Harish Shankar: హరీష్ శంకర్ మంచి కమర్షియల్ దర్శకుడే. ఏ హీరోని ఎలా చూపించాలి ? ఏ కథలో ఎలాంటి కమర్షియల్ ఎలిమెంట్స్ పెట్టాలి ? లాంటి అంశాల్లో హరీష్ శంకర్ కి మంచి పట్టు ఉంది. అయితే, హరీష్ శంకర్ సినిమాలన్నీ దాదాపు ఒకేలా ఉంటాయి. కొత్తదనం లాంటి ఐటమ్స్ హరీష్ కి పెద్దగా నచ్చవు. అక్కడ ఇక్కడ బుక్స్ చూసుకుని నాలుగు పంచ్ డైలాగ్ లు రాసుకోవడంలో ఉన్న కిక్, హరీష్ కి ఓ వినూత్న పాయింట్ తో సినిమా తీయడంలో ఉండదు.

మరి ఇలాంటి డైరెక్టర్.. వేరే డైరెక్టర్ కి కథ ఇస్తే ఇక ఎలా ఉంటుంది ? సొంత సినిమాకే రొటీన్ కథ రాసుకునే హరీష్ శంకర్ దగ్గర నుంచి అసలు కథ తీసుకున్న ఆ మహా దర్శకుడు ఎవరు అంటే.. కొత్త అతనే. అందుకే పాపం నచ్చినా నచ్చకపోయినా ఆ దర్శకుడు కథ అయితే బాగుంది అంటూ చక్కగా పద్దతిగా నాలుగు బిస్కెట్ మాటలు చెప్పి.. మొత్తానికి డైరెక్షన్ చేయడానికి తెగ ముచ్చట పడుతున్నాడు.
ఇంతకీ మెయిన్ మ్యాటర్ లోకి వెళ్తే.. ఈ మధ్య స్టార్ డైరెక్టర్లు తమ దగ్గర పని చేసిన అసిస్టెంట్ డైరెక్టర్లకు కథలు ఇచ్చి డైరెక్షన్ చేయిస్తున్నారు. అసలు ఈ శిష్యుల సినిమాలకు కథలు అందించే ఆనవాయితీని పట్టుకొచ్చింది సుకుమారే. ఆయనగారు తన సుకుమార్ రైటింగ్స్ లో తెరకెక్కే చిన్నాచితకా చిత్రాలకు కథలు మాటలు వేరే వాళ్ళ చేత రాయించి ఆయన పేరు వేసుకుంటాడు.
సుకుమార్ రైటింగ్స్ లో వచ్చే సినిమాలన్నింటికీ జరిగే బాగోతమే ఇది. కాకపోతే.. ఎవరో రాసిన కథలలో ఒత్తులు పొల్లులు మార్చి.. సంతోషంగా తన పేరు వేసుకుని.. క్రియేటివ్ డైరెక్టర్ నుంచి వస్తున్న అద్భుతమైన క్రియేటివిటీ అంటూ మార్కెట్ చేసుకుని డబ్బు చేసుకుంటున్నాడు సుక్కు. ఇలా సుకుమార్ ఒక్కడే చేయగలడా ? ఏ ? నేనెందుకు చేయకూడదు ? అందుకే, హరీష్ శంకర్ సైతం ఇదే పద్దతిని ఫాలో అవుతున్నాడు.
Also Read: Suriya: సూర్యకే తమ సపోర్ట్.. పోటీ పడుతున్న సెలబ్రిటీలు !
ఈ క్రమంలోనే తన శిష్యుడికి ‘వేదాంతం రాఘవయ్య’ అనే కథ ఇచ్చాడు. సునీల్ హీరోగా ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్ సంస్థ ఈ సినిమాను నిర్మిస్తోంది. నిజానికి చాలా రోజుల క్రితమే ఈ సినిమాని ప్రకటించారు గానీ, కరోనా కారణంగా లేట్ అయింది. అయితే.. ఎట్టకేలకు ఈ సినిమా సత్యదేవ్ హీరోగా స్టార్ట్ కానుంది. సునీల్ ని హీరోగా తప్పించారు.
Also Read: Prabhas: ప్రభాస్ ఫ్యాన్సే.. ప్రభాస్ సినిమా పై నెగిటివ్ ప్రచారమా ?