మూవీలో ఆయన చేయాల్సినంత గొప్ప క్యారెక్టర్ ఏముంది అంటూ ఈ సినిమాను చూసిన ప్రేక్షకులు సైతం విమర్శలను చేశారు. మరి ఇలాంటి సందర్భంలోనే ఎన్టీఆర్ ఇకమీదట ఏ దర్శకుడితో ఎలాంటి సినిమాలు చేయాలి. ఎలాంటి సినిమా చేయకూడదు అనే ఒక నిర్ణయానికి వచ్చినట్టుగా తెలుస్తోంది. అందుకే తను ఏరికోరి మరి ఈ సబ్జెక్టులను సెలెక్ట్ చేసుకొని ఆయా దర్శకుడి యొక్క బలాలు బలహీనతలు ఏంటి అనేది తెలుసుకొని వాళ్ళు ఏ సబ్జెక్టుని డీల్ చేయగలరు అనేది తెలుసుకొని వాళ్లతో సినిమాలు చేయడానికి ఆసక్తి చూపిస్తున్నట్టుగా తెలుస్తోంది…
ఇక బాలీవుడ్ హీరో అయిన హృతిక్ రోషన్ తో కలిసి ఎన్టీఆర్ స్క్రీన్ మీద కనిపించిన తీరు బాగున్నప్పటికి కథలో పెద్దగా డెప్త్ లేకపోవడం ఎన్టీఆర్ పాత్రలో వైవిధ్యం ఉండకపోవడం వల్ల ఆయన రొటీన్ సినిమాల్లో చేసినట్టుగానే అనిపించింది. ఇక దానికి తోడుగా హాలీవుడ్ సినిమా రేంజ్ లో ఫైట్లను పెట్టినంత మాత్రాన సినిమా ఆడదు.
దానికి తగ్గ ఎమోషన్ ని ఆడ్ చేయాలి అలాగే కథలో నుంచి కాన్ఫ్లిక్ట్ రావాలి. అంతే తప్ప కావాలని కాన్ఫిట్ ని పుట్టిస్తే దాని నుంచి ప్రేక్షకులు డివియెట్ అయిపోయే అవకాశాలైతే ఉన్నాయి. కాబట్టి సినిమా సక్సెస్ అనేది అంత ఈజీగా రాదు. ఒక కథ ఏ ఎమోషన్ ని అయితే కోరుకుంటుందో దానికి తగ్గ ఎమోషన్ ని అందించినప్పుడే ఆ కథ చూసే ప్రేక్షకుడికి రక్తి కట్టిస్తోంది. దానివల్ల ప్రేక్షకుడు ఒక తెలియని అనుభూతిని ఫీల్ అవుతాడు.
అప్పుడే ఆ సినిమా ప్రేక్షకుడికి నచ్చుతోంది. అలా కాకుండా ఇష్టం వచ్చినట్టుగా ఫైట్లు పెట్టి భారీ రేంజ్ లో విజువల్స్ చూపించిన అంత మాత్రాన సినిమాలైతే ఆడవు…ఇక ఇప్పటికైనా ఎన్టీఆర్ ఈ విషయాన్ని తెలుసుకున్నందుకు సంతోషం అంటూ పలువురు సినిమా మేధావులు సైతం కామెంట్స్ చేస్తున్నారు…