Hari Hara Veeramallu : పవన్ కళ్యాణ్(Deputy CM Pawan Kalyan) అభిమానుల సహనానికి పరీక్ష పెట్టి, మరో వారం రోజుల్లో విడుదల అవుతుంది ఆనుకుంటున్న సమయంలో వాయిదా పడిన ‘హరి హర వీరమల్లు'(Hari Hara Veeramallu) చిత్రం, అనేక చర్చలు జరిపిన తర్వాత ఎట్టకేలకు విడుదల తేదీని లాక్ చేసుకున్నట్టు తెలుస్తుంది. కాసేపటి క్రితమే ఆ చిత్ర మేకర్స్ విడుదల తేదీ గురించి అధికారిక ప్రకటన చేశారు. రేపు ఉదయం 7 గంటల 23 నిమిషాలకు సరికొత్త పోస్టర్ తో విడుదల తేదీని ప్రకటిస్తారట. ఈ చిత్రాన్ని మేకర్స్ జులై 17 న ఫిక్స్ చేయాలని చాలా వరకు ప్రయత్నాలు చేశారు. కానీ ఈ సినిమాని కొనుగోలు చేసిన ఓటీటీ సంస్థ మాత్రం ఎట్టి పరిస్థితిలోను కుదరదని తేల్చి చెప్పింది. జులై 11 నే విడుదల చెయ్యాలని పట్టుబట్టింది. అప్పటికి సినిమా రెడీ అయ్యే పరిస్థితి లేకపోవడంతో మేకర్స్ జులై 24న విడుదల చేసుకునే ఛాయస్ ఇవ్వాలని రిక్వెస్ట్ చేశారు.
కానీ వాళ్ళు ఒప్పుకోలేదు, కచ్చితంగా పెనాల్టీ కట్టాల్సిందే అని పట్టుబట్టారు. నేడు కూడా అమెజాన్ ప్రైమ్ సంస్థ తో చర్చలు జరిగాయి. కొంతమంది చెప్పేది ఏమిటంటే చర్చలు ఇంకా ముగియలేదు, అయినప్పటికీ రేపు విడుదల తేదీని ప్రకటిస్తున్నారు అంటూ కామెంట్ చేస్తున్నారు. మరి కొంతమంది అయితే ఇక వాయిదాలు లేవు, సినిమా విడుదల అయిపోతుంది, సంతోషంగా ఉండండి అంటూ కామెంట్ చేస్తున్నారు. ఏది ఏమైనా ఈసారి గట్టి ప్రొమోషన్స్ చేసి ఎట్టిపరిస్థితిలో సినిమాని గ్రాండ్ గా జులై 24 న విడుదల చెయ్యాలనే కసితో ఉన్నారు. ఈ చిత్రానికి సంబంధించిన గ్రాఫిక్స్ వర్క్ కూడా వచ్చే వారం పూర్తి స్థాయి లో డెలివరీ అవుతుందట. జులై 4 లేదా జులై 5 న థియేట్రికల్ ట్రైలర్ ని విడుదల చేసే ఆలోచనలో ఉన్నారట మేకర్స్. ఈ చిత్రం టీం కి సన్నిహితం ఉండే వాళ్ళు చెప్పేది ఏమిటంటే, ఇది పవన్ కళ్యాణ్ బాహుబలి అని, ట్రైలర్ లోని గ్రాండియర్ విజువల్స్ చూసిన తర్వాత మెంటలెక్కిపోతారని అంటున్నారు.
సినిమాలో ఒక గంట నిడివి అభిమానులకు రోమాలు నిక్కపొడిచే రేంజ్ లో ఉంటాయట. ప్రతీ సన్నివేశం ఫ్యాన్స్ కి గూస్ బంప్స్ రప్పిస్తాయట. ఈ ట్రైలర్ ని వకీల్ ట్రైలర్ ని ఎలా అయితే థియేటర్స్ లో విడుదల చేశారో, అలా థియేటర్స్ లో గ్రాండ్ గా విడుదల చేస్తారట. రెండు తెలుగు రాష్ట్రాలకు కలిపి దాదాపుగా 500 థియేటర్స్ లో ట్రైలర్ రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు. ఉప ముఖ్యమంత్రి అయ్యాక పవన్ కళ్యాణ్ నుండి వస్తున్న మొట్టమొదటి రిలీజ్ కావడంతో అభిమానులు సంబరాలు అంబరాన్ని అంటే విధంగా చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. సినిమాకు భారీ హైప్ ని తీసుకొచ్చేలా అన్ని విధాలుగా అభిమానులు సిద్ధమయ్యారు. చూడాలి మరి ఎలా ఉండబోతుంది అనేది.
Ok let’s Start……
Tomorrow at 7:23AM….#HariHaraVeeraMallu pic.twitter.com/75thf6arrA
— Hari Hara Veera Mallu (@HHVMFilm) June 20, 2025