spot_img
Homeఎంటర్టైన్మెంట్Sai Abhyankar: తొలిసినిమా విడుదల అవ్వకముందే 73 సినిమాలు ఒప్పుకున్న యంగ్ మ్యూజిక్ డైరెక్టర్..

Sai Abhyankar: తొలిసినిమా విడుదల అవ్వకముందే 73 సినిమాలు ఒప్పుకున్న యంగ్ మ్యూజిక్ డైరెక్టర్..

Sai Abhyankar: ప్రస్తుతం సౌత్ ఇండియా లో మ్యూజిక్ డైరెక్టర్స్ లో అనిరుద్ కి ఉన్నంత డిమాండ్ , ఏ మ్యూజిక్ డైరెక్టర్ కి కూడా లేదు అనడం లో ఎలాంటి సందేహం లేదు. ఆయన తర్వాతి స్థానంలో తమన్ పేరు చెప్పొచ్చు. వీళ్లిద్దరి డేట్స్ ఖాళీ లేక ఇతర మ్యూజిక్ డైరెక్టర్స్ కి అవకాశాలు రావాల్సిందే తప్ప, మరొకరి పై ప్రత్యేకంగా కన్నెత్తి చూసే పరిస్థితి లేదు. అయితే ఇదంతా నిన్న మొన్నటి మాట. ఇప్పుడు వీళ్లిద్దరికీ పోటీ గా మరో మ్యూజిక్ డైరెక్టర్ వచ్చాడు. అతను మరెవరో కాదు , సాయి అభయంకర్ . ఈయన ప్రదీప్ రంగనాథన్ ‘డ్యూడ్’ చిత్రం తో సౌత్ ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ లోకి అధికారికంగా ఎంట్రీ ఇచ్చాడు. అంతకు ముందు ఈయన ప్రైవేట్ ఆల్బమ్స్ ద్వారా బాగా ఫేమస్ అయ్యాడు. రీసెంట్ గా తమిళ డైరెక్టర్ బాలాజీ సాయి అభయంకర్ గురించి మాట్లాడిన మాటలు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యాయి.

రీసెంట్ గా సాయి అభయంకర్ తమిళ హీరో సూర్య నటించిన కరప్పు అనే చిత్రానికి సంగీతం అందించాడు. ఈ సినిమా వచ్చే నెల 14 న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. సినిమా విడుదల తేదీ దగ్గర పడుతుండడంతో ప్రొమోషన్స్ లో భాగంగా ఆడియో లాంచ్ ఈవెంట్ ని గ్రాండ్ గా చెన్నై లో జరిపించారు. ఈ ఆడియో లాంచ్ ఈవెంట్ లో బాలాజీ సాయి అభయంకర్ గురించి మాట్లాడుతూ ‘మా చిత్రానికి సంగీతం అందించిన సాయి అభయంకర్ కి యూత్ లో క్రేజ్ మామూలు రేంజ్ లో లేదు. చాలా వేగంగా ఇండస్ట్రీ లో ఎదుగుతున్నాడు. నిజానికి ఆయన మొట్టమొదట సంతకం చేసిన సినిమా మాదే. ప్రాక్టికల్ గా ఇదే ఆయనకు తొలిసినిమా. కానీ మొదటి సినిమా విడుదల అయ్యేలోపే ఆయన 73 సినిమాలు ఒప్పుకునే స్థాయికి ఎదిగాడు. అందుకు నాకు చాలా ఆనందంగా ఉంది’ అంటూ చెప్పుకొచ్చాడు.

ఇంకా ఆయన మాట్లాడుతూ ‘ఒకరోజు మ్యూజిక్ సిట్టింగ్స్ కోసం నేను సాయి అభయంకర్ ఇంటికి వెళ్లాల్సి వచ్చింది. అప్పుడు ఆయన ఇంటి వద్ద ఒక హెలికాఫ్టర్ ఉంది. దీనిని బట్టీ ఆయన రేంజ్ ఇప్పుడు ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు. అంతటి బిజీ మ్యూజిక్ డైరెక్టర్ ని మా సినిమాకు సంగీత దర్శకుడిగా ఎంపిక చేసుకోవడమే, మా మొదటి విజయం గా భావిస్తున్నాం’ అంటూ చెప్పుకొచ్చాడు. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ , అట్లీ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ‘రాకా’ చిత్రానికి కూడా సాయి అభయంకర్ సంగీతం అందిస్తున్న సంగతి అందరికీ తెలిసిందే.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version