Hari Hara Veeramallu postponed once again : ఇప్పటివరకు యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో ఎవరికీ సాధ్యం కానీ రీతిలో గొప్ప గుర్తింపును సంపాదించుకుంటూ ముందుకు దూసుకెళ్తున్న స్టార్ హీరోలు చాలామంది ఉన్నారు. ఇక యంగ్ హీరోలు మాత్రం ప్రత్యేకమైన ఐడెంటిటిని క్రియేట్ చేసుకోవడంలో మరి కొంతమంది హీరోలు మాత్రం తడబడుతున్నారు. మరి ఇలాంటి సందర్భంలోనే స్టార్ హీరోగా మారాలి అంటే వరుస సక్సెస్ లను సాధిస్తూ ముందుకు దూసుకెళ్లాల్సిన అవసరమైతే ఉంది…
ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్న స్టార్ హీరోలందరు వాళ్ళకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ను సంపాదించుకోవడానికి తీవ్రమైన ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఇక అందులో భాగంగానే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pavan Kalyan) సైతం అటు రాజకీయాల్లో సక్సెస్ ఫుల్ గా ముందుకు సాగుతూనే ఇటు సినిమాలను సైతం soer హిట్ గా నిలపాలనే ప్రయత్నం చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇక ఇప్పటివరకు ఆయన చేసిన సినిమాలు ఆయనకు గొప్ప గుర్తింపును తీసుకొచ్చినవే కావడం విశేషం…ఇక ప్రస్తుతం ఆయన నుంచి ‘హరిహర వీరమల్లు’ అనే సినిమా రిలీజ్ కి రెడీ అయింది. అయితే జూన్ 12వ తేదీన ఈ సినిమాను రిలీజ్ చేస్తున్నామని అఫీషియల్ గా అనౌన్స్ చేసినప్పటికి ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం అయితే ఈ సినిమా జూన్ 12వ తేదీన రావడం లేదు అనేది చాలా స్పష్టంగా తెలుస్తోంది.
Also Read : జూన్ 12 న ‘హరి హర వీరమల్లు’ సినిమా వస్తుంది అనుకున్నారు..కానీ ట్రైలర్ వస్తోంది..సినిమా ఎప్పుడో!
మరి కొత్త రిలీజ్ డేట్ ని అనౌన్స్ చేయాల్సిన అవసరమైతే ఉంది. ఇక ఇప్పటివరకు అత్యధిక సార్లు రిలీజ్ డేట్ ను వాయిదా వేసుకున్న సినిమా ఏదైనా ఉంది అంటే అది హరి హర వీరమల్లు సినిమా అనే చెప్పాలి. ఈ సినిమాకు సంబంధించి డిస్ట్రిబ్యూటర్స్, ఎగ్జిబ్యూటర్స్ కి కొంతవరకు నష్టాలైతే ఎదురవుతున్నాయి.
ఎందుకంటే ఈ సినిమాని కొనడానికి వాళ్లు ఎక్కువగా డబ్బులు వెచ్చించే పరిస్థితి అయితే లేదు. ఎందుకంటే ఇప్పటికే ఎగ్జిబ్యూటర్లు చాలా వరకు నష్టాల్లో ఉన్నారు ఎప్పుడైతే ఓటిటి ప్లాట్ ఫామ్ లు అందుబాటులోకి వచ్చాయో అప్పటినుంచి థియేటర్లలో ప్రేక్షకులు థియేటర్లలో సినిమాలు చూడడం మానేసారు.
కాబట్టి అప్పటినుంచి సినిమాలు ఏవి కూడా పెద్దగా ఆడటంలేదు. దానివల్ల డిస్ట్రిబ్యూటర్ల ఎగ్జిబ్యూటర్స్ కి ఎక్కువ నష్టాలు వస్తున్నాయి. దాంతో హరిహర వీరమల్లు సినిమాకు కూడా ఇదే పరిస్థితులు వస్తాయి అని వాళ్లు ఈ సినిమాను కొనడానికి ఇంట్రెస్ట్ చూపించడం లేదు… దీనివల్ల ఈ సినిమాని ఎప్పుడు రిలీజ్ చేయాలి అనే దాని మీదనే ఇప్పుడు ఇండస్ట్రీలో పలు ఆసక్తికరమైన చర్చలైతే నడుస్తున్నాయి. చూడాలి మరి ఇక మీదట ఈ సినిమా రిలీజ్ కి సంబంధించిన సరైన డేట్ వస్తుందా లేదా అనేది…