Pawan Kalyan Hari Hara Veeramallu: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ని రాజకీయ నాయకుడిగా కంటే సినిమా హీరోగా ఇష్టపడేవారే అధికం. టాలీవుడ్ లో అత్యధిక ఫ్యాన్ బేస్ కలిగిన పవన్ కళ్యాణ్ జయాపజయాలతో సంబంధం లేకుండా రికార్డ్స్ నమోదు చేస్తూ ఉంటారు. ఆయన ప్లాప్ చిత్రాలకు కూడా ఓ రికార్డు ఉంటుంది. అది ఆయన రేంజ్. పొలిటికల్ ఎంట్రీ తర్వాత ఫ్యాన్స్ కోరుకునే స్థాయి చిత్రాలు ఆయన నుండి రావడం లేదు. కమ్ బ్యాక్ అనంతరం పవన్ కళ్యాణ్ చేసిన వకీల్ సాబ్, భీమ్లా నాయక్ విజయం సాధించినప్పటికీ ఫ్యాన్స్ కోరుకునే హై అయితే ఇవ్వలేదు. కారణం అవి రీమేక్ చిత్రాలు కావడమే.

మరోవైపు పవన్ కంటే వెనకొచ్చిన ప్రభాస్, ఎన్టీఆర్, అల్లు అర్జున్, రామ్ చరణ్ పాన్ ఇండియా హిట్స్ కొట్టారు. దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నారు. పవన్ ఇంకా ఆ లీగ్ లోకి చేరలేదు. ప్రతి విషయంలో మా అన్న తర్వాతే అని భావించే ఫ్యాన్స్ ఈ విషయంలో నిరాశ వ్యక్తం చేస్తున్నారు. పాన్ ఇండియా హిట్ కొట్టి పవన్ తానేమిటో నిరూపించుకోవాలని భావిస్తున్నారు.
Also Read: NTR- Amit Shah: టీడీపీ, ఎల్లో మీడియాలో కలకలం రేపుతోన్న జూనియర్ ఎన్టీఆర్
క్రిష్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ చేస్తున్న హరి హర వీరమల్లు దీనికి అనువైన చిత్రమని భావిస్తున్నారు. మొఘలుల కాలం నాటి పీరియాడిక్ కథలో పవన్ బందిపోటుగా కనిపించనున్నారు. యూనివర్సల్ సబ్జెక్టు తో తెరకెక్కుతున్న ఈ మూవీ ఐదు భాషల్లో పాన్ ఇండియా చిత్రంగా విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. దీంతో ఈ మూవీ కోసం ఫ్యాన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్నారు.

అయితే హరి హర వీరమల్లు రషెస్ చూసిన పవన్ అసంతృప్తి వ్యక్తం చేశారని, కొన్ని మార్పులు చేర్పులు సూచించినట్లు వార్తలు వచ్చాయి. అలాగే పొలిటికల్ గా బిజీగా ఉన్న పవన్ ఈ ప్రాజెక్ట్ ఏకంగా పక్కన పెట్టినట్లు కథనాలు వెలువడ్డాయి. కాగా హరి హర వీరమల్లు మిగతా భాగం పవన్ పూర్తి చేయనున్నారట. 2023 మార్చ్ నెలలో ఈ మూవీ విడుదల కానుందని ఓ న్యూస్ టాలీవుడ్ లో చక్కర్లు కొడుతుంది. మరి అదే కనుక జరిగితే అభిమానులకు పండగే అని చెప్పాలి.
స్టార్ ప్రొడ్యూసర్ ఏ ఎం రత్నం నిర్మిస్తున్న ఈ చిత్రంలో నిధి అగర్వాల్, నోరా ఫతేహి హీరోయిన్స్ గా నటిస్తున్నారు. కీరవాణి సంగీత దర్శకుడు. విడుదలైన ప్రోమోలు సినిమాపై అంచనాలు పెంచేశాయి. ఫ్యాన్స్ ఆసక్తిగా ఈ మూవీ కోసం ఎదురు చూస్తున్నారు.
[…] […]