Guntur Kaaram Vs Hanuman: సంక్రాంతి వచ్చిందే తుమ్మెద, సినిమాలే తెచ్చిందే తుమ్మెద అంటూ పాడుకుంటున్నారు స్టార్ల అభిమానులు. కానీ తుస్ మనేట్టుగానే ఉన్నాయి కొన్ని సినిమాలు. అయితే సినిమాలన్నీ కూడా భారీ అంచనాలతోనే థియేటర్లలో పోటీకి దిగాయి. కానీ సైంధవ్, గుంటూరు కారం సినిమాలు మాత్రం మిశ్రమ ఫలితాలను సొంతం చేసుకున్నాయి. సంక్రాంతికి వచ్చే సినిమాలకు మంచి పోటీ ఉంటుందనే విషయం తెలిసిందే. కచ్చితంగా బాక్సాఫీస్ ను బద్దలు చేస్తాయనే నమ్మకంతోనే సంక్రాంతి బరిలో దిగుతారు దర్శకనిర్మాతలు.
చిన్న సినిమాగా వచ్చిన కాంతార, డీజే టిల్లు సినిమాలు ఏ రేంజ్ లో హిట్ ను సొంతం చేసుకున్నాయో తెలిసిందే. అదే విధంగా చిన్న సినిమాగా సజ్జు హీరోగా వచ్చిన హనుమాన్ సినిమా కూడా అదే రేంజ్ లో హిట్ టాక్ తో దూసుకొని పోతుంది. ఇప్పటికే భారీ కలెక్షన్లతో బ్లాక్ బస్టర్ టాక్ తో ప్రేక్షకుల మదిలో నిలిచి పోయేలా ఉందంటూ టాక్ వస్తుంది. అయితే ఈ సినిమా గుంటూరు కారం సినిమా కంటే బాగుందంటూ టాక్ ను సంపాదించింది. అంతే కాదు గుంటూరు కారంపై హనుమాన్ పైచేయి సాధించింది అంటున్నారు కొందరు.
బుక్ మై షోలో గుంటూరు కారం సినిమాపై హనుమాన్ సినిమా ఎక్కువ బుకింగ్ లను సొంతం చేసుకుంది. దీంతో ఈ వార్త ఇప్పుడు చిత్ర పరిశ్రమలో హాట్ టాపిక్ గా నిలిచింది. గుంటూరు కారం సినిమాకు గంటకు 12600 టికెట్లు బుక్ అయితే.. అదే సమయంలో హనుమాన్ చిత్రానికి 16600 టికెట్లు బుకింగ్ అయ్యాయి. నిన్న జరిగిన బుకింగ్స్ లో ఈ లెక్కలు బయటకు వచ్చాయట. ఇక్కడే కాదు అమెరికాలో కూడా ఇదే రేంజ్ లో బుకింగ్స్ కంటిన్యూ అయ్యాయట. హనుమాన్ సినిమాను చూడడానికి ప్రేక్షకులు ఎక్కువ మొగ్గు చూపారట.
ఇదిలా ఉంటే స్టార్ స్టేటస్ తో పని లేదని.. కంటెంట్ ఉంటే సరిపోతుందని మరో సారి హనుమాన్ సినిమా ప్రూవ్ చేసింది. ఇక ఈ సినిమా బుకింగ్స్ కూడా ప్రస్తుతం అదుర్స్ అనేలా ఉన్నాయి. ఫస్ట్ వీకెండ్ వరకు ఈ సినిమా కలెక్షన్ల విషయంలో ఢోకా లేదంటున్నారు నెటిజన్లు. ఎందుకంటే ీ సినిమాను చిన్న పిల్లల నుంచి పెద్దవారి వరకు కూడా ఇష్టపడుతున్నారు. అంతే కాదు అందరూ చూసేవిధంగా ఉండడంతో ఈ సినిమా మరింత విజయాన్ని సొంతం చేసుకోబోతుందంటున్నారు నెటిజన్లు. ఇక ఈ సినిమాకు సీక్వెల్ కూడా ఉండబోతుందట.