Hardik Pandya: ఇండియన్ క్రికెట్ టీమ్ లో ఎంతమంది ప్లేయర్లు ఉన్నప్పటికి కొంతమందికి మాత్రమే చాలా మంచి గుర్తింపు ఉంటుంది. ఇక బ్యాట్స్ మెన్స్, బౌలర్లు ల కంటే ఆల్ రౌండర్లు టీమ్ కి ఎక్కువ సేవలను అందిస్తుంటారు. అటు బ్యాట్ తోను, ఇటు బాల్ తోను రెండింటితో అదరగొడుతూ ప్రేక్షకుల్లో ఫేవరెట్ ప్లేయర్లు గా నిలుస్తుంటారు. అలాంటి వాళ్ళల్లో హార్దిక్ పాండ్యా ఒకరు. వీరోచితమైన ఇన్నింగ్స్ ని ఆడడంలో బంతితో వికెట్లు తీయడంలో ఆయనకు ఆయనే సాటి… అలాంటి ప్లేయర్ 2020 వ సంవత్సరంలో నటాసా స్టన్కోవిక్ అనే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. వీళ్లకు ఒక బాబు కూడా ఉన్నాడు. గతంలో వచ్చిన కొన్ని గొడవల వల్ల ఇద్దరు డైవర్స్ తీసుకున్నారు. ఇక అప్పటి నుంచి హార్దిక్ పాండ్యా ఒక్కరిద్దరి గర్ల్ ఫ్రెండ్స్ ను మెయింటైన్ చేస్తున్నాడు అంటూ కొన్ని వార్తలు వచ్చాయి. ఇప్పుడు ఏకంగా తన కొత్త గర్ల్ ఫ్రెండ్ ని పరిచయం చేశాడు…
మోడల్ ‘మహికా శర్మ’ తో తను రిలేషన్ షిప్ లో ఉన్నాడు అంటు గత కొన్ని రోజుల నుంచి వస్తున్న వార్తల మీద ఎప్పుడూ స్పందించని పాండ్యా రీసెంట్ గా వాళ్ళిద్దరూ కలిసి ఉన్న ఫోటోని రిలీజ్ చేశాడు. ఇక తన బర్త్ డే సెలబ్రేషన్స్ ని కూడా మహికా శర్మ తో కలిసి జరుపుకున్నట్టుగా తెలియజేశాడు…
ఇదంతా చూస్తున్న నెటిజన్లు మాత్రం హార్దిక్ ఇంకా ఎంతమంది గర్ల్ ఫ్రెండ్స్ ను మారుస్తావ్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు…మొత్తానికైతే హార్దిక్ పాండ్యా కొత్త గర్ల్ ఫ్రెండ్ తో ఎంజాయ్ చేస్తున్నాడని ప్రస్తుతానికి క్రికెట్ మ్యాచ్ లు ఏమీ లేకపోవడంతో తను ఫుల్ పార్టీ మూడులో ఉన్నట్టుగా తెలుస్తోంది…ఇక వీళ్ళ రిలేషన్ గురించి తెలిసిన చాలా మంది చాలా రకాల కామెంట్స్ చేస్తున్నారు.
వీళ్ళిద్దరూ తొందర్లోనే పెళ్లి చేసుకుంటారు అని కొందరు అంటుంటే, మరి కొందరు మాత్రం ఇక పాండ్య ఎవ్వరిని పెళ్లి చేసుకోడు జస్ట్ రిలేషన్ లో ఉంటారు అంతే అంటూ కామెంట్లు చేస్తుండటం విశేషం…ఇండియన్ క్రికెట్ టీమ్ కి పాండ్య చాలా సంవత్సరాల నుంచి సేవలను అందిస్తున్నాడు. ఐపీఎల్లో ముంబై ఇండియన్స్ తరఫున కెప్టెన్ గా బాధ్యతలను కొనసాగిస్తున్నాడు. ముంబై టీమ్ ని సైతం టాప్ లెవెల్లో నిలుపడానికి ఆయన తీవ్రమైన ప్రయత్నం చేస్తున్నాడు…