Hari Hara Veeramallu: ఒకప్పుడు ఎన్నో సంచలనాత్మక చిత్రాలను నిర్మించిన నిర్మాత AM రత్నం(AM Ratnam). ఒకే ఒక్కడు, భారతీయుడు, కర్తవ్యం, ఖుషి,గిల్లీ, వేదలమ్, ఆరంభం ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే ఉన్నాయి. అలాంటి సంచలనాత్మక చిత్రాలను చేసి దేశం గర్వించదగ్గ నిర్మాతల్లో ఒకరిగా నిల్చిన రత్నం, ఈమధ్య కాలంలో సినిమాలకు బాగా దూరమైన సంగతి మన అందరికీ తెలిసిందే. చాలా కాలం గ్యాప్ తర్వాత ఆయన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(Deputy CM PAwan Kalyan) తో ‘హరి హర వీరమల్లు'(Hari Hara Veeramallu Movie) చిత్రాన్ని నిర్మించాడు. ఏ ముహూర్తం లో ఈ సినిమాని మొదలు పెట్టాడో తెలియదు కానీ, మొదలు పెట్టినప్పటి నుండి అన్నీ అవాంతరాలు ఎదురు అవుతూ వచ్చాయి. ఈ సినిమా కోసం ఆయన దాదాపుగా 300 కోట్లు ఖర్చు చేసాడు. ఎట్టకేలకు అవాంతరాలను అధిగమించుతూ ఈ చిత్రాన్ని పూర్తి కూడా చేసాడు. వచ్చే నెల 12న ఈ చిత్రం విడుదల కాబోతుంది.
అయితే ఏ నిర్మాతకు అయినా సినిమా విడుదలకు ముందు ఫైనాన్షియర్స్ కి తీసుకున్న డబ్బులు కట్టాల్సి ఉంటుంది. ఇప్పుడు రత్నం కి కూడా అదే పరిస్థితి ఎదురైంది. అందుకే ఆయన ఈ చిత్రాన్ని కళ్ళు చెదిరే భారీ రేట్స్ కి అమ్మాలని చూస్తున్నాడు. ఏ రేంజ్ లో అంటే రీసెంట్ గా విడుదలైన #RRR, పుష్ప 2 చిత్రకంటే ఎక్కువ డిమాండ్ చేస్తున్నాడు. ఉదాహరణకు తూర్పు గోదావరి జిల్లా ని తీసుకుందాం. అక్కడ ఈ సినిమా రైట్స్ కోసం బయ్యర్స్ ని ఆయన 16 కోట్ల రూపాయిలు డిమాండ్ చేస్తున్నాడు. అడ్వాన్స్ గా ముందు 10 కోట్లు ఇవ్వాలట. ఇప్పటి వరకు ఏ సినిమాకు కూడా ఏ నిర్మాత ఈ రేంజ్ లో డిమాండ్ చేయలేదు. అంత ఇచ్చేందుకు మేము సిద్ధంగా లేమని వచ్చిన బయ్యర్స్ వెనక్కి వెళ్లిపోతున్నారు. అడిగినంత ఇస్తే ఇవ్వండి, లేకపోతే వెళ్లిపోండి అనే ధోరణితోనే రత్నం వ్యవహరిస్తున్నాడు, అసలు తగ్గడం లేదు.
నైజాం ప్రాంతం హక్కుల కోసం దిల్ రాజు, మైత్రీ మూవీ మేకర్స్, గ్లోబల్ సినిమాస్ సంస్థలు పోటీ పడుతున్నాయి. ముందుగా మైత్రీ మూవీ మేకర్స్ నైజాం ప్రాంతం లో తీసుకుందాం అనుకున్నారు. కానీ వాళ్ళు మాకు కమీషన్ బేసిస్ మీద కావాలని అడగడం తో రత్నం అందుకు ఒప్పుకోలేదు. ఇప్పుడు దిల్ రాజు తో చర్చలు జరుపుతున్నాడు, మరో పక్క గ్లోబల్ సినిమాస్ తో చర్చలు నడుస్తున్నాయి. ఓవర్సీస్ పరిస్థితి కూడా ఇంతే. అన్ని ప్రాంతాల్లోనూ నిర్మాత రత్నం బిజినెస్ విషయం లో తేల్చడం లేదు. ఇదే తరహా పద్దతి ని కొనసాగిస్తే ఇక ఎప్పటికీ ఈ సినిమా బిజినెస్ క్లోజ్ అవ్వాలి?, ఎప్పుడు విడుదల అవ్వాలి?, వచ్చే వారం లో బయ్యర్స్ ఖరారు అవ్వకపోతే విడుదల కష్టమే. ఈ నెల 21న ఆయన ప్రెస్ మీట్ ని ఏర్పాటు చేయనున్నాడు, అందులో ఏమి మాట్లాడుతాడో చూడాలి.