Hari Hara Veera Mallu Producer Meeting : భారీ అంచనాల నడుమ మరో రెండు రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రావాల్సిన పవన్ కళ్యాణ్(Deputy CM Pawan Kalyan) ‘హరి హర వీరమల్లు'(Hari Hara Veeramallu) చిత్రం కొన్ని అనివార్య కారణాల వల్ల వాయిదా పడిన సంగతి మన అందరికీ తెలిసిందే. ఆ అనివార్య కారణాలు ఏంటో మన అందరికీ తెలుసు. సినిమాకి బడ్జెట్ 250 కోట్ల రూపాయలకు మించి అయ్యింది. నిర్మాత AM రత్నం అదే రేంజ్ లో ఈ సినిమాని అమ్మాలని అనుకుంటున్నాడు. కానీ ఇప్పటి వరకు విడుదల చేసిన ప్రమోషనల్ కంటెంట్ లో AM రత్నం పెట్టిన ఖర్చు అసలు కనిపించలేదు. దీంతో మేకర్స్ ఆయన అడిగినంత ఇవ్వలేము, ప్రస్తుత మార్కెట్ ని బట్టే ఇస్తాము అంటూ చెప్పుకొచ్చారు. కానీ నిర్మాత రత్నం మాత్రం అసలు తగ్గడం లేదు. ఈ సినిమాకు సంబంధించిన పూర్తి VFX వర్క్ ని మీరు చూడలేదు, చూస్తే ఆశ్చర్యపోతారు, అప్పుడు మీరే నేను కోరిన రేట్స్ ఇస్తారు అని అంటున్నాడు.
సమయానికి VFX వర్క్ ఇటలీ కంపెనీ నుండి ఇంకా డెలివరీ అవ్వలేదు. దీంతో ఈ చిత్రాన్ని వాయిదా వేయాల్సి వచ్చింది. ప్రస్తుతం ఆ చిత్ర డైరెక్టర్స్ లో ఒకరైన జ్యోతి కృష్ణ ఇటలీ కి వెళ్లి స్వయంగా VFX వర్క్ ప్రోగ్రెస్ ఎంత వరకు వచ్చిందో తెలుసుకుంటున్నాడు. ఆ వర్క్ మొత్తం పూర్తి అయ్యాకనే ఆయన ఇటలీ నుండి తిరిగి వస్తాడట. ఈ నెల 21 లోపు మొదటి కాపీ VFX తో సహా సిద్ధం అవుతుందని చెప్తున్నారు. ఈ వారం లోనే థియేట్రికల్ ట్రైలర్ కి సంబంధించిన అప్డేట్ రాబోతుందట. ఇదంతా పక్కన పెడితే ఈ సినిమా విడుదల ఎప్పుడు అనే దానిపై సోషల్ మీడియా లో నిన్న రకరకాల ప్రచారాలు మొదలయ్యాయి. ప్రస్తుతం సినిమా విడుదల తేదీ నిర్మాత చేతిలో లేదు, అమెజాన్ ప్రైమ్ చేతిలో ఉంది.
Also Read : పవన్ కళ్యాణ్ మంచితనం కారణంగానే ‘హరి హర వీరమల్లు’ వాయిదా పడిందా?
ఈ సినిమా ఓటీటీ హక్కులను ఆ సంస్థ 120 కోట్ల రూపాయలకు కొనుగోలు చేసింది. అయితే వాళ్లకు ఒక విడుదల తేదీని చెప్తే కచ్చితంగా ఆ తేదీన విడుదల చేయాల్సిందే. లేకపోతే ముందు అనుకున్న డీల్ లో డబ్బులు కట్ చేసుకుంటూ వస్తారు. కానీ ‘హరి హర వీరమల్లు’ విషయం లో వాళ్ళు అలా చేయలేదు. రెండు మూడు సార్లు ఈ ఏడాదిలోనే వాయిదా వేసినప్పటికీ పవన్ కళ్యాణ్ సినిమా అవ్వడంతో ఎలాంటి కట్టింగ్స్ లేకుండా పెద్ద మనసు చూపారు. కానీ మళ్ళీ వాయిదా పడడంతో ఈసారి కచ్చితంగా డబ్బులు కట్ చేసే అవకాశం ఉంటుంది. నిన్న అమెజాన్ ప్రైమ్ సంస్థ తో నిర్మాత AM రత్నం చర్చలు జరిపాడు. ఈ విషయం సోషల్ మీడియా లో లీక్ అవ్వడంతో విడుదల తేదీ పై అనేక రూమర్స్ వచ్చాయి. ఈ రూమర్స్ మూవీ టీం వరకు చేరడంతో ‘సోషల్ మీడియా లో వచ్చే రూమర్స్ ని నమ్మకండి..విడుదల త్వరలోనే రెండు మూడు రోజుల్లో మేమే ప్రకటిస్తాము’ అంటూ ఒక ట్వీట్ వేసింది.