RajTarun : ఒక విల్లా కోసం 3 ఫ్లాప్ సినిమాలు చేసిన యంగ్ హీరో.. షాకింగ్ నిజాలు

RajTarun : యంగ్ హీరో రాజ్ తరుణ్ కి మంచి ఆరంభం లభించింది. లవర్ బాయ్ ఇమేజ్ సొంతం చేసుకున్న రాజ్ తరుణ్ స్టార్ అయ్యే ఛాన్స్ తృటిలో చేజార్చుకున్నాడు. సినిమాల ఎంపికలో తడబడి వరుస పరాజయాలు ఎదుర్కున్నాడు. కాగా రాజ్ తరుణ్ ఒక విల్లాకు కక్కుర్తి పడి సూపర్ హిట్ మూవీ కోల్పోయాడనే ప్రచారం ఎప్పటి నుండో ఉంది. శతమానం భవతి చిత్రానికి ఫస్ట్ ఛాయిస్ రాజ్ తరుణ్ అట. దర్శకుడు సతీష్ వేగేశ్న ఈ […]

Written By: NARESH, Updated On : December 11, 2022 6:28 pm
Follow us on

RajTarun : యంగ్ హీరో రాజ్ తరుణ్ కి మంచి ఆరంభం లభించింది. లవర్ బాయ్ ఇమేజ్ సొంతం చేసుకున్న రాజ్ తరుణ్ స్టార్ అయ్యే ఛాన్స్ తృటిలో చేజార్చుకున్నాడు. సినిమాల ఎంపికలో తడబడి వరుస పరాజయాలు ఎదుర్కున్నాడు. కాగా రాజ్ తరుణ్ ఒక విల్లాకు కక్కుర్తి పడి సూపర్ హిట్ మూవీ కోల్పోయాడనే ప్రచారం ఎప్పటి నుండో ఉంది. శతమానం భవతి చిత్రానికి ఫస్ట్ ఛాయిస్ రాజ్ తరుణ్ అట. దర్శకుడు సతీష్ వేగేశ్న ఈ చిత్రం కోసం రాజ్ తరుణ్ ని సంపాదించగా నిర్మాత అనిల్ సుంకరకు వరుసగా మూడు సినిమాలకు సైన్ చేసిన రాజ్ తరుణ్ కుదరదని చెప్పారట.

రాజ్ తరుణ్ అనిల్ సుంకర నిర్మాణ సంస్థలో వరుసగా మూడు చిత్రాలకు సైన్ చేయడానికి కారణం… విల్లా కోసమే అనే ప్రచారం ఉంది. దీనిపై రాజ్ తరుణ్ క్లారిటీ ఇచ్చారు. విల్లా కోసం మూడు సినిమాలు చేయలేదు. మూడు సినిమాలు చేసే క్రమంలో విల్లా సొంతమైందని ఆయన చెప్పుకొచ్చారు. విల్లాకు ఆశపడి మూడు సినిమాలు చేశాను అనడంలో నిజం లేదన్నారు.

డబ్బుగా ఇస్తే నేను ఖర్చుబెడుతున్నానని నా మేనేజర్ రాజారవీంద్ర విల్లా తీసుకో అన్నారు. అనిల్ సుంకర మొదటి సినిమా చేస్తున్నప్పుడే మరో రెండు సినిమాలు నా వద్దకు వచ్చాయి. ఆ విధంగా అనిల్ సుంకరగారికి మూడు సినిమాలు చేసి విల్లా తీసుకున్నాను. ఇప్పుడు నేను ఆ విల్లాలోనే ఉంటున్నాను. మూడు సినిమాలు చేసే క్రమంలో నాకు విల్లా సొంతమైంది. విల్లాకు ఆశపడి కిట్టు ఉన్నాడు జాగ్రత్త, అందగాడు, రాజుగాడు చిత్రాలు చేశాను అనడం కేవలం పుకారని కొట్టిపారేశారు.

నటుడు రాజారవీంద్ర చాలా కాలంగా రాజ్ తరుణ్ మేనేజర్ గా ఉన్నారు. కథల ఎంపిక విషయంలో కూడా రాజా రవీంద్ర హస్తం ఉంటుందనే పుకారును కూడా రాజ్ తరుణ్ ఖండించారు. ఆయన నాతోపాటు కథలు విన్నప్పటికీ… నాకు నచ్చితే ఎలాంటి అభ్యంతరం చెప్పరు. ఆ విషయంలో పూర్తి స్వేచ్ఛ నాకు ఉంటుంది. బెటర్మెంట్ కోసం కొన్ని సలహాలు ఇస్తారని రాజ్ తరుణ్ తెలిపారు. కాగా రాజ్ తరుణ్ నటించిన అహనా పెళ్ళంట సిరీస్ ఇటీవల జీ 5 లో విడుదలై పాజిటివ్ టాక్ తెచ్చుకుంది.