Guntur Kaaram: టాలీవుడ్ కి చాలా కాలంగా ఇద్దరు మ్యూజిక్ డైరెక్టర్స్ దిక్కయ్యారు. ఒకరు దేవిశ్రీ ప్రసాద్. మరొకరు థమన్. మణిశర్మ ఫార్మ్ కోల్పోయాక హవా వీళ్ళిద్దరిదే. కీరవాణి ఉన్నా ఎందుకో కొందరే మ్యూజిక్ డైరెక్టర్ గా ఎంచుకుంటారు. ఒక దశలో క్రిందకు పడిపోయిన థమన్ అల వైకుంఠపురంలో మూవీతో రేసులోకి దూసుకొచ్చాడు. ఇండస్ట్రీ హిట్ కొట్టిన అల వైకుంఠపురంలో చిత్రానికి థమన్ సాంగ్స్ ప్రాణం పోశాయి. ప్రతి పాట ఒక ఆణిముత్యంలా ఉంటుంది.
అక్కడి నుండి మరలా మాస్ హీరోలందరూ థమన్ వెనకాలే పడుతున్నారు. అయితే మనోడి మీద కాపీ ఆరోపణలు లెక్కకు మించి. ఆయన నుండి కొత్త మూవీ వస్తుందంటే ఏదో ఓ చోట దొరికిపోతాడు. క్రాక్ మూవీలో ‘భల్లేగా దొరికావే బంగారం’ పాటకు యూట్యూబ్ నుండి ట్యూన్ లేపేశాడు. పవన్ కళ్యాణ్-సుజీత్ కాంబోలో వస్తున్న ఓజీ టీజర్ విడుదల కాగా… ఐదు నిమిషాల్లో బీజీఎమ్ కాపీ అని తెలిసిపోయింది. అది కూడా యూట్యూబ్ నుండి కాపీ చేశాడు.
వీరసింహారెడ్డి మూవీలో జై బాలయ్య సాంగ్ ‘ఒసేయ్ రాములమ్మ’ సినిమాలోని సాంగ్ వలె ఉందని అడిగితే, అవును నిజమే. చాలా సాంగ్స్ కి ఒసేయ్ రాములమ్మ సాంగ్ స్ఫూర్తిగా నిలిచింది అన్నాడు. ఇక తన మీద వచ్చే కాపీ ఆరోపణలు, మీమ్స్, ట్రోల్స్ చాలా సిల్లీగా తీసుకుంటాడు థమన్. తాజాగా ఆయన మీద మరో కాపీ ఆరోపణ వచ్చింది. గుంటూరు కారం చిత్రం ‘ఓహ్ మై బేబీ’ ప్రోమో విడుదల చేశారు.
సదరు ప్రోమో చూసిన మూవీ లవర్స్… ఇది బుట్టబొమ్మ సాంగ్ లా ఉందని అంటున్నారు. థమన్ తన బీట్స్ తానె దొంగిలించాడని. కొంచెం అటూ ఇటూ మార్చి ట్యూన్ చేశాడని ఎద్దేవా చేస్తున్నారు. ఈ ఆరోపణలను కొందరు ఖండిస్తున్నారు. సాంగ్ పూర్తిగా వినకుండా ఒక అంచనాకు రావడం కరెక్ట్ కాదు. ఫుల్ సాంగ్ విని అప్పుడు చెప్పండని అంటున్నారు. నిజంగా… ఆ సాంగ్ ట్యూన్ ‘బుట్ట బొమ్మ” సాంగ్ ని గుర్తు చేస్తుంది. మహేష్ బాబు-శ్రీలీల మీద తెరకెక్కిన ఈ సాంగ్ రొమాంటిక్ గా ఉంటుందని అర్థం అవుతుంది. జనవరి 12న విడుదలవుతున్న గుంటూరు కారం చిత్రానికి త్రివిక్రమ్ దర్శకుడు.