https://oktelugu.com/

మాస్ మహారాజ్ రవితేజ’ బర్త్ డే స్పెషల్

మాస్ మహారాజ్ రవితేజ… ఆ పేరు సంపాదించటానికి ఆయన ఎన్నో ఏళ్ళు ఎన్నెన్నో కష్టాలు పడ్డారు. ఎటువంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఈ స్టార్‌డమ్‌ను సాధించడం చాలా కష్టమైన పని. తన నటన మరియు ఆటిట్యూడ్ తో రవితేజ భారీగా అభిమానులను సంపాదించారు. ఈ ప్రపంచానికి తెలిసిన ప్రతిభావంతులైన టాలీవుడ్ నటులలో రవి తేజ ఒకరని నిస్సందేహంగా చెప్పుకోవచ్చు. అలాంటి మాస్ హీరో పుట్టిన రోజు సందర్బంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ… ఓ స్పెషల్ ఆర్టికల్. Also Read: […]

Written By: , Updated On : January 26, 2021 / 12:40 PM IST
Follow us on

Raviteja
మాస్ మహారాజ్ రవితేజ… ఆ పేరు సంపాదించటానికి ఆయన ఎన్నో ఏళ్ళు ఎన్నెన్నో కష్టాలు పడ్డారు. ఎటువంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఈ స్టార్‌డమ్‌ను సాధించడం చాలా కష్టమైన పని. తన నటన మరియు ఆటిట్యూడ్ తో రవితేజ భారీగా అభిమానులను సంపాదించారు. ఈ ప్రపంచానికి తెలిసిన ప్రతిభావంతులైన టాలీవుడ్ నటులలో రవి తేజ ఒకరని నిస్సందేహంగా చెప్పుకోవచ్చు. అలాంటి మాస్ హీరో పుట్టిన రోజు సందర్బంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ… ఓ స్పెషల్ ఆర్టికల్.

Also Read: ‘క్రాక్’జోరులో ‘ఖిలాడి’ రవితేజ బర్త్ డే స్పెషల్

ఆంధ్రప్రదేశ్ లోని జగ్గంపేటలో రాజ్ గోపాల్ రాజు మరియు రాజ్య లక్ష్మి భూపతిరాజు దంపతులకు 26 జనవరి 1968న రవిశంకర్ రాజు భూపతిరాజు జన్మించారు. సినిమా మీద ఉన్న పిచ్చితో చిత్ర పరిశ్రమలోకి వచ్చి తన పేరుని రవితేజ గా మార్చుకున్నారు. చెన్నై వెళ్లిన మొదట్లో ఆయన వైవిఎస్ చౌదరి, గుణశేఖర్ లతో కలిసి ఒకే రూమ్ లో ఉన్నారు. ఆ సమయంలో కర్తవ్యం , చైతన్య, ఆజ్ కా గూండా రాజ్ లాంటి మూవీస్ లో చిన్న చిన్న రోల్స్ లో నటిస్తూ డైరెక్టర్ కృష్ణవంశీ దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ గా చేరారు. ఆ తర్వాత కూడా ఆయన మరికొన్ని చిత్రాలలో సైడ్ పాత్రలు చేస్తూ ఉన్నారు.

1999లో శ్రీను వైట్ల ‘నీ కోసం’ మూవీలో లీడ్ రోల్ నటించటంతో హీరోగా రవితేజ సినీ ప్రయాణం మొదలైంది. ఈ చిత్రానికి గాను రవి ఉత్తమ నటుడుగా నంది అవార్డు అందుకున్నాడు. కానీ ఆయన సినీ ప్రస్థానంలో 2001వ సంవత్సరం గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఆ ఏడాదిలోనే పూరీ జగన్నాథ్ ‘ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం’ మూవీలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఆ మరుసటి సంవత్సరంలో పెద్ద వంశి దర్శకత్వంలో ఔను వాళ్లిద్దరూ ఇష్టపడ్డారు, పూరీ జగన్నాథ్ ఇడియట్ మూవీలతో హిట్స్ కొట్టి హ్యాట్రిక్ విజయాలతో టాలీవుడ్ లో రవితేజ బ్రాండ్ అండ్ ట్రెండ్ ప్రారంభమయింది.

అప్పటివరకు తెలుగు ప్రజలు చూడనటువంటి హీరోయిజాన్నీ, నటనను ఇడియట్ లో కనబరిచి ట్రెండ్ సెట్టర్ గా నిలిచారు. “ఏ… కమిషనర్ కూతుళ్ళకి పెళ్లిళ్లు కావా,మొగుళ్ళు రారా ” అని ఇడియట్ మూవీలో రవి తేజ చెప్పిన డైలాగ్ ఇప్పటికి పాపులర్. ఆ తర్వాత రవితేజ మార్క్ యాక్టింగ్ టాలీవుడ్ లో కొనసాగిందంటే ఎంతగా ఇంపాక్ట్ ఉందొ అర్ధం చేసుకోవచ్చు. యువత ఆయన నటనకి వీరాభిమానులుగా మారిపోయారు. ఆయన స్ఫూర్తితోనే బ్యాక్ గ్రౌండ్ లేకపోయినా విషయం ఉంటే చిత్ర పరిశ్రమలో గుర్తింపు సాధించవచ్చు అని అనేక మంది నటులు పరిశ్రమలోకి అడుగుపెట్టారు.

Also Read: బాలీవుడ్ స్టార్ హీరోతో ‘రాశీ ఖన్నా’ దాగుడు మూతలు !

ఇక అక్కడ నుండి రవి కెరీర్ వెనక్కి తిరిగి చూడకుండా ఎక్ష్ప్రెస్స్ ట్రైన్ లా దూసుకుపాయింది. ఎన్నెన్నో అద్భతమైన సినిమాలతో ప్రేక్షకులని అలరించారు. మొదట్లో చిన్న పాత్రాలు చేసిన రవితేజ అంచలంచలుగా టాలీవుడ్ లో ఒక టాప్ స్టార్ గా ఎదిగి మాస్ మహా రాజ్ అని పిలుపంచుకోవటం గొప్ప విషయం. ఒక జెనెరేషన్ ని ప్రభావితం చేసిన రవితేజ సినీ జీవితాన్ని అంచనాలకు మించిన అఛీవ్మెంట్ గా పేర్కొనవచ్చు.

ఇటీవలి కాలంలో వరుస పరాజయాలతో డీలాపడిన రవితేజ ‘క్రాక్’ సినిమాతో తన సత్తా ఏంటో మరలా చూయించారు. ప్రస్తుతం ‘రాక్షసుడు’ ఫేమ్ రమేష్ వర్మ దర్శకత్వంలో రూపొందుతున్న “ఖిలాడి”… ప్లే స్మార్ట్’ అనే మూవీ చేస్తున్నారు. నేడు హీరో రవితేజ పుట్టినరోజు సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు తెలియజేస్తూ ‘ఖిలాడీ’ చిత్ర యూనిట్ ఫస్ట్ గ్లిమ్స్ ని విడుదల చేయగా అభిమానులని ఆకట్టుకుంటుంది. మాస్ మహారాజ్ రవితేజ మరెన్నో హిట్ చిత్రాలు తీసి ప్రేక్షకులని అలరించాలని కోరుకుంటూ… మరొకసారి ఆయనకు “ఓకే తెలుగు” టీం నుండి జన్మదిన శుభాకాంక్షలు.

మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్