https://oktelugu.com/

Guppedantha Manasu serial : రిషి చావును సెలెబ్రేట్ చేసుకున్న వసుధార… ఏకిపారేస్తున్న ఆడియన్స్!

రిషి - వసూ జంటను చూస్తూ అలవాటైన ప్రేక్షకులు వసుధార పక్కన ఇంకొకరిని చూసి జీర్ణించుకోలేరు. ఈ నేపథ్యంలో త్వరలో సీరియల్ కి ఎండ్ కార్డు పడుతుందని కథనాలు వస్తున్నాయి.

Written By:
  • NARESH
  • , Updated On : February 18, 2024 / 09:14 PM IST
    Follow us on

    Guppedantha Manasu serial : గుప్పెడంత మనసు సీరియల్ రిషిధార జంటకు సోషల్ మీడియాలో ఎంత క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఒకప్పుడు అత్యధిక టీఆర్పీతో ఈ సీరియల్ మొదటి స్థానంలో ఉండేది. ఇప్పుడు ఈ సీరియల్ ని చూసే వారి సంఖ్య క్రమంగా తగ్గుస్తూ వస్తుంది. ఇందుకు కారణం సీరియల్ కి ప్రాణమైన రిషి క్యారెక్టర్ ని చంపేయడం. గత కొంత కాలంగా రిషి సీరియల్ లో కనిపించడం లేదు. అతనికి దెబ్బలు తగిలి వేరే చోట ఉన్నట్లు డైరెక్టర్ చూపించారు.

    ఇప్పుడు ఏకంగా రిషి చనిపోయాడు అంటూ ట్విస్ట్ ఇచ్చాడు. రిషి వస్తాడు అని ఎంతో ఆశతో ఎదురు చూస్తున్న ఫ్యాన్స్ కి గట్టి షాక్ తగిలింది. దీంతో ఫ్యాన్స్ అంతా డైరెక్టర్ ని తిట్టిపోస్తున్నారు. రిషి – వసుధార జంటను ఎంతగానో అభిమానించే సీరియల్ ఫ్యాన్స్ .. రిషి లేని వసూని ఊహించుకో లేకపోతున్నారు. పైగా రిషి కి ప్రత్యేకమైన అభిమానులు ఉన్నారు. కేవలం అతని కోసం గుప్పెడంత మనసు చూసే వాళ్ళు ఉన్నారు. అతన్ని సడెన్ గా సీరియల్ నుంచి తొలగించడంతో హర్ట్ అవుతున్నారు.

    ఇక తాజాగా గుప్పెడంత మనసు సీరియల్ ఫేమ్ శైలేంద్ర తన ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేసిన ఫోటో చూసిన ఫ్యాన్స్ ఓ రేంజ్ లో ఫైర్ అవుతున్నారు. ఆ ఫోటోలో వసుధార నవ్వుతూ .. రిషి ఫోటో దగ్గర క్యాండిల్స్ వెలిగిస్తూ కనిపించింది. దీంతో ఫ్యాన్స్ ఏకిపారేస్తూ కామెంట్లు పెడుతున్నారు. మీకు అసలు మనసుందా ఒక మనిషిని ఇంతలా దిగజార్చుతారా? అతను షూటింగ్ కి రావడం లేదు అని కక్షగట్టి అతని చావుని సెలబ్రేట్ చేసుకుంటున్నారా? అని తిడుతున్నారు.

    గతంలో ఇలానే జగతి క్యారెక్టర్ ని డైరెక్టర్ అనూహ్యంగా తీసేశాడు. అప్పటి నుంచి సీరియల్ కి బ్యాడ్ టైం స్టార్ట్ అయింది. ఇప్పుడు రిషి కూడా సీరియల్ లో లేకపోవడంతో డైరెక్టర్ విమర్శలు ఎదుర్కొంటున్నాడు. రిషి స్థానంలో వేరొకరిని రీప్లేస్ చేసినా ఆడియన్స్ రిసీవ్ చేసుకోలేరు. మొదటి నుంచి రిషి – వసూ జంటను చూస్తూ అలవాటైన ప్రేక్షకులు వసుధార పక్కన ఇంకొకరిని చూసి జీర్ణించుకోలేరు. ఈ నేపథ్యంలో త్వరలో సీరియల్ కి ఎండ్ కార్డు పడుతుందని కథనాలు వస్తున్నాయి.