https://oktelugu.com/

Mahesh Babu Guntur Kaaram Teaser : ‘గుంటూరు కారం’ టీజర్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ హీరో రామ్ సినిమా నుండి కొట్టేసిందా..? థమన్ ఇలా దొరికిపోయాడు ఏంది!

ఇక ఈ సినిమా టైటిల్ క్రింద 'హైలీ ఇన్ ఫ్లెమబుల్' అని ఒక క్యాప్షన్ ఉంటుంది. క్యాప్షన్ అదిరిపోయింది కానీ అది యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరో గా నటించిన 'రాఖీ' సినిమా క్యాప్షన్ నుండి కాపీ కొట్టారు. ఇక థమన్ అందించిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ వింటే మనకి రకరకాల పాత మ్యూజిక్స్ మన మైండ్ లో స్ట్రైక్ అవుతుంది.

Written By: , Updated On : May 31, 2023 / 07:46 PM IST
Follow us on

Mahesh Babu Guntur Kaaram Teaser : సూపర్ స్టార్ మహేష్ బాబు మరియు త్రివిక్రమ్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న మూడవ చిత్రానికి సంబంధించిన గ్లిమ్స్ మరియు టైటిల్ ని కాసేపటి క్రితమే విడుదల చేసారు. ఈ సినిమాకి ‘గుంటూరు కారం’ అనే ఊర మాస్ టైటిల్ ని ఖరారు అయ్యింది. ఈ టీజర్ లో మహేష్ బాబు మునుపెన్నడూ లేని రేంజ్ మాస్ గా కనిపించాడు. నోట్లో స్టైల్ గా బీడీ పెట్టుకొని నడవడం,దాంతో పాటు ఆయన చెప్పిన మాస్ డైలాగ్ కి కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది.

‘ఏంది అలా చూస్తున్నావ్..?, బీడీ 3D లో కనిపిస్తుందా’ అంటూ మహేష్ చెప్పిన డైలాగ్ వైరల్ అయ్యింది. దాంతో పాటు ఆయన తొడ గొడితే జీప్ గాల్లోకి లెయ్యడం , ఇలాంటి షాట్స్ ఇంతకు ముందు మహేష్ బాబు ఎప్పుడూ కూడా చెయ్యలేదు, ఆయన మాస్ వేరే విధంగా ఉంటుంది. కానీ గుంటూరు కారం టీజర్ లో మహేష్ బాబు నందమూరి హీరోల రేంజ్ మాస్ లో చెలరేగిపోయాడని చెప్పాలి.

ఇక ఈ సినిమా టైటిల్ క్రింద ‘హైలీ ఇన్ ఫ్లెమబుల్’ అని ఒక క్యాప్షన్ ఉంటుంది. క్యాప్షన్ అదిరిపోయింది కానీ అది యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరో గా నటించిన ‘రాఖీ’ సినిమా క్యాప్షన్ నుండి కాపీ కొట్టారు. ఇక థమన్ అందించిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ వింటే మనకి రకరకాల పాత మ్యూజిక్స్ మన మైండ్ లో స్ట్రైక్ అవుతుంది.

ఈ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ వినగానే, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ‘సిత్తరాల సిరపడు’ సాంగ్ గుర్తుకు వస్తుంది. అలాగే రీసెంట్ గా విడుదలైన రామ్ – బోయపాటి మూవీ టీజర్ గ్లిమ్స్ కూడా గుర్తుకు వస్తుంది. ఈ రెండు సినిమాలకు కూడా థమన్ సంగీతం అందించాడు. అంటే ఆయన కంపోజ్ చేసిన సినిమాల నుండే కాపీ కొట్టాడు అన్నమాట. ఈ విషయం లో థమన్ కి సోషల్ మీడియా లో ఒక రేంజ్ ట్రోల్ల్స్ నడుస్తున్నాయి.

Guntur Kaaram - Highly Inflammable Mass Strike | Mahesh Babu | Thaman S | Trivikram