Guna Shekhar: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(Icon star Allu Arjun) కెరీర్ లో డిజాస్టర్ సినిమాలు చాలా తక్కువ. ఫ్లాప్ అవ్వడం వంటివి కూడా చాలా అరుదుగా చూసి ఉంటాము. కెరీర్ మొత్తం మీద ఘోరమైన డిజాస్టర్ ఫ్లాప్ సినిమాల లిస్ట్ తీస్తే వరుడు, బద్రినాథ్, నా పేరు సూర్య తప్ప మరొకటి కనిపించదు. ఈ మూడు సినిమాల్లో ‘వరుడు’ చిత్రం పై అప్పట్లో అంచనాలు మామూలు రేంజ్ లో ఉండేవి కాదు. గుణ శేఖర్ దర్శకత్వం లో తెరకెక్కించిన ఈ చిత్రం ‘5 రోజుల పెళ్లి’ కాన్సెప్ట్ తో తెరకెక్కింది. ఈ సినిమా అనుభవం గురించి డైరెక్టర్ గుణ శేఖర్ రీసెంట్ గా జరిగిన ఒక ఇంటర్వ్యూ లో చెప్పిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యింది. ఆయన మాట్లాడుతూ ‘ ఈ సినిమాని మన హిందూ సాంప్రదాయ పద్దతి లో ‘5 రోజుల పెళ్లి’ ని చూపించి ఒక చక్కటి ఫ్యామిలీ స్టోరీ గా తియ్యాలని అనుకున్నాను’.
‘ఒక అద్భుతమైన నవల ఆధారంగా ఈ సినిమాని తెరకెక్కించాలని అనుకున్నాను. సరిగ్గా అలాగే సినిమా తీసి ఉండుంటే ఫలితం వేరేలా ఉండేది. కానీ కొంతమంది ఇలా తీస్తే ఆడదు అని చెప్పి, మధ్యలో నా చేత కథ మార్పించారు. దీంతో ఫక్తు ఫ్యామిలీ స్టోరీ గా తియ్యాలని అనుకున్న ఈ సినిమా కాస్త యాక్షన్ చిత్రం గా మారిపోయింది’ అంటూ చెప్పుకొచ్చాడు. ఇంకా ఆయన మాట్లాడుతూ ‘ఈ సినిమా విడుదల అయ్యే వరకు మేము హీరోయిన్ ని చూపించుండ దాచిపెట్టి జనాల్లో క్యూరియాసిటీ పెంచే ప్రయత్నం చేసాము. అది చాలా బాగా వర్కౌట్ అయ్యింది. కేవలం అలా చేయడం వల్ల ఈ చిత్రం పై అంచనాలు ఎవ్వరూ ఊహించనంత పెరిగిపోయాయి. ఇండస్ట్రీ లో నాకు తెలిసిన ప్రతీ ఒక్కరు ఫోన్ చేసి ఎవరు ఈ చిత్రం లో హీరోయిన్ అని అడుగుతూ ఉండేవారు’.
‘కేవలం సినీ ఇండస్ట్రీ కి చెందిన వాళ్ళు మాత్రమే కాదు, రాజకీయ నాయకులూ, మినిస్టర్లు కూడా ఫోన్ చేసి అడిగేవారు, అంతటి క్యూరియాసిటీ ని పెంచింది. అదే ఈ చిత్రానికి మైనస్ అయ్యిందని అనుకుంటున్నాను. హీరోయిన్ గురించి అంత సస్పెన్స్ మైంటైన్ చేయడంతో, ఆడియన్స్ అంచనాలకు తగ్గ రేంజ్ లో హీరోయిన్ లేకపోవడం వల్ల కాస్త నిరాశ చెంది ఉంటారని అనుకుంటున్నాను’ అంటూ చెప్పుకొచ్చాడు గుణ శేఖర్. రీసెంట్ గా ఆయన ‘యూఫోరియా’ అనే చిత్రాన్ని తెరకెక్కించాడు. ఈ సినిమా విడుదల సందర్భంగా ప్రొమోషన్స్ లో భాగంగా ఆయన పలు ఇంటర్వ్యూలు ఇచ్చాడు. ఆ ఇంటర్వ్యూ లో తన పాత సినిమా జ్ఞాపకాలను చెప్పుకొచ్చాడు. అలా ఈ విషయం బయటపడింది.
