Hari Shankar : హరీష్ శంకర్ డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్. ఆయన మాట తీరు కొంచెం కరుకుగా ఉంటుంది. సోషల్ మీడియాలో చాలా యాక్టివ్. తనపై విమర్శలు చేస్తే వెంటనే స్పందించారు. సోషల్ మీడియా వేదికగా పరుష వ్యాఖ్యలు చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. పవన్ కళ్యాణ్ మూవీ ఉస్తాద్ భగత్ సింగ్ విషయంలో ఫ్యాన్స్ ఆయన మీద నెగిటివ్ కామెంట్స్ చేశారు. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ పై ఆయన ఒకింత అసహనం వ్యక్తం చేశాడు. ప్రతి ఒక్కడూ సలహా ఇచ్చేవాడే అని ఎద్దేవా చేశాడు.
ఇదిలా ఉంటే తాజాగా మిస్టర్ బచ్చన్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో కొన్ని మీడియా సంస్థల మీద ఆయన ఫైర్ అయ్యారు. తన సినిమాకు ఎలాంటి రేటింగ్ ఇచ్చినా పర్లేదు. ఎలా రివ్యూ రాసుకున్నా నేను లెక్క చేయను అన్నారు. తన ఆత్మాభిమానం దెబ్బతీసిన కొందరితో నేను ముఖాముఖీ మాట్లాడాను. ఇట్స్ టైం ఫర్ గ్రాటిట్యూడ్ నాట్ యాటిట్యూడ్ అని హరీష్ శంకర్ అన్నారు.
హరీష్ శంకర్ చేసిన కామెంట్ గ్రేట్ ఆంధ్ర సంస్థను ఉద్దేశించే అని పలువురు అభిప్రాయపడుతున్నారు. గ్రేట్ ఆంధ్ర సంస్థ పట్ల చిత్ర పరిశ్రమలో సదాభిప్రాయం లేదు. నిరాధార కథనాలతో సెలెబ్రిటీలను ఇబ్బంది పెడతారనే వాదన ఉంది. తమ సంస్థకు ఇంటర్వ్యూలు ఇవ్వని నటులు, దర్శకుల చిత్రాలపై విమర్శలు, ప్రతికూల వార్తలు రాస్తారట. గ్రేట్ ఆంధ్ర ఒక బ్లాక్ మెయిలింగ్ సంస్థలా తయారయ్యిందనే ఆరోపణలు ఉన్నాయి.
ఇక హరీష్ శంకర్ ఆ సంస్థలో పని చేసే మూర్తి అనే జర్నలిస్ట్ తో విభేదించిన సందర్భాలు ఉన్నాయి. హరీష్ శంకర్ చిత్రంని ఉద్దేశించి ఓ గాసిప్ ట్విట్టర్ లో మూర్తి పోస్ట్ చేయగా.. హరీష్ శంకర్ స్పందించారు. మీకు నేరుగా నాతో మాట్లాడే అవకాశం కూడా ఉంది. మీకు తెలియకపోతే నన్ను అడగాల్సింది. కానీ నిరాధార పుకార్లు వ్యాప్తి చేయవద్దని… మూర్తికి హరీష్ శంకర్ గట్టి కౌంటర్ ఇచ్చాడు. ఇటీవల హరీష్ శంకర్ ని మూర్తి ఇంటర్వ్యూ చేసిన సంగతి తెలిసిందే.
మిర్చి 9 అనే మరొక సైట్ పట్ల కూడా హరీష్ శంకర్ అసహనంగా ఉన్నారు. మీడియాతో యాంకర్ సుమ భోజనాల వివాదం లేవనెత్తుతూ.. ఆ సంస్థ ప్రతినిధితో హరీష్ శంకర్ వాగ్వాదానికి దిగారు. ఈ క్రమంలో ఆగస్టు 15న విడుదల కానున్న తన చిత్రం పై సదరు సంస్థలు విషం కక్కే అవకాశం ఉందని హరీష్ ముందుగానే గమనించారు. అందుకే ఈ తరహా కామెంట్స్ చేశారు. హరీష్ శంకర్ ఏ ఉద్దేశంతో, ఎవరి గురించి మాట్లాడినా… సినిమా బాగుంటే ఎవరు ఆపలేరు.
ఇక మిస్టర్ బచ్చన్ సినిమా విషయానికి వస్తే… రవితేజ హీరోగా నటించారు. ఇది పీరియాడిక్ యాక్షన్ డ్రామా అని తెలుస్తుంది. మిస్టర్ బచ్చన్ ట్రైలర్ ఆకట్టుకోగా అంచనాలు పెరిగాయి. దాదాపు 13 ఏళ్ల క్రితం రవితేజ-హరీష్ శంకర్ కాంబోలో మిరపకాయ్ టైటిల్ తో ఒక చిత్రం వచ్చింది. అది సూపర్ హిట్. మిస్టర్ బచ్చన్ తో మరోసారి వారు కలిశారు. మిస్టర్ బచ్చన్ చిత్రం కోసం రవితేజ ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
Web Title: Harish shankar who challenged great andhra at mr bachchans pre release event
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com