“లస్ట్ స్టోరీస్”కి గ్రీన్ సిగ్నల్.. త్వరలోనే !

నెట్ ఫ్లిక్స్ నిర్మించిన “లస్ట్ స్టోరీస్” హిందీలో ఓ రేంజ్ లో హిట్ అయింది. ఒక విధంగా వెబ్ సిరీస్ లకే మేటి వెబ్ సిరీస్ గా లస్ట్ స్టోరీస్ నిలిచిపోయింది. ఈ సిరీస్ లో కేవలం ఒక బోల్డ్ సీన్లో నటించి… కియారా అద్వానీ బాగా పాపులర్ అయిపోయింది. ఇలాంటి సిరీస్ ను తెలుగులో దాన్ని రీమేక్ చేస్తామని నెట్ ఫ్లిక్స్ సంస్థ రెండేళ్ల క్రితం అనౌన్స్ చేసి.. సిరీస్ ను కూడా నిర్మించింది. అయితే […]

Written By: admin, Updated On : January 20, 2021 7:21 pm
Follow us on


నెట్ ఫ్లిక్స్ నిర్మించిన “లస్ట్ స్టోరీస్” హిందీలో ఓ రేంజ్ లో హిట్ అయింది. ఒక విధంగా వెబ్ సిరీస్ లకే మేటి వెబ్ సిరీస్ గా లస్ట్ స్టోరీస్ నిలిచిపోయింది. ఈ సిరీస్ లో కేవలం ఒక బోల్డ్ సీన్లో నటించి… కియారా అద్వానీ బాగా పాపులర్ అయిపోయింది. ఇలాంటి సిరీస్ ను తెలుగులో దాన్ని రీమేక్ చేస్తామని నెట్ ఫ్లిక్స్ సంస్థ రెండేళ్ల క్రితం అనౌన్స్ చేసి.. సిరీస్ ను కూడా నిర్మించింది. అయితే మధ్యలో కొన్ని కారణాల వల్ల ఈ సిరీస్ కు బ్రేక్ పడింది. అయితే తాజాగా ఆ వెబ్ సిరీస్ కి మోక్షం కలిగింది. తెలుగులో త్వరలోనే స్ట్రీమ్ చేస్తున్నామని నెట్ ఫ్లిక్స్ అఫీషయల్ గా ప్రకటించి.. బోల్డ్ అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పింది.

Also Read: మెగాస్టార్ చిరంజీవి 153వ చిత్రం ప్రారంభం

ఇక హిందీలో లాగే, తెలుగులో కూడా నాలుగు కథలుంటాయి. నాలుగు కథలు కూడా సెక్స్ చుట్టే తిరగడం, పైగా ఒక్కో కథకి ఒక్కో దర్శకుడు, వేర్వేరు నటులు ఉండటంతో మొత్తానికి ఈ సిరీస్ పై మంచి అంచనాలు ఉన్నాయి. ఇంతకీ తెలుగులో ఈ నాలుగు కథలను డైరెక్ట్ చేస్తోన్న డైరెక్టర్స్ లిస్ట్ చూస్తే.. తరుణ్ భాస్కర్, నాగ్ అశ్విన్, నందిని రెడ్డి, సంకల్ప్ రెడ్డి ఇలా ఒక్కో కథని ఒకరు డైరెక్ట్ చేశారు. ఇక్కడ మరో విశేషం ఏమిటంటే.. కియారా అద్వానీ పోషించినటువంటి బోల్డ్ రోల్ ని తెలుగు ఈషా రెబ్బ పోషించింది.

Also Read: బాలయ్య అనగానే నో అంటున్న హీరోలు !

కాగా ఈషా నటించిన ఈ బోల్డ్ కథను డైరెక్షన్ కే లైఫ్ ను డెడికేట్ చేసిన లేడి డైరెక్టర్ నందినిరెడ్డి డైరెక్ట్ చేసింది. ఇప్పటికే ఆ ఎపిసోడ్ షూటింగ్ కూడా పూర్తవ్వడంతో పాటు తాజాగా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కూడా పూర్తయింది. ఫస్ట్ కాపీ కూడా చూసుకుని అవుట్ ఫుట్ పట్ల పూర్తి సంతృప్తిగా ఉన్నారట మేకర్స్. కాకపోతే ఎపిసోడ్ లో కాస్త ఘాటు సీన్స్ ఉన్నాయని… కథకు అనుగుణంగానే బోల్డ్ సీన్స్ సాగిన, వాటిని నందిని రెడ్డి ఏ మాత్రం మొహమాట పడకుండా అంతే బోల్డ్ గా తీసిందట. ఒక లేడీ డైరెక్టర్ అలాంటి బోల్డ్ కంటెంట్ తీసుకుని అంతే బోల్డ్ గా తియ్యడం అంటే.. ఎంతో డేర్ ఉండాలి. ఇక త్వరలోనే ట్రైలర్ విడుదల కానుంది.

మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్