Homeఎంటర్టైన్మెంట్Hanuman Collections: హనుమాన్ వసూళ్ల ఊచకోత... ఏకంగా రూ.250 కోట్ల క్లబ్ లో తేజ సజ్జా!

Hanuman Collections: హనుమాన్ వసూళ్ల ఊచకోత… ఏకంగా రూ.250 కోట్ల క్లబ్ లో తేజ సజ్జా!

Hanuman Collections: హనుమాన్ మూవీతో హీరో తేజా సజ్జా పాన్ ఇండియా హిట్ కొట్టాడు. చిన్న సినిమాగా విడుదలైన హనుమాన్ భారీ విజయం సాధించింది. సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదల చేశారు. హనుమాన్ చిత్రానికి పోటీగా విడుదలైన గుంటూరు కారం మిక్స్డ్ టాక్ తెచ్చుకుంది. మహేష్ మూవీకి పోటీగా వచ్చి సాహసం చేసిన తేజ సజ్జా మెమరబుల్ హిట్ కొట్టాడు. హనుమాన్ విడుదల విషయంలో చాలా డ్రామా నడిచింది. ఈ చిత్రాన్ని సంక్రాంతి రేసు నుంచి తప్పించాలని బడా నిర్మాతలు చాలా ట్రై చేశారు. పట్టుబట్టి హనుమాన్ ని విడుదల చేశారు.

ఇక ఫస్ట్ షో నుండి హనుమాన్ హిట్ టాక్ తెచ్చుకుంది. రోజు రోజుకు వసూళ్లు పెరుగుతూ పోయాయి. కాగా హనుమాన్ మరో అరుదైన మైలురాయిని చేరుకుంది. ఏకంగా రూ. 250 కోట్ల క్లబ్ లో చేరింది. హనుమాన్ వరల్డ్ వైడ్ వసూళ్లు రెండు వందల యాభై కోట్ల మార్క్ దాటేశాయి. తేజ సజ్జా కనీసం ట్రై టు హీరో కూడా కాదు. అలాంటి ఒక యంగ్ హీరో ఈ ఫీట్ సాధించడం ఊహించని పరిణామం.

నిజానికి ప్రశాంత్ వర్మ బ్రాండ్ మీద మూవీని సేల్ చేశారు. టీజర్, ట్రైలర్ హైప్ పెంచేశాయి. ఇక ప్రేక్షకుల నుండి కూడా పాజిటివ్ టాక్ రావడంతో వసూళ్ల వర్షం కురిసింది. హనుమాన్ మూవీ వరల్డ్ వైడ్ బిజినెస్ రూ. 25 కోట్లకు లోపే. ఆ లెక్కన హనుమాన్ ఏ స్థాయిలో వసూళ్లు లాభాలు పంచిందో అంచనా వేయవచ్చు. హనుమాన్ మూవీని తెలుగు రాష్ట్రాల్లో మైత్రీ మూవీ మేకర్స్ డిస్ట్రిబ్యూట్ చేశారు. ఇక యూఎస్ లో హనుమాన్ $ 3 మిలియన్ మార్క్ దాటేసింది.

కేవలం స్టార్ హీరోలకు మాత్రమే సాధ్యమైన వసూళ్లు తేజ సజ్జా రాబట్టాడు. సోషియో ఫాంటసీ సబ్జెక్టు కి డివోషనల్ టచ్ ఇచ్చి హనుమాన్ తెరకెక్కించారు. కాగా హనుమాన్ కి దర్శకుడు ప్రశాంత్ వర్మ సీక్వెల్ ప్రకటించారు. దీనికి జై హనుమాన్ అనే టైటిల్ ఫిక్స్ చేశారు. కాగా జై హనుమాన్ లో తేజ సజ్జా హీరో కాదన్న ప్రశాంత్ వర్మ… ఓ స్టార్ హీరోతో చేస్తున్నట్లు వెల్లడించాడు. జై హనుమాన్ 2025లో విడుదల కానుంది.

RELATED ARTICLES

Most Popular