Hari Hara Veeramallu Ticket Rates : వచ్చే నెల 12వ తారీఖున పవన్ కళ్యాణ్(Deputy CM Pawan Kalyan) హీరో గా నటించిన ‘హరి హర వీరమల్లు'(Hari Hara Veeramallu) చిత్రం విడుదల అవుతున్న సందర్భంగా ఆ సినిమాకు సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ లో క్షణం తీరిక లేకుండా గడుపుతున్న మూవీ టీం ఇప్పుడు సినిమాకు సంబంధించిన టికెట్ హైక్స్, బెనిఫిట్ షోస్ కోసం ఇరు రాష్ట్ర ప్రభుత్వాల అనుమతిని కోరే పనిలో పడింది. అందులో భాగంగా నేడు నిర్మాత AM రత్నం(AM Ratnam) తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) ని కలిసి ‘హరి హర వీరమల్లు’ చిత్రానికి టికెట్ రేట్స్ మరియు బెనిఫిట్ షోస్ కావాల్సిందిగా రిక్వెస్ట్ చేశాడట. అందుకు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియా లో మూవీ టీం అప్లోడ్ చేయగా అవి బాగా వైరల్ అయ్యాయి. నేడు సీఎం తో మా నిర్మాత ‘హరి హర వీరమల్లు’ చిత్రం టికెట్ రేట్స్ గురించి చర్చలు జరిపాడని, సీఎం గారు సానుకూలంగా రెస్పాన్స్ ఇచ్చారని అంటున్నారు.
మరో రెండు మూడు రోజుల్లో టికెట్ రేట్స్ కి సంబంధించిన జీవో ని తెలంగాణ ప్రభుత్వం విడుదల చేసే అవకాశాలు ఉన్నాయి. ‘పుష్ప 2’ చిత్రం వరకు తెలంగాణ లో ఏ సినిమాకి కూడా టికెట్ రేట్స్ హైక్స్ విషయం లో కానీ, బెనిఫిట్ షోస్ విషయం లో కానీ సమస్యలు ఉండేటివి కాదు. కేవలం ఒక్క ఫోన్ కాల్ సంబాషణతో సెట్ చేసుకునేవారు నిర్మాతలు. కానీ సంధ్య థియేటర్ లో జరిగిన తొక్కిసలాట ఘటన తర్వాత తెలంగాణ ప్రభుత్వం టికెట్ హైక్స్, బెనిఫిట్ షోస్ విషయం లో కఠినంగా వ్యవహరించడం మొదలు పెట్టింది. ఈ ఏడాది భారీ అంచనాల నడుమ విడుదలైన ‘గేమ్ చేంజర్’ చిత్రానికి టికెట్ హైక్స్ ఇచ్చారు కానీ , నాలుగు గంటల ఆట ప్రదర్శించుకోవడానికి అనుమతిని కూడా ఇచ్చారు. కానీ వారం రోజుల తర్వాత ఎత్తివేయాల్సి వచ్చింది.
‘హరి హర వీరమల్లు’ చిత్రానికి అలాంటి అడ్డంకులు దొరికే అవకాశాలు లేనట్టుగా స్పష్టంగా కనిపిస్తుంది. సీఎం రేవంత్ రెడ్డి కి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కి మంచి సాన్నిహిత్య సంబంధం ఉంది. సంధ్య థియేటర్ ఘటన విషయం లో కూడా ఆయన తన సొంత కుటుంబ సభ్యుడు అల్లు అర్జున్ కి గుడ్డిగా సపోర్ట్ చెయ్యలేదు. నేను ఆ స్థానం లో ఉన్నా రేవంత్ రెడ్డి అరెస్ట్ చేస్తాడు,’థట్ ఈజ్ రేవంత్ రెడ్డి’ అంటూ పొగడ్తలతో ముంచి ఎత్తాడు. అంతే కాకుండా రేవంత్ రెడ్డి సీఎం కాకముందు పవన్ కళ్యాణ్ ఏర్పాటు చేసిన కొన్ని రౌండ్ టేబుల్ కాన్ఫెరెన్స్ మీటింగ్స్ కి కూడా రేవంత్ రెడ్డి హాజరయ్యాడు. అలా వాళ్ళిద్దరి మధ్య మొదటి నుండి మంచి సాన్నిహిత్యం ఉండడంతో టికెట్ రేట్స్, బెనిఫిట్ షోస్ చాలా సులువుగా పడే అవకాశాలు ఉన్నాయి.
Producer @AMRathnamOfl garu met with Hon’ble @TelanganaCMO Shri @revanth_anumula garu to discuss about #HariHaraVeeraMallu
As the film is set in the 17th century, it is a historical epic crafted on a grand scale, distinct from regular commercial films. The meeting also touched… pic.twitter.com/fXBAEJHGKw
— Hari Hara Veera Mallu (@HHVMFilm) May 30, 2025