RRR And Bahubali: బాహుబలి 1 , 2 సినిమాలు ఒక విజువల్ వండర్. బలమైన కథ , కథనాలు వాటి సొంతం. అందుకే ఆ సినిమాలను ప్రేక్షకులు అంతగా ఆదరించారు. అందలం ఎక్కించారు. బాహుబలి 2 సినిమా అయితే విడుదలై రెండు వారాలైనా కూడా థియేటర్లన్నీ హౌస్ ఫుల్ తో నడిచాయి. రాజమౌళి స్టామినాకు బాహుబలి2 సినిమా మచ్చు తునకగా నిలిచింది. అందులోని బలమైన కథకు ప్రేక్షకులు ఫిదా అయ్యారు.
రాజమౌళి తీసిన బ్లాక్ బస్టర్ ‘బాహుబలి2’ రెండు వారాలకు పైగా అదే హైప్ ను.. థియేటర్లలో అధిక ఆక్యూపెన్సీని కొనసాగించింది. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఉత్తర భారతదేశంలోని రాష్ట్రాలతోపాటు దక్షిణ భారతదేశం, తెలుగు రాష్ట్రాలతోపాటు అమెరికాలోని అన్ని ప్రాంతాల్లో ఒకేవిధంగా ఆడింది. భారీ రికార్డులను నెలకొల్పింది.
బాహుబలి తర్వాత భారీ అంచనాల నడుమ రాజమౌళి తీసిన చిత్రం ‘ఆర్ఆర్ఆర్’. ఈ చిత్రానికి భారీ ప్రచారం లభించింది. భారీ తారాగణంతో సినిమాకు ఫుల్ హైప్ వచ్చింది. అయితే విడుదలైన మొదటి వారంలోనే హైప్ పోయింది. మొదటి వారాంతానికి ఆర్ఆర్ఆర్ సినిమా కొన్ని చోట్ల మంచి ఆక్యూపెన్సీతో.. మరికొన్ని చోట్ల తక్కువ ఆక్యూపెన్సీతో థియేటర్లలో నడుస్తోంది. ఆర్ఆర్ఆర్ ను బాహుబలిని చూసినంతగా జనాలు ఆదరించడం లేదు.
Also Read: Sai Dharam Tej: యాక్సిడెంట్ తర్వాత తొలిసారి షూటింగ్ కు వచ్చిన సాయిధరమ్ తేజ్ కు ఇది షాకింగ్
బాహుబలి 2 మూవీ రెండు వారాలాకు పైగా అదే హైప్ కంటిన్యూ చేసింది. అధిక ఆక్యూపెన్సీని కొనసాగించింది. దాని బాక్స్ ఆఫీస్ ఉత్తర భారతదేశం, దక్షిణ భారతదేశం, తెలుగురాష్ట్రాలు, అమెరికాలో అన్ని ప్రాంతాల్లో ఒకే విధంగా ఉంది. సరిగ్గా ఈ కారణంగానే బాహుబలి 2 భారీ కలెక్షన్లు రికార్డులు నెలకొల్పింది.
‘ఆర్ఆర్ఆర్’ విషయానికి ఈ చిత్రం అమెరికాలో మాత్రమే బాగా నడుస్తోంది. మిగిలిన ప్రాంతాల్లో మిగిలిన ప్రాంతాల్లో మిశ్రమ ఫలితం వస్తోంది. మొదటి వారాంతం తర్వాత కూడా కలెక్షన్ల చుట్టూ ఉన్న హైప్ ను కొనసాగించడం లేదు. మరి ఆర్ఆర్ఆర్ టీం ఏం చేస్తుందన్నది వేచిచూడాలి.
నైజాంలో ఈ సినిమా ఇప్పటివరకూ దాదాపు రూ.45 కోట్లు వసూలు చేసింది. ఇంకా 10 కోట్ల వరకూ కలెక్షన్లు రావాల్సి ఉంది. సినిమా బ్రేక్ ఈవెన్ రావాలంటే 25 నుంచి రూ.28 కోట్లు రావాల్సి ఉంది.
ఆంధ్రా-సీడెడ్ ప్రాంతాలలో చిత్రం కలెక్షన్లు ఏమంతగా రావడం లేదని టాక్. హైప్ కు తగ్గట్టుగా కలెక్షన్లు రావడం లేదన్న నడుస్తోంది. మగధీర సమయంలోనూ ఇదే తరహాలో ప్రచారం చేసినా.. కలెక్షన్లు పెంచడానికి టీం కష్టపడింది. మగధీర బ్రేక్ ఈవెన్ సాధించేందుకు చాలా కష్టపడాల్సి వచ్చిందని రాజమౌళి కూడా ఒప్పుకున్నాడు. ఇప్పుడు ఆర్ఆర్ఆర్ కోసం ఏం చేస్తారన్నది వేచిచూడాలి.
Also Read: Chandrababu will Gives 40 Percent Tickets To Youth: యువతకే టికెట్లు.. చంద్రబాబు ప్లాన్ ఏంటి?