Hari Hara Veera Mallu: క్రియేటివ్ డైరెక్టర్ క్రిష్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ హీరోగా వస్తున్న ‘హరిహర వీరమల్లు’ సినిమా నుంచి ఒక క్రేజీ అప్ డేట్ వచ్చింది. సంగీత దర్శకుడు ఎం ఎం కీరవాణి ఈ అప్ డేట్ ఇచ్చారు. ఈ సినిమాలో సెకండ్ హాఫ్ లో వచ్చే ఓ ప్రత్యేకమైన సాంగ్ ను ప్రస్తుతం ప్రముఖ సాహిత్య రచయిత రామజోగయ్య శాస్త్రి రాసినట్టు తెలిపారు. ఇది అద్భుతమైన ప్రేమ గీతం అని కీరవాణి చెప్పారు.

దీని కోసం ఆయన చాలా శ్రమిస్తున్నారని కీరవాణి సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. ఈ మేరకు కీరవాణి ఓ ఇంట్రెస్టింగ్ పోస్ట్‌ను పెట్టారు. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరల్ అవుతోంది. ఈ సినిమా కొత్త షెడ్యూల్ లో నోరా ఫతేహీ పై ఓ సాంగ్ ను షూట్ చేయబోతున్నారు. ఇక ఈ క్రేజీ చిత్రం హరిహర వీరమల్లు దసరాను టార్గెట్ చేసినట్టు చిత్ర వర్గాలు అంటున్నాయి. వచ్చే నెలలో చిత్ర తదుపరి షెడ్యూల్ ప్రారంభమవుతుండగా సింగిల్ షెడ్యూల్‌లో షూటింగ్ పూర్తి చేయాలని క్రిష్ భావిస్తున్నారట.
Also Read: Playback Movie: అంత గొప్ప సినిమా ఎందుకు హిట్ కాలేదు.. ఇప్పటికీ డౌటే ?
ఇప్పటికే 60 శాతం పూర్తి కాగా, అక్టోబర్ 5న విజయ దశమి సందర్భంగా విజయదుందుభి మోగించాలనుకుంటున్నారు. అయితే, పవన్ కళ్యాణ్ వరుసగా సినిమాలు ఒప్పుకుంటూ డేట్లు అన్ని సినిమాలకు తలా నాలుగు రోజులు ఇస్తూ ఎలాగోలా ఒకేసారి మూడు సినిమాలను బ్యాలెన్స్ చేస్తూ వస్తున్నాడు. దాంతో క్రిష్ సినిమా బాగా లేట్ అవుతుంది. అసలుకే మొఘల్ కాలం నాటి కథతో తెరకెక్కుతోంది హరిహర వీరమల్లు సినిమా.

కాబట్టి, సినిమా నేపథ్యానికే ఎక్కువ సమయం కేటాయించాల్సి వస్తోంది. పైగా పవన్ కి ఈ సినిమాలో 3 షేడ్స్ కు సంబంధించి 3 డిఫరెంట్ గెటప్స్ ప్లాన్ చేశాడు క్రిష్. ఒకటి వజ్రాల దొంగ వీరమల్లు గెటప్ అయితే, సిక్కు సైనికుల్ని కాపాడే రక్షకుడిగా మరో గెటప్, అలాగే దేశం కోసం పోరాడే వీరుడిగా మరో గెటప్ లో పవన్ కనిపించబోతున్నాడు.
అన్నిటికీ మించి 17వ శతాబ్దం నాటి కథ కావడంతో.. పవన్ దుస్తులు, యాక్ససరీస్ పై ప్రత్యేకంగా దృష్టి పెట్టాల్సిన పరిస్థితి ఉంది. ఇలా పవన్ పాత్రలో 3 డిఫరెంట్ షేడ్స్, గెటప్స్ ఉండటంతో చాల స్లోగా సాగుతుంది షూటింగ్. ఏది ఏమైనా దసరాకి మాత్రం సినిమా రిలీజ్ చేయాలని నిర్మాత రత్నం ప్లాన్. మరి ఏమవుతుందో చూడాలి.
Also Read:Rashmika Mandanna: తన డైట్ వీడియో పోస్ట్ చేసిన ‘రష్మిక మండన్నా’ !
And Ramajogayya Shasthry garu is working hard on a love song for HHVM.
— mmkeeravaani (@mmkeeravaani) April 30, 2022
Recommended Videos: