https://oktelugu.com/

Jyothi Roy: రెచ్చిపోయిన గుప్పెడంత మనసు జగతి ఆంటీ… అమ్మగా అసలు ఊహించలేం!

ఆఫ్ స్క్రీన్ లో మాత్రం గ్లామరస్ ఫోటోలు, వీడియోలతో ఇంస్టాగ్రామ్ ని షేక్ చేస్తుంది. జ్యోతి రాయ్ గుప్పెడంత మనసు సీరియల్ నుండి తప్పుకుంది. ఆమె పలు సిరీస్లు, సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉంది.

Written By:
  • S Reddy
  • , Updated On : February 7, 2024 / 12:18 PM IST
    Follow us on

    Jyothi Roy: సీరియల్ నటి జ్యోతి రాయ్ నయా అవతార్ బుల్లితెర ప్రేక్షకులను ఆశ్చర్యానికి గురి చేస్తుంది. గుప్పెడంత మనసు సీరియల్ లో ఆమె చేసిన పాత్రకు, సోషల్ మీడియా పోస్ట్స్ కి ఏ మాత్రం సంబంధం ఉండటం లేదు. తెలుగులో స్టార్ మా లో ప్రసారమయ్యే గుప్పెడంత మనసు సీరియల్ లో జ్యోతి రాయ్ హీరో తల్లిగా నటించి మెప్పించారు. హీరో రిషికి తల్లి అంటే ద్వేషం. కొడుకు ప్రేమ కోసం తపించే జగతిగా ఆమె ఎమోషన్ పండించారు. నిండైన చీర, నుదుటన కుంకుమ తో ఆమె చాలా ట్రెడిషనల్ రోల్ చేసింది.

    ఆఫ్ స్క్రీన్ లో మాత్రం గ్లామరస్ ఫోటోలు, వీడియోలతో ఇంస్టాగ్రామ్ ని షేక్ చేస్తుంది. జ్యోతి రాయ్ గుప్పెడంత మనసు సీరియల్ నుండి తప్పుకుంది. ఆమె పలు సిరీస్లు, సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉంది. అందుకే గుప్పెడంత మనసు సీరియల్ లో జగతి పాత్రను చంపేశారు. దీంతో తెలుగు ప్రేక్షకులు జ్యోతి రాయ్ ని మిస్ అవుతున్నారు. కాగా జ్యోతి రాయ్ రెండు వెబ్ సిరీస్లు చేస్తుంది. ఒకటి ‘నో మోర్ సీక్రెట్స్’ పేరుతో తెరకెక్కుతుంది.

    ప్రెట్టీ గర్ల్ టైటిల్ తో మరో సిరీస్లో నటిస్తుంది. ఈ రెండు ప్రాజెక్ట్స్ లో జ్యోతి రాయ్ రోల్ చాలా బోల్డ్ గా ఉంటుందట. ఇటీవల ప్రెట్టీ గర్ల్ నుండి ఫస్ట్ లుక్ షేర్ చేసింది. మరో మూడు షెడ్యూల్స్ లో షూటింగ్ పూర్తి అవుతుంది. టీజర్ విడుదల చేస్తామంటూ చెప్పుకొచ్చింది. భిన్న షేడ్స్ కలిగిన క్యారెక్టర్ డిజైన్ చేసిన దర్శకునికి కృతజ్ఞతలు చెప్పింది. ఈ రెండు సిరీస్లతో పాటు మరికొన్ని ప్రాజెక్ట్స్ ఆమె ఖాతాలో ఉన్నాయి.

    కాగా జ్యోతి రాయ్ తాజా షార్ట్ మిడ్డీలో సూపర్ సెక్సీ ఫోజులు షేర్ చేసింది. అమ్మడు హాట్ నెస్ కి నెటిజెన్స్ పరేషాన్ అవుతున్నారు. కామెంట్స్ తో తమ అభిప్రాయం తెలియజేస్తున్నారు. జ్యోతి రాయ్ తన వయసు రివీల్ చేసిన సంగతి తెలిసిందే. అందరూ తన ఏజ్ 38 ఏళ్ళు అనుకుంటున్నారట. అయితే తనకు కేవలం 30 ఏళ్ళని ప్రూఫ్ తో సహా చూపించింది. ఇంస్టాగ్రామ్ లో జ్యోతి రాయ్ పాపులారిటీ అంతకంతకు పెరిగిపోతుంది.