Bigg Boss 9 Telugu : ‘బిగ్ బాస్ 9′(Bigg Boss 9 Telugu) గ్రాండ్ లాంచ్ నిన్న అట్టహాసం గా జరిగింది. గత నాలుగు సీజన్స్ తో పోలిస్తే ఈ సీజన్ గ్రాండ్ లాంచ్ ఎపిసోడ్ అద్భుతంగా ఉందంటూ నెటిజెన్స్ తో పాటు సోషల్ మీడియా విశ్లేషకులు కూడా కామెంట్స్ చేశారు. అయితే మొదటి రోజు పూర్తి అయ్యింది. నేడు మొదటి రోజు ఎపిసోడ్ ని రాత్రి 9 గంటల 30 నిమిషాలకు టెలికాస్ట్ చేయబోతున్నారు. టీవీ టెలికాస్ట్ సంగతి కాసేపు పక్కన పెడితే, జియో హాట్ స్టార్ లో లైవ్ స్ట్రీమింగ్ కూడా మొదలైంది. ఈ లైవ్ స్ట్రీమింగ్ లో కొన్ని ఊహించని సంఘటనలు జరిగాయి. ముఖ్యంగా మాస్క్ మ్యాన్ హౌస్ మేట్స్ కి పూటకి ఒక షేడ్ ని చూపిస్తూ మెంటలెక్కించేసాడు. ముఖ్యంగా హౌస్ లోకి అడుగుపెట్టినప్పటి నుండి ఆయన ఇమ్మానుయేల్ తో ఎక్కువగా మాట్లాడాడు.
అబ్బో వీళ్లిద్దరు మంచి స్నేహితులు అయిపోయేలాగా ఉన్నారే, రాబోయే రోజుల్లో ఇంకా వీళ్ళ బాండింగ్ బలపడుతుందేమో అని అంతా అనుకున్నారు. అయితే ఇమ్మానుయేల్ కి మొదటి నుండి కాస్త నోటి దూల అనే విషయం మన అందరికీ తెలిసిందే. అనేక ఎంటర్టైన్మెంట్ షోస్ లో ఇది మనం చూశాము. నోటి దూల ఉంది కానీ, ఎంటర్టైన్మెంట్ ని పంచడం లో మాత్రం ఇమ్మానుయేల్ కి తిరుగే లేదు అనడం లో ఎలాంటి అతిశయోక్తి లేదు. అయితే నేడు కొన్ని స్కిట్స్ హౌస్ లో జరిగాయి. మధ్యాహ్నం జరిగిన ఒక స్కిట్ లో మాస్క్ మ్యాన్ ని ఇమ్మానుయేల్ గుండు అంకూల్ అని పిలిచాడు. స్కిట్ లో భాగంగా పిలిచాడు కాబట్టి, మాస్క్ మ్యాన్ కూడా పెద్దగా పట్టించుకోలేదు. కానీ కాసేపటి క్రితమే ఇమ్మానుయేల్ మళ్లీ ‘గుండు అంకూల్’ అని పిలవడం, దానికి మాస్క్ మ్యాన్ చాలా స్ట్రిక్ట్ గా వార్నింగ్ ఇవ్వడం, ఆ తర్వాత ఇమ్మానుయేల్ క్షమాపణలు చెప్పడం వంటివి జరిగింది.
అయితే ఇమ్మానుయేల్ క్షమాపణలు చెప్పిన తర్వాత కూడా మాస్క్ మ్యాన్ వదల్లేదు, చాలా వరకు సాగదీసాడు. ఇమ్మానుయేల్ పాపం ఒకసారి కాదు, చాలా సార్లు క్షమాపణలు చెప్పాడు. ఏంటో ఈ మాస్క్ మ్యాన్, పూటకి ఒక లాగా ప్రవర్తిస్తున్నాడు అని అనిపించింది. కాసేపు కంటెస్టెంట్స్ తో చాలా స్నేహం గా ఉంటాడు, మరి కాసేపు పొగరుగా ఉంటాడు. ఈరోజు మధ్యాహ్నం బిగ్ బాస్ కంటెస్టెంట్స్ నుండి ఫుడ్ మొత్తం లాగేసుకున్నాడు. అప్పుడు మాస్క్ మ్యాన్ (ఓనర్) ఇంట్లో ఉన్న పండ్లను, బిస్కట్స్ ని తీసుకొచ్చి ఇచ్చే ప్రయత్నం చేస్తాడు. బిగ్ బాస్ శిక్ష వేస్తాడు మళ్లీ, వద్దులే అని కంటెస్టెంట్స్ తీసుకోరు. అప్పుడు మాస్క్ లోపలకు వెళ్లి కన్నీళ్లు పెట్టుకోవడాన్ని చూసి అబ్బో ఈయనతో ఈ యాంగిల్ కూడా ఉందా అని అనుకున్నారు. కాసేపటి తర్వాత తనలో తానే మాట్లాడుకుంటూ మాలోకం లాగా ఉంటున్నాడు. కంటెస్టెంట్స్ కి ఒక విధంగా పిచ్చి ఎక్కించేస్తున్నాడు అనుకోండి.