Hari Hara Veeramallu Trolls: స్టార్ హీరో కి సంబంధించిన టీజర్ కానీ,ట్రైలర్ కానీ విడుదల అయ్యినప్పుడు సోషల్ మీడియా మొత్తం ఒక రేంజ్ లో ఊగిపోతూ ఉంటుంది. ఎక్కడ చూసినా దాని గురించే చర్చ ఉంటుంది. అభిమానులు ఎప్పటి లాగానే తమ అభిమాన హీరో ని పొగుడుతారు. వేరే లెవెల్ లో ఉంది అని పోస్టులు చేస్తుంటారు. కానీ దురాభిమానులు మాత్రం ఫన్నీ ట్రోల్స్ ఇస్తుంటారు. ఈ ట్రెండ్ ప్రతీ హీరో కి ఉంటుంది. నేడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(Deputy CM Pawan Kalyan) హీరో గా నటించిన ‘హరి హర వీరమల్లు'(Hari Hara Veeramallu) ట్రైలర్ విడుదలైంది. ఫ్యాన్స్ ఈ ట్రైలర్ ని చూసి పూనకలొచ్చి ఊగిపోతున్నారు. ఫ్యాన్స్ నుండి ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో, దురాభిమానుల నుండి కూడా అలాంటి రెస్పాన్స్ వచ్చింది. అసలే పవన్ కళ్యాణ్ ఆంధ్ర ప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి. ఆయన్ని ప్రతిపక్షం లో ఉండేవాళ్ళు ట్రోల్ చేయకుండా ఉండరు కదా.
Also Read: అందాల ఆరబోతలో దిట్ట ఈ బొమ్మ. చూస్తే ఫిదా అవాల్సిందే
అలా కొన్ని ట్రోల్స్ సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యాయి. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ ట్రైలర్ చివర్లో బల్లెం పట్టుకొని తిప్పుతూ తన ఎదురుగా వచ్చే బల్లేలను కొట్టడం బాహుబలి నుండి కాపీ కొట్టారని అంటున్నారు. అంతే కాకుండా బల్లెం ని పట్టుకొని ‘గిర్రా గిర్రా’ తిప్పుతూ విలన్స్ ని నరికే షాట్ ఎన్టీఆర్ అరవింద సమేత నుండి కాపీ కొట్టారని అంటున్నారు. అదే విధంగా పవన్ కళ్యాణ్ లుక్ ని ‘అత్తారింటికి దారేది’ లో బ్రహ్మానందం లుక్స్ తో పోలుస్తూ అల్లు అర్జున్ అభిమానులు కొంతమంది ఫన్నీ ట్వీట్స్ వేయగా అవి కూడా బాగా వైరల్ అయ్యాయి. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ట్రోల్స్ ఉన్నాయి. ఒక సన్నివేశం లో పవన్ కళ్యాణ్, నిధి అగర్వాల్ తండ్రి కూతుర్లు లాగా ఉన్నారని అంటున్నారు. ఓవరాల్ గా దురాభిమానుల నుండి ట్రైలర్ చాలా నీరసంగా ఉందని, ట్రైలరే ఇంత స్లో గా ఉంటే, సినిమా ఇంకెంత స్లో గా ఉంటుందో అని కామెంట్స్ చేస్తున్నారు.
Also Read: కూలీ మూవీ కోసం మాస్టర్ ప్లాన్ వేసిన లోకేష్ కనకరాజ్…
సోషల్ మీడియా లో బాగా వైరల్ అయినా కొన్ని ఫన్నీ ట్రోల్స్ ని మీ కోసం క్రింద అందిస్తున్నాము చూడండి. ఇదంతా పక్కన పెడితే నిన్న మొన్నటి వరకు ప్రతీ పోస్టర్ లోనూ డైరెక్టర్ విభాగం లో జ్యోతి కృష్ణ పేరుతో పాటు, క్రిష్ జాగర్లమూడి పేరు కూడా వేసేవారు. కానీ ఇప్పుడు క్రిష్ పేరు ని తీసేసి కేవలం జ్యోతి కృష్ణ పేరు ని మాత్రమే వేశారు. దీనిపైనా కూడా దురాభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. క్రిష్ కి ప్రేక్షకుల్లో మంచి పేరుంది. ఆయన ఈ చిత్రాన్ని 70 శాతం కి పైగా తీసాడు. అలాంటి వ్యక్తి పేరు తీసేసి, కేవలం కొన్ని ఫిల్లర్ సన్నివేశాలను తెరకెక్కించిన జ్యోతి కృష్ణ పేరు ని మెయిన్ గా వెయ్యడం అన్యాయమని అంటున్నారు.
Expectations reality pic.twitter.com/Sbad0MyoOl
— ⚔️ (@Aarya_9999) July 3, 2025
pic.twitter.com/GDpwUk6cat https://t.co/zEtfDHiJAE
— ⚔️ (@Aarya_9999) July 3, 2025
— Bunny – Youth Icon Of India (@BunnyYouthIcon) July 3, 2025